PLANNING TO TAKE A CAR LOAN IN NEW YEAR FIND OUT IF YOU SHOULD OPT FOR A SHORTER OR LONGER TENURE GH VB
Car loan: కారు లోన్ తీసుకుంటున్నారా?.. అయితే.. వడ్డీ భారం తగ్గించుకునేందుకు ఇలా చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించి కారు కొనుగోలు చేయడం మధ్యతరగతి ప్రజలకు కష్టంతో కూడుకున్న పని. అందుకోసమే అనేక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కారు లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లకే వీటిని అందజేస్తున్నాయి. అయితే, కార్ లోన్ తీసుకునే సమయంలో వడ్డీ భారం తగ్గించుకునేందుకు అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అవేంటో చూద్దాం.
ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే కారు ఇప్పుడు సాధారణ మధ్య తరగతి ప్రజలకు కూడా చేరువైంది. ఒకప్పుడు కారుని లగ్జరీగా పరిగణించేవారు.. కానీ ఇప్పుడు ఇది అవసరంగా మారిపోంది. ముఖ్యంగా కరోనా తర్వాత వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత పెరగడంతో కార్ల కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. అయితే, ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించి కారు కొనుగోలు చేయడం మధ్యతరగతి ప్రజలకు కష్టంతో కూడుకున్న పని. అందుకోసమే అనేక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కారు లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లకే వీటిని అందజేస్తున్నాయి. అయితే, కార్ లోన్ తీసుకునే సమయంలో వడ్డీ భారం తగ్గించుకునేందుకు అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అవేంటో చూద్దాం.
కాలపరిమితి ఎంత ఉండాలి?
సాధారణంగా 7 నుంచి 8 సంవత్సరాల గరిష్ఠ కాలపరిమితితో కారు రుణాలు ఇస్తుంటాయి బ్యాంకులు. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 7 సంవత్సరాల కాలవ్యవధితో కారు రుణాలను ఆఫర్ చేస్తోంది. అయితే, 7 సంవత్సరాల వ్యవధిలో చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ.. 3 నుంచి 4 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. లోన్ టెన్యూర్‌ను ఎంచుకునే క్రమంలో ఈఎంఐని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. అయితే, తక్కువ కాలపరిమితి ఉంటే నెలవారీ ఈఎంఐ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, మీ వడ్డీ భారం తగ్గుతుందని గమనించండి.
ఎక్కువ లోన్ టెన్యూర్ ఈఎంఐలపై ఎలా ప్రభావం చూపిస్తుంది?
ఎక్కువ లోన్ టెన్యూర్ ఎంచుకోవడం వల్ల ఈఎంఐ భారం తగ్గుతుంది. కాబట్టి ప్రతినెలా కొద్ది మొత్తంలో డబ్బు చెల్లిస్తే సరిపోతుందని చాలా మంది ఎక్కువ వ్యవధి ఎంచుకుంటారు. అందుకే కాలపరిమితి ఎక్కువ ఆఫర్ చేస్తున్న బ్యాంకుల కోసం అన్వేషిస్తుంటారు. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. రుణం చెల్లించే ప్రారంభ సంవత్సరాల్లో ఈఎంఐలో అధిక భాగం వడ్డీ ఉంటుంది. తక్కువ ఈఎంఐను ఎంచుకోవడం వల్ల అందులో ఎక్కువ భాగం వడ్డీయే ఉంటుంది. కాబట్టి అసలు మొత్తం దాదాపు అలాగే ఉండిపోతుంది. అంటే, మొత్తంగా చూసుకుంటే ఎక్కువ కాలపరిమితి ఎంచుకోవడం ద్వారా మీరు వడ్డీ ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని గమనించండి.
ఇక్కడ పరిగణనలోకి తీసుకోదగ్గ మరో ముఖ్య విషయం ఏంటంటే.. కారు సగటు వినియోగ వ్యవధి సాధారణంగా 5 నుంచి 6 సంవత్సరాలు ఉంటుంది. ఆటోమొబైల్ సంస్థలు 8 సంవత్సరాల వారెంటీ ఇవ్వవు కాబట్టి ఆ తర్వాత నిర్వహణ వ్యయం పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో, ఈఎంఐలకు ఈ ఖర్చులు తోడై మీపై భారం మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల తక్కువ వ్యవధితో కారు లోన్ తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.