ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM KISAN Scheme) సంబంధించిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అదే వేదికపై నుంచి పీఎం కిసాన్ డబ్బుల్ని రైతుల అకౌంట్లలో ఒకే ఒక్క క్లిక్‌తో జమ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా 11 ఇన్స్టాల్మెంట్స్లో రూ.2 లక్షల కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రూ.16,000 కోట్లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.2.16 లక్షల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయడం విశేషం.
అయితే కేంద్ర ప్రభుత్వం విడతలవారీగా పీఎం కిసాన్ నిధుల్ని రైతుల అకౌంట్లలో జమ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకే రోజున డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కావు. అక్టోబర్ 24 లోగా రైతుల అకౌంట్లలో 12వ ఇన్స్టాల్మెంట్ జమ అవుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం మరో వారం రోజులు ఆగాల్సిందే. అంతలోపే రైతుల అకౌంట్లలోకి రూ.2,000 చొప్పున జమ అవుతుంది.
Gold Buying Tips: ధంతేరాస్ రోజున గోల్డ్ కొంటారా? ఈ టిప్స్ అస్సలు మర్చిపోవద్దు
12th instalment will be released under PM Kisan Samman Nidhi Yojana#PMKisan #agrigoi pic.twitter.com/JPl3GdeYE0
— Agriculture INDIA (@AgriGoI) October 17, 2022
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
Farmers Corner సెక్షన్లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి.
రైతులు తమ ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి.
రైతుల అకౌంట్లో 12వ ఇన్స్టాల్మెంట్ జమ అయిందో లేదో తెలుస్తుంది.
కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ నుంచి పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. 2019 ఫిబ్రవరిలో బడ్జెట్ సమయంలో ఈ పథకాన్ని ప్రారంభించినా అంతకన్నా రెండు నెలల ముందు నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌తో నాలుగేళ్లకు సంబంధించిన వాయిదాలు వచ్చినట్టే. అంటే పీఎం కిసాన్ పథకానికి నాలుగేళ్లు పూర్తయిందని అర్థం చేసుకోవచ్చు.
Gold Price Today: పసిడిప్రేమికులకు షాక్... ధంతేరాస్‌కు ముందు పెరుగుతున్న గోల్డ్ రేట్
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఓసారి రూ.2,000 చొప్పున ఏడాదికి రూ.6,000 రైతుల అకౌంట్లో జమ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, PM KISAN, PM Kisan Scheme, PM Narendra Modi, Pradhan Mantri Kisan Samman Nidhi