హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Kisan 12th Installment: 10 రోజులైనా పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? డబ్బులు రాకపోతే కంప్లైంట్ చేయండిలా

PM Kisan 12th Installment: 10 రోజులైనా పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? డబ్బులు రాకపోతే కంప్లైంట్ చేయండిలా

PM Kisan 12th Installment: 10 రోజులైనా పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? డబ్బులు రాకపోతే కంప్లైంట్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

PM Kisan 12th Installment: 10 రోజులైనా పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? డబ్బులు రాకపోతే కంప్లైంట్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

PM Kisan 12th Installment | అక్టోబర్ 24 లోగా పీఎం కిసాన్ డబ్బులు (PM Kisan Amount) రైతుల అకౌంట్లలో జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ డబ్బులు రాకపోతే రైతులు ఫిర్యాదు చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM KISAN Scheme) సంబంధించిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను అక్టోబర్ 17న విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అదే వేదికపై నుంచి పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా 11 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రూ.2 లక్షల కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన రూ.16,000 కోట్లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.2.16 లక్షల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయడం విశేషం.

పీఎం కిసాన్ 12వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలై 10 రోజులైంది. ఇప్పటికీ కొందరు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అక్టోబర్ 24 లోగా పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ అవుతాయని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా డబ్బులు జమ కాకపోతే రైతులు పీఎం కిసాన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎలా కంప్లైంట్ చేయాలి? అని రైతుల్లో సందేహాలు ఉన్నాయి. కంప్లైంట్ చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి. అయితే రైతులు కంప్లైంట్ చేయడం కన్నా ముందు డబ్బులు జమ అయ్యాయో లేదో స్టేటస్ చెక్ చేసి తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఫిర్యాదు చేయాలి.

Aadhaar Complaints: మీ ఆధార్‌లో ఏవైనా సమస్యలున్నాయా? ఇలా కంప్లైంట్ చేయండి

Step 1- ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.

Step 2- Farmers Corner సెక్షన్‌లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి.

Step 3- రైతులు తమ ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి.

Step 4- రైతుల అకౌంట్‌లో 12వ ఇన్‌స్టాల్‌మెంట్ జమ అయిందో లేదో తెలుస్తుంది.

Savings Rule: మీరు కోటీశ్వరులు కావడానికి ఈ ఒక్క రూల్ చాలు... ఇలా పొదుపు చేయండి

ఒకవేళ రైతులకు 12వ ఇన్‌స్టాల్‌మెంట్ జమ కాకపోతే రైతులు పలు మార్గాల్లో కంప్లైంట్ చేయొచ్చు. ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే pmkisan-ict@gov.in లేదా pmkisan-funds@gov.in ఇమెయిల్ ఐడీల్లో కంప్లైంట్ చేయొచ్చు. లేదా 011-24300606, 155261 హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-115-526 కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

First published:

Tags: Farmers, PM KISAN, Pmkisan samman nidhi, Pradhan Mantri Kisan Samman Nidhi

ఉత్తమ కథలు