Home /News /business /

PLANNING TO INVEST IN IPOS HERE ARE SOME THINGS TO KEEP IN MIND GH VB

IPO Investments: IPOలలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..? ఈ విషయాలు గమనించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒకప్పుడు ఐపీఓలలో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేవారు కాదు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మందికి వర్క్​ ఫ్రం హోం సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఇలా ఇంట్లోనే ఉంటూ పని చేయడంతో ఇన్వెస్ట్ చేయడానికి ఉద్యోగులకు మునుపటి కంటే ఎక్కువ సమయం లభించింది. దీంతో వారు IPO ల గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టారు.

ఇంకా చదవండి ...
ఈ రోజుల్లో చాలా కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ (IPO) కు వస్తున్నాయి. ఒకప్పుడు పేరు మోసిన పెద్ద కంపెనీలు మాత్రమే ఇలా మార్కెట్లోకి వచ్చేవి. కానీ ప్రస్తుతం చిన్న పెట్టుబడులు ఉన్న సంస్థలు, స్టారప్​లు కూడా IPOల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి IPOల్లో పెట్టుబడులు (Investment) పెట్టాలని ఎవరికైనా అనుమానాలు రావడం సహజం. ఒకప్పుడు ఐపీఓలలో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేవారు కాదు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మందికి వర్క్​ ఫ్రం హోం సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఇలా ఇంట్లోనే ఉంటూ పని చేయడంతో ఇన్వెస్ట్ చేయడానికి ఉద్యోగులకు మునుపటి కంటే ఎక్కువ సమయం లభించింది. దీంతో వారు IPO ల గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టారు.

Business Idea: ఈ వ్యాపారంతో రూ.15 లక్షల లాభం... వ్యవసాయం కాస్త తెలిస్తే చాలు

మహమ్మారి తర్వాత ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం ఆప్షన్ వచ్చింది. ఆ తర్వాత స్టాక్స్(Stocks)​లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య క్రమంగా పెరిగిందని చాలా మంది మార్కెట్​ నిపుణులు(Market Experts) చెప్పారు. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఆన్​లైన్ జమానాలో డిజిటల్ డోల్డ్‌తో పాటు స్టాక్స్​లో పెట్టుబడులు పెట్టడం చాలా తేలిక. స్టాక్స్​లో పెట్టుబడులు పెరిగేందుకు ఇది కూడా ఒక కారణంగా పని చేసింది. స్టాక్స్​లో పెట్టుబడులు పెట్టడం చాలా తేలికే కానీ ఎలా పెట్టుబడులు పెట్టాలో ఎటువంటి స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే మీరు అనవసరంగా నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. కంపెనీ ఏవిధంగా ఆదాయాన్ని అర్జిస్తుందో మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ కంపెనీ IPOలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం.

Business Idea: తక్కువ పెట్టుబడితో చిన్న బిజినెస్... నెలకు రూ.40,000 వరకు లాభం

గమనించాల్సిన విషయాలు
ఆర్థిక విషయాలు స్పష్టంగా ఉండే కంపెనీ IPOల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. కంపెనీ భవిష్యత్తులో ఎటువంటి పర్ఫామెన్స్ ఇస్తుందనే విషయాలను కూడా గమనించాలి. మీరు ఒక కొత్త కంపెనీ IPOలో పెట్టుబడులు పెట్టాలని భావించినపుడు ఆ కంపెనీ షేర్ ధర గురించి ఎనలైజ్ చేయడం చాలా అవసరం. వారు ఎంత ధర నిర్ణయించినా కొనకూడదు. ముందు బలమైన ఫండమెంటల్స్​ ఉన్న IPOలను ఎంచుకోవాలి. అవి భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలను రాబడతాయి.

ఆ ప్రచారం నమ్మకూడదు..
హైప్ కారణంగా ఒక సంస్థ IPOలో పెట్టుబడులు పెట్టడం మంచి విధానం కాదని అనేక మంది మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా హైప్​తో స్టార్ట్ అయిన చాలా కంపెనీలు సరిగ్గా పర్ఫామ్ చేయలేక చతికిల పడిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిన IPOలలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని అనుకోవడం చాలా అవివేకం. అందువల్ల మొదటిసారి ఇన్వెస్ట్ చేసేవారు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానర్స్ సలహాతో ముందుకెళ్లాలి.
Published by:Veera Babu
First published:

Tags: Digital, Investments, IPO, Perform, Stacks

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు