• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • PLAY GO INDIA GAME ON GOOGLE PAY AND WIN UP TO RS 501 KNOW HOW TO PLAY SS

Google Pay: గూగుల్ పే ఉందా? ఈ గేమ్ ఆడితే రూ.501 మీవే

Google Pay: గూగుల్ పే ఉందా? ఈ గేమ్ ఆడితే రూ.501 మీవే

Google Pay: గూగుల్ పే ఉందా? ఈ గేమ్ ఆడితే రూ.501 మీవే (image: Google Pay)

Google Pay Go India | టైంపాస్‌కి గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? గూగుల్ పే కొత్తగా గో ఇండియా పేరుతో గేమ్ ప్రారంభించింది. డబ్బులు కూడా గెలుచుకోవచ్చు.

  • Share this:
    గూగుల్ పే... డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్. యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం దగ్గర్నుంచి బిల్ పేమెంట్స్ వరకు అన్నీ సాధ్యం. అంతేకాదు... గూగుల్ పే ఇచ్చే స్క్రాచ్ కార్డ్స్‌తో డబ్బులు కూడా గెలుచుకోవచ్చు. కూపన్స్ కూడా వస్తాయి. వీటితో పాటు ఇటీవల ఈ యాప్‌లో కొత్తగా గేమ్ కూడా లాంఛ్ చేసింది గూగుల్. ఈ గేమ్‌తో డబ్బులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది గూగుల్. 'గో ఇండియా' పేరుతో మీకు గూగుల్ పే యాప్‌లో గేమ్ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ గేమ్ ఆడొచ్చు. రూ.501 వరకు గెలుచుకోవచ్చు. ఈ గేమ్ చాలా సింపుల్. టికెట్లు, కిలోమీటర్లు కలెక్ట్ చేసి భారతదేశంలోని వేర్వేరు నగరాల్లో తిరగడమే. అంటే గేమ్‌లోనే మీరు ఉన్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరుగుతూ దేశమంతా కవర్ చేయాలి. టికెట్లు, కిలోమీటర్లు కలెక్ట్ చేస్తూ దేశమంతా చుట్టేయాలి.

    SBI Alert Message: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... ఈ 5 తప్పులు చేయొద్దంటున్న బ్యాంకు

    IRCTC Coorg Tour: కూర్గ్ అందాలు చూడాలనుకుంటున్నారా? టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

    మీరు గూగుల్ పే యాప్‌లో 'గో ఇండియా' గేమ్ స్టార్ట్ చేయగానే వర్చువల్ కార్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. మీరు టికెట్ పైన క్లిక్ చేస్తే ఆ ఊరికి వెళ్తారు. ప్లేసెస్ పేర్లు మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ట్రాన్సాక్షన్స్ చేసిన ప్రతీసారి టికెట్స్ వస్తుంటాయి. ఆ టికెట్స్‌తో మీరు ప్రయాణించొచ్చు. మీ దగ్గర టికెట్స్ లేకపోతే స్నేహితులను కూడా అడగొచ్చు. మీ దగ్గర అదనంగా ఉన్న టికెట్స్‌ని మీ స్నేహితులకు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఒక రోజులో మీరు మూడు సిటీస్ మాత్రమే తిరిగే అవకాశం ఉంటుంది. 'గో ఇండియా' గేమ్‌లో క్విజ్ కాంపిటీషన్, వర్చువల్ కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా రూ.100, అదనంగా టికెట్లు, కిలోమీటర్లు గెలుచుకోవచ్చు.మీరు ఏఏ ప్రాంతాలను కవర్ చేశారో గేమ్‌లో ఉండే మ్యాప్‌లో చూడొచ్చు. ఇలా మీరు దేశంలోని అన్ని ప్రాంతాలు తిరిగితే కనీసం రూ.101 రివార్డ్ లభిస్తుంది. మీరు 'గో ఇండియా' ఛాంపియన్ అయితే రూ.501 మీవే.

    ఈ గేమ్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఓసారి చదివి గేమ్ స్టార్ట్ చేయాలి. నవంబర్ 25 లోగా మీరు అన్ని సిటీస్ తిరగాల్సి ఉంటుంది. మీకు టికెట్స్ లేదా కిలోమీటర్స్ లేకపోతే పేమెంట్ చేయడం ద్వారా వాటిని పొందొచ్చు. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఎక్కువ టికెట్లు, కిలోమీటర్లు వస్తాయి. కిలోమీటర్లు ఉపయోగించకపోతే 48 గంటల్లో ఎక్స్‌పైరీ అవుతాయి. అందుకే మీ దగ్గర కిలోమీటర్లు, టికెట్లు ఉన్నాయంటే గేమ్‌లో ముందుకు వెళ్లొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు