HOME »NEWS »BUSINESS »planning to invest money follow these 6 best ways ns gh

Investment Tips: పెట్టుబడిపై అధిక రాబడి పొందాలనుకుంటున్నారా..? అయితే, ఈ 6 చిట్కాలను పాటించండి

Investment Tips: పెట్టుబడిపై అధిక రాబడి పొందాలనుకుంటున్నారా..? అయితే, ఈ 6 చిట్కాలను పాటించండి
ప్రతీకాత్మక చిత్రం

కష్టపడి సంపాదించిన డబ్బును మరింత రెట్టింపు చేయడానికి, దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని కొట్టే రాబడిని అందించడానికి ఉత్తమ పెట్టుబడి మార్గాలను అనుసరించాలి. మీ ఆదాయం, రిస్క్ తీసుకునే సామర్ధ్యాలు(risk- taking abilities), వయస్సు ఆధారంగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలి. మీ సంపదను రెట్టింపు చేసుకోవడానికి ఈ ఉత్తమ చిట్కాలను అనుసరించండి.

  • Share this:
కరోనా(Corona) మహమ్మారి పెట్టుబడిదారుల ఆలోచనలను సమూలంగా మార్చేసింది. కరోనాతో వ్యక్తిగత ఆదాయం తగ్గడంతో అందరూ తమ పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి ఒక్కరి జీవితంలో సంపాదన ఎంత ముఖ్యమో.. పొదుపు(savings) కూడా అంతే ముఖ్యమని తెలిసేలా చేసింది. ప్రతీ ఒక్కరూ తమ సంపాదనలో కొంత మేర వివిధ మార్గాల్లో పెట్టుబడి(investment) పెట్టి భవిష్యత్తులో అనుకోని విపత్కర పరిస్థితులు, పిల్లల చుదువు, వారి పెళ్ళి, రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని సాఫీగా గడపడానికి ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. అయితే, ఇలా పెట్టుబడి(investment) పెట్టడంతో పాటు ఆ పెట్టుబడిపై సంపాదించిన మొత్తాన్ని కూడా క్రమం తప్పకుండా తిరిగి పెట్టుబడి పెట్టడం కూడా ముఖ్యమని గుర్తించుకోండి. కష్టపడి సంపాదించిన డబ్బును మరింత రెట్టింపు చేయడానికి, దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని కొట్టే రాబడిని అందించడానికి ఉత్తమ పెట్టుబడి మార్గాలను అనుసరించాలి. మీ ఆదాయం, రిస్క్ తీసుకునే సామర్ధ్యాలు(risk- taking abilities), వయస్సు ఆధారంగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలి. పెట్టుబడి సమయంలో తెలివైన నిర్ణయాలను తీసుకోండి. మీ సంపదను రెట్టింపు చేసుకోవడానికి ఈ ఉత్తమ చిట్కాలను అనుసరించండి.

1) యవ్వనంలోనే పెట్టుబడి ప్రారంభించండి


జీవితంలో సమయం చాలా విలువైనది. కాబట్టి, మీరు సంపాదన మొదలుపెట్టిన రోజు నుంచే సమయం వృథా చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం వివిధ పెట్టుబడి మార్గాలను అన్వేషించండి. ఇది దీర్ఘకాలంలో మీ డబ్బు పెరగడానికి, మంచి రిటర్న్స్(returns ) రావడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, 22 ఏళ్ల వ్యక్తి 2020లో ఏటా రూ .50 వేలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే, అతను 2035లో అనగా 37 ఏళ్లు వచ్చే నాటికి 13.56 లక్షల రూపాయల కార్పస్‌ ఫండ్ను నిర్మించగలడు. ఇది అతని ఇంటి నిర్మాణానికి లేదా అతని రిటైర్మెంట్ (retirement )తర్వాత కావాల్సిన నిధి పునాదిని నిర్మించడంలో సహాయపడుతుంది. మీ పెట్టుబడిపై సంపాదించిన రాబడిని క్రమం తప్పకుండా తిరిగి పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో లాభిస్తుందని గుర్తించుకోండి.

2) మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి
అధిక రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్(mutual fund) గొప్ప పెట్టుబడి ఎంపిక. మీ పెట్టుబడి పనితీరును మెరుగుపరచడానికి, మీ ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమ మార్గం. దీని ద్వారా సంవత్సరంలో మీ ఆదాయం 10% మేర పెరుగుతుందని గుర్తించుకోండి. ఏటా మీ పెట్టుబడులను పెంచడం మీ ఆర్థిక లక్ష్యాల వైపు వేగవంతం చేయడంలో మీకు సహాయపడుతుంది, అంతేకాక, ఇది ద్రవ్యోల్బణాన్ని అధిగమించడాన్ని సులభతరం చేస్తుంది. ఉదాహరణకు, రూ. 15 సంవత్సరాల పాటు ఈక్విటీ ఫండ్‌లో ప్రతి నెలా 10,000 మేర పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల తరువాత అది మొత్తం రూ .86.39 లక్షల కార్పస్‌ ఫండ్ను నిర్మిస్తుంది.

