హోమ్ /వార్తలు /బిజినెస్ /

Plot vs Flat: స్థలం కన్నా అపార్ట్‌మెంట్లో‌ FLat కొంటేనే చాలా లాభదాయకం...ఈ లాజిక్ తెలిస్తే షాక్ అవుతారు...

Plot vs Flat: స్థలం కన్నా అపార్ట్‌మెంట్లో‌ FLat కొంటేనే చాలా లాభదాయకం...ఈ లాజిక్ తెలిస్తే షాక్ అవుతారు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

భూమి మీద పెట్టుబడి పెడితే నష్టం ఉండదని బల్లగుద్ది వాదిస్తుంటారు. కానీ కొందరు నిపుణులు మాత్రం Plot కన్నా కూడా అపార్ట్ మెంట్లో Flat కొంటే అంతకంటే ఎక్కువే లాభమని లాజిక్ వినిపిస్తున్నారు. నమ్మకం కలగడం లేదా... మరి ఆ లాజిక్ ఏంటో చూద్దామా...

ఇంకా చదవండి ...

కొన్ని సందర్భాల్లో Plot కన్నా అపార్ట్ మెంట్లో Flat కొంటేనే బెటర్. చాలా మంది ప్లాట్ కొంటే చాలా రెట్లు పెరిగి లక్షలు కోట్లు అవుతాయని నమ్ముతారు. అంతేకాదు భూమి మీద పెట్టుబడి పెడితే నష్టం ఉండదని బల్లగుద్ది వాదిస్తుంటారు. కానీ కొందరు నిపుణులు మాత్రం Plot కన్నా కూడా అపార్ట్ మెంట్లో Flat కొంటే అంతకంటే ఎక్కువే లాభమని లాజిక్  వినిపిస్తున్నారు. అయితే మనం ఊహించిన దానికంటే ప్లాట్ కన్నా కూడా అపార్ట్ మెంట్లో Flat కొంటేనే అనేక రెట్లు లాభం అందించే వీలుంది. నమ్మకం కలగడం లేదా... మరి ఆ లాజిక్ ఏంటో చూద్దామా...

Plot కన్నా కూడా అపార్ట్ మెంట్లో Flatయే లాభమంటూ వాదన:

పెట్టుబడి పరంగా చూస్తే అపార్ట్ మెంట్లో Flatమీద అత్యంత అధిక రాబడి సాధ్యమవుతుందన్న విషయం చాలా మంది గుర్తించరు. మన కలల గృహాన్ని కనీసం 80 శాతం రుణంతో కొనుగోలు చేస్తే, ఇతర పెట్టుబడి సాధనాల కంటే అపార్ట్ మెంట్లో Flat కొంటేనే చాలా లాభదాయకం అనే చెప్పవచ్చు.  చాలా మందికి పెట్టుబడి అనగానే గుర్తుకు వచ్చేవి బంగారం, స్టాక్ మార్కెట్లో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్ డ్ డిపాజిట్లు, బాండ్లు గుర్తుకు వస్తాయి.అయితే అన్నింటికన్నా ఉత్తమమైనది, అధిక ఆదాయం తెచ్చేది Flat మాత్రమే ఎలాగో ఈ లాజిక్ చెబితే మీరే ఆశ్చర్యపోతారు. చాలా మంది Flat కన్నా కూడా Plot కొంటే లాభమని వాదిస్తుంటారు. లాజికల్ గా ఆలోచిస్తే Flat మీద పెట్టుబడి పెట్టడమే సరైన నిర్ణయమని కొందరు నిపుణులు వాదిస్తున్నారు.

Flat కొనుగోలు చేసేందుకు 90 శాతం రుణం లభించే చాన్స్..

