హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Kisan: వచ్చే వారమే పీఎం కిసాన్ నిధుల విడుదల... వారికి డబ్బులు రావు

PM Kisan: వచ్చే వారమే పీఎం కిసాన్ నిధుల విడుదల... వారికి డబ్బులు రావు

PM Kisan: వచ్చే వారమే పీఎం కిసాన్ నిధుల విడుదల... వారికి డబ్బులు రావు
(ప్రతీకాత్మక చిత్రం)

PM Kisan: వచ్చే వారమే పీఎం కిసాన్ నిధుల విడుదల... వారికి డబ్బులు రావు (ప్రతీకాత్మక చిత్రం)

PM Kisan 11th Installment | పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్. వచ్చేవారం పీఎం కిసాన్ నిధులు (PM Kisan Amount) విడుదల కానున్నాయి. కానీ వారికి డబ్బులు రావు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Scheme) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం వచ్చే వారమే నిధుల్ని విడుదల చేసే అవకాశం ఉంది. పీఎం కిసాన్ రైతులు ఇకేవైసీ (PM Kisan eKyc) ప్రాసెస్ పూర్తి చేయడానికి 2022 మే 31 చివరి తేదీగా ఉంది. మే 31న నిధులను విడుదల చేస్తామని ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. దీంతో రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. మే 31న లేదా ఆ తర్వాత పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది. మే 31 లోగా రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan 11th Installment) రూ.2,000 అకౌంట్‌లో జమ అవుతుంది.

పీఎం కిసాన్ డబ్బులు రైతులందరికీ రావు. అర్హులైన రైతులకు మాత్రమే ప్రతీ ఏటా పీఎం కిసాన్ పథకం ద్వారా మూడు సార్లు రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే ఈసారి ఇకేవైసీ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి. ఇకేవైసీ చేయని రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చే అవకాశం లేదు.

New Rules: ప్రజలకు అలర్ట్... జూన్‌లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

ఇక పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా ఏ రైతులు అర్హులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. ఈ కింది జాబితాలో ఉన్నవారెవరికీ పీఎం కిసాన్ పథకం వర్తించదు.

1. ఇన్‌స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్

2. రైతుల కుటుంబాల్లో కింద వివరించిన వారు ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే వారికి పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు.

i) గతంలో లేదా ప్రస్తుతం రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు.

ii) మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ లోక్‌సభ సభ్యులు, ప్రస్తుత లోక్‌సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులు, మునిసిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్లు, ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయతీ ప్రస్తుత ఛైర్‌పర్సన్స్, మాజీ ఛైర్‌పర్సన్స్.

iii) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, విభాగాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, అధికారులు, స్థానిక సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులకు మినహాయింపు).

PAN Card Rule: పాన్ కార్డ్ ఉన్నవారికి నేటి నుంచి కొత్త రూల్... వివరాలు ఇవ్వాల్సిందే

iv) పైన చెప్పిన కేటగిరీలో నెలవారీ పెన్షన్ రూ.10,000 కన్నా ఎక్కువ ఉన్న సూపర్‌యాన్యుయేట్, రిటైర్డ్ పెన్షనర్లు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులకు మినహాయింపు).

v) గత అసెస్‌మెంట్ ఇయర్‌లో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు.

vi) ప్రొఫెషనల్ బాడీస్‌లో రిజిస్టర్ అయి ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్కీమ్. రైతుల కుటుంబాల్లో పైన చెప్పినవారు ఎవరు ఉన్నా వారికి పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు. ఈ వివరాలన్నీ పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

First published:

Tags: Farmer, PM KISAN, Pm kisan application, PM Kisan Scheme, Pmkisan samman nidhi, Pradhan Mantri Kisan Samman Nidhi

ఉత్తమ కథలు