కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 13వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan 13th Installment) రెండు రోజుల క్రితం విడుదల చేసింది. 2022 డిసెంబర్ నుంచి 2023 మార్చి మధ్య విడుదల కావాల్సిన వాయిదాను రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. 8 కోట్ల మంది రైతుల అకౌంట్లలో రూ.16,000 కోట్లు జమ చేస్తోంది. రైతుల అకౌంట్లలో రూ.2,000 చొప్పున డబ్బులు జమ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా డబ్బులు పొందడానికి కొన్ని అర్హతలున్నాయి. ఆ అర్హతల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే అర్హులు కాని రైతులకు కూడా పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనర్హుల్ని గుర్తించి వారి నుంచి డబ్బుల్ని వెనక్కి తీసుకుంటోంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసే రైతులు పీఎం కిసాన్ స్కీమ్‌కు అనర్హులు. ఒకవేళ వారి ఖాతాలో డబ్బులు జమ అయితే ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయాలి. ప్రభుత్వం ఇలాంటి రైతుల్ని గుర్తించి డబ్బులు వెనక్కి తీసుకుంటోంది. అనర్హులైన రైతులు తమ అకౌంట్లలో పీఎం కిసాన్ డబ్బులు జమ అయినట్టైతే, ప్రభుత్వం గుర్తించడం కన్నా ముందే రీఫండ్ ఇచ్చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి.
Train Ticket Cancellation: ట్రైన్ టికెట్ క్యాన్సలేషన్స్‌తో రైల్వేకు రోజూ కోట్లల్లో ఆదాయం
Step 1- ముందుగా https://pmkisan.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Online Refund పైన క్లిక్ చేయాలి.
Step 3- అందులో రెండో ఆప్షన్ ఎంచుకోవాలి.
Step 4- ఆ తర్వాత ఆధార్ నెంబర్ , అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్‌లో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 5- ఆ తర్వాత సెలెక్ట్ చేసిన నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 6- ఇమేజ్ కోడ్ ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి.
Step 7- స్క్రీన్ పైన అకౌంట్‌లో జమ అయిన పీఎం కిసాన్ స్కీమ్ డబ్బుల వివరాలు కనిపిస్తాయి.
Step 8- రీఫండ్ పేమెంట్ పైన క్లిక్ చేసి, ఇమెయిల్ ఐడీ, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి.
Step 9- ఆ తర్వాతి పేజీలో అన్ని వివరాలు కనిపిస్తాయి.
Step 10- ఆ వివరాలు చెక్ చేసి కన్ఫామ్ చేయాలి.
Step 11- ఆ తర్వాత పేమెంట్ పేజీ వస్తుంది.
Step 12- పేమెంట్ పేజీలో బ్యాంక్ సెలెక్ట్ చేసి రీఫండ్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీలో ప్రీమియం తక్కువ... కవరేజీ ఎక్కువ
పీఎం కిసాన్ పథకం వివరాలు చూస్తే చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6,000 పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. మూడు వాయిదాల్లో రూ.2,000 చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, PM KISAN, PM Kisan Scheme, Pmkisan samman nidhi, Pradhan Mantri Kisan Samman Nidhi