నిపుణుల ఉద్దేశ్యం ప్రకారం Plot కొనుగోలు చేసేందుకు లోన్ ఎక్కువగా రాదు. అదే Flat కొనుగోలు చేస్తే మాత్రం 80 నుంచి 90 శాతం వరకూ లోన్ వచ్చే అవకాశం ఉంది. అయితే Plot కొనుగోలు చేసినప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీకు అందుకు తగిన లాభం కావాలంటే మాత్రం కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు ఆగాల్సిందే. కానీ Flat కొనుగోలు చేసి అమ్మితే మాత్రం మీకు రిటర్న్ కాస్త తక్కువే ఉంటుంది. అయితే Plot మీద మీకు మధ్యలో ఆదాయం ఉండదు. కానీ Flat మీద మాత్రం రెంట్ రూపంలో మీకు ఆదాయం లభిస్తుంది. ఒక వేళ మీరు నివాసం ఉంటే అద్దె కలిసి వస్తుంది.

Flat కంటే Plot యే లాభం లాజిక్ ఇదే...

Plot కన్నా కూడా అపార్ట్ మెంట్లో Flatయే లాభం ఎలాగంటే...ఉదాహరణకు ఒక చిన్న సైజు Flat ధర రూ.20 లక్షలు అనుకుందాం. దీనిపై మీరు ఆరంభంలో పెట్టే పెట్టుబడి కేవలం రూ.4 లక్షలు అంటే 20 శాతం మాత్రమే. మిగితా రూ.16 లక్షలను బ్యాంకు రుణం ఇస్తుంది. పైగా ఈ రుణం చెల్లించేందుకు గరిష్టంగా 20 సంవత్సరాలు వరకూ సమయం ఇస్తారు. ఇక వడ్డీ శాతం కూడా చూసుకుంటే 10 శాతం వరకూ ఉంటుంది. ఇక మన దేశంలో ద్రవ్యోల్బణం 6 శాతానికి పరిగణలోకి తీసుకుంటే, వడ్డీ రేటు 10 శాతం ఉంటే అందులో నుంచి 6 శాతాన్ని మినహాయిస్తే, మొదటి ఏడాది మనం చెల్లించేది 4 శాతమే. మరుసటి సంవత్సరం కూడా అదే ద్రవ్యోల్బణం ఉంటే మనం కట్టే వడ్డీ మైనస్ 2 శాతం అవుతుంది. రూ.16 లక్షల రుణానికి మహా అయితే రూ.14 వేల వరకూ EMI చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇంటిని అద్దెకు ఇస్తే నెలకు రూ.8 వేల వరకూ ఆదాయం వస్తుంది. పైగా 4 వేల రూపాయల వరకూ ఆదాయ పన్ను రాయితీ కూడా ఉంటుంది. ఈ రెండింటిని లెక్కిస్తే (రూ.8 వేలు అద్దె + రూ.4 వేలు ఆదాయపన్ను రాయితీ = రూ.12 వేలు) ఇక మిగిలింది రూ.2 వేలు మాత్రమే. ఇలా 20 సంవత్సరాలు చెల్లిస్తాం. ఇలా 4-5 సంవత్సరాలు గడిస్తే ఇంటి రుణం ఇల్లే తీర్చేస్తుంది. నమ్మబుద్ధి కావడం లేదు కదూ....

అయితే మీరు అపార్ట్ మెంట్లో Flat ను 80 శాతం బ్యాంకు రుణం తీసుకుంటేనే సాధ్యం అవుతుంది. మరో ఉదాహరణ చూస్తే...2000 సంవత్సరంలో సురేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని నారాయణ గూడ ప్రాంతంలో డబుల్ బెడ్రూం Flat ను రూ.5 లక్షలకు కొనుగోలు చేశాడు. అందులో రూ.4 లక్షల రుణం తీసుకున్నాడు. వడ్డీ రేటు 10 శాతం అనుకుంటే, అతడు 20 సంవత్సరాలకు చెల్లించాల్సిన EMI రూ.3500 వరకూ పడింది. కాగా సురేష్ వేతనం 2000 సంవత్సరంలో రూ.10 వేలు పొందేవాడు. అయితే అప్పట్లో అతడి వేతనంతో పోల్చితే EMI ఎక్కువగా ఉంది. అదే సమయంలో హైదరాబాద్ లోని మంచి ఏరియాలో అద్దెలు కేవలం 2 నుంచి 3 వేలు మాత్రమే ఉన్నాయి. అలాంటి సమయంలో అతడి నిర్ణయం తెలివి తక్కువదని అనవసరంగా ఎక్కువ మొత్తంలో EMI చెల్లిస్తున్నాడని అంతా అనుకున్నారు. సరిగ్గా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటికీ అతడి వేతనం 15 వేలు అయ్యింది. అప్పుడు అతడు చెల్లించే ఈఎంఐ మాత్రం రూ.3500 మాత్రమే ఉండిపోయింది. అంటే అతడి వేతనంతో పోల్చితే ఈఎంఐ తగ్గిపోయింది. అలా పది సంవత్సరాలు గడిచిపోయాయి. సురేష్ వేతనం 35 వేలు అయ్యింది. కానీ ఈఎంఐ మాత్రం ఇంకా రూ.3500 మాత్రమే. అంటే సురేష్ వేతనం పెరుగుతోంది. కానీ EMI మాత్రం అంతే ఉండిపోయింది