3) ఎఫ్డిలో పెట్టుబడికి లాడరింగ్ టెక్నిక్ ను అనుసరించండి
రిస్క్ లేని పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి అనుకునేవారు, గ్యారెంటీ రిటెర్న్స్లను ఇచ్చే ఫిక్స్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. అయితే, ఎఫ్డిలపై వచ్చే వడ్డీ రేట్లు కొన్ని సార్లు ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు కంటే తక్కువగా ఉంటాయని గుర్తించుకోండి. ముఖ్యంగా ఇది పెట్టుబడి పెట్టిన మూలధనంలో కోతకు దారితీస్తుంది. దీనిని నివారించడానికి, మీరు FD లాడరింగ్ టెక్నిక్(laddering technique )ను అనుసరించండి. ఈ టెక్నిక్ కింద, మీ మొత్తం కార్పస్‌ను ఒకే ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా, దాన్ని వేర్వేరు పదవీకాలంతో మల్టిపుల్ ఎఫ్‌డిలుగా విభజించవచ్చు.

4) రిస్క్ లేని పెట్టుబడి మార్గాల వైపు వెళ్లండి
మీరు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోండి. మీ వయస్సు, నైపుణ్యం వంటివి మాత్రమే కాకుండా మీ ఆదాయం, ఖర్చులు, పొదుపులు, తిరిగి చెల్లించే రికార్డు, బాధ్యతలు, ఇప్పటికే ఉన్న పెట్టుబడులు, భీమా రక్షణ మొదలైనవి మీ రిస్క్ టాలరెన్స్‌(risk tolerance )ను నిర్వచిస్తాయని గుర్తించుకోండి. మీరు సంపద సృష్టిని పెంచుకోవాలనుకుంటే, మీ రిస్క్ టాలరెన్స్ స్థాయిని అంచనా వేయాలి. అవసరాలు, అవకాశాలు ఉన్నప్పుడు తగిన స్థాయిలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం.

5) రుణాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించండి
సాధ్యమైనంత వరకు అవసరం మేరకే రుణాలను తీసుకోవాలి. భవిష్యత్లో మంచి రాబడినిచ్చే వాటిపై రుణాలు తీసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఉత్తమ రుణ ఆఫర్ల(loan offers )ను పొందడానికి వివిధ బ్యాంకులు అమలు చేస్తున్న వడ్డీ రేట్లను పరిశీలించండి. అనవసరమైన రుణాలు తీసుకోవడం లేదా అధికంగా రుణాలు తీసుకోవడం, క్రెడిట్ కార్డ్(credit card) ఖర్చులను అదుపులో ఉంచడం, అదనపు వడ్డీని చెల్లించకుండా ఉండటానికి నెలవారీ బకాయిల ఆటో-డెబిట్ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోవడం వంటి వాటి ద్వారా మెరుగైన రుణాలు పొందవచ్చని గుర్తించుకోండి. అంతేకాక, తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా దీర్ఘకాలిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని గుర్తించుకోండి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌(credit score )ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా భవిష్యత్తులో మీకు ఉత్తమ లోన్ ఆఫర్లను అందుకోవచ్చు.

6) గుర్తుంచుకోవలసిన ఇతర అంశాలు
సంపదను సృష్టించేటప్పుడు, తక్కువ ఖర్చు చేయడం, ఎక్కువ ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. మీ ఆదాయాన్ని EMI లు, అద్దె(rent), కిరాణా(groceries), యుటిలిటీస్(utilities), పిల్లల స్కూలు ఫీజులు వంటి అధిక ప్రాధాన్యత గల ఖర్చులను అంచనా వేయాలి. ఇది మీరు ఎంత డబ్బు ఆదా చేయవచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు అనే దాని గురించి ఒక అంచనా ఏర్పరుస్తుంది. ఉద్యోగ నష్టం లేదా ప్రమాదాలు వంటి ఊహించని సంఘటనల విషయంలో మిమ్మల్ని ముందుకు నడిపించడానికి అత్యవసర నిధిని ఏర్పర్చుకోవడం చాలా ముఖ్యం. మీ కోసం, మీపై ఆధారపడినవారికి తగిన జీవిత, ఆరోగ్య బీమా రక్షణ (health insurance cover )కల్పించడం ద్వారా మీరు ఆరోగ్య ప్రమాదాలకు అయ్యే ఖర్చును తగ్గించవచ్చు. సంపద సృష్టి దీర్ఘకాలిక, స్థిరమైన ప్రక్రియ. మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్, లిక్విడిటీ అవసరాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ కఠినమైన ఆర్థిక క్రమశిక్షణతో తెలివిగా పెట్టుబడి పెట్టండి.
Published by:Nikhil Kumar S
First published:December 28, 2020, 11:53 IST