ఏటా అద్దె పెరుగుతుంది...కానీ EMI పెరగదు...

ఇక మరో లాభం ఏంటంటే గడిచిన పది సంవత్సరాల్లో హైదరాబాద్ లో అద్దెలు భారీగా పెరిగిపోయాయి. ఏటా అద్దె అయితే పెరుగుతుంది. కానీ EMI మాత్రం పెరగదు అనే సంగతి గుర్తుంచుకోవాలి. సురేష్ సరిగ్గా 20 సంవత్సరాలు తిరిగి చూసుకుంటే అతడి వేతనం రూ.1 లక్ష రూపాయలు దాటిపోయింది. కానీ అతడు చెల్లించాల్సిన ఈఎంఐ మాత్రం ఇంకా 3500 మాత్రమే ఉండిపోయింది. ఇక Flat వాల్యూ విషయానికి వస్తే దాదాపు పది రెట్లు పెరిగి 50 లక్షలు అయ్యింది. ఇక 20 సంవత్సరాల అద్దె కూడా సురేష్ కు మిగలగడంతో పాటు 50 లక్షల రూపాయల ఆస్తి మిగిలింది. 20 సంవత్సరాల క్రితం ఎవరైతే సురేష్ నిర్ణయాన్ని తెలివి తక్కువ నిర్ణయంగా భావించారో వారు ఇఫ్పుడు ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక రూ. 5 లక్షల పెట్టుబడికి రూ.50 లక్షల లాభంతో పాటు సుమారు 20 సంవత్సరాల అద్దెను కూడా జత చేసుకుంటే మీరు పెట్టిన పెట్టుబడి నథింగ్ అనే చెప్పాలి. ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోల్చితే మీరు చెల్లించిన EMI చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకుంటే 20 సంవత్సరాల క్రితం మీ వేతనం ఇప్పటి వేతనం భారీగా పెరిగుతుంది. అంతేకాదు అద్దెకు ఇచ్చినా మీకు లాభదాయకమే. Plot కు అద్దె ఆదాయం ఉండదు. కానీ Flat కు మాత్రం ఆదాయం వస్తుంది.

' isDesktop="true" id="663228" youtubeid="RMiiWTPPFsE" category="business">

ద్రవ్యోల్బణానికి విరుగుడు లోన్ తీసుకొని ఇల్లు కొనడమే...

మన దేశంలో ద్రవ్యోల్బణానికి విరుగుడు ఏంటంటే ఇంటిరుణం తీసుకొని ఇల్లు కొనుగోలు చేయడమే...ఈ విషయం తెలియక తికమక పడుతుంటారు. ఇక అపార్ట్ మెంట్ నిర్మించినప్పుడు అన్ డివైడెడ్ స్థలం కింద మీరు 30 నుంచి 50 గజాల స్థలం దక్కుతుంది. ప్రస్తుతం పెరుగుతున్న భూమి విలువతో పోల్చినా మీకు లాభమే. ప్రస్తుతం హైదరాబాద్ లో చదరపు గజం ప్రైమ్ లొకేషన్లలో రూ.50 వేల నుంచి రూ. లక్ష పలుకుతోంది. ఈ నేపథ్యంలో అపార్ట్ మెంట్ లో Flat కచ్చితంగా లాభదాయకమే.

First published:

Tags: Real estate in Hyderabad

ఉత్తమ కథలు