Dhanteras 2019: ధనత్రయోదశి పర్వదినాన ఒక్క రూపాయికే బంగారం...ఇలా కొనండి..

సాధారణంగా షాపుల్లో బంగారం కొనాలంటే కనీసం ఒక గ్రాము కొనాల్సి ఉంటుంది. అలాగే బాండ్లలో సైతం సార్వభౌమ బంగారం బాండ్లు అయినా సరే కనీసం గ్రాము బంగారం కొనుగోలు చేయక తప్పదు. అయితే పేమెంట్ యాప్స్ ద్వారా డిజిటల్ బంగారాన్ని చిన్న మొత్తాల్లో కొనుగోలు చేయవచ్చు.

Krishna Adithya | news18-telugu
Updated: October 22, 2019, 5:21 PM IST
Dhanteras 2019: ధనత్రయోదశి పర్వదినాన ఒక్క రూపాయికే బంగారం...ఇలా కొనండి..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ధన త్రయోదశికి బంగారం కొంటే శుభం జరుగుతుందని అంతా భావిస్తుంటారు. కనీసం ఒక గ్రాము అయినా కొనాలని ఆశపడుతుంటారు. అయితే బంగారం ధరలు రికార్డులు బద్దలు కొడుతున్న నేపథ్యంలో సామాన్యులు పండగ రోజు బంగారం కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా బంగారం ధరలు మార్కెట్లో ఒక గ్రాముకు సుమారు రూ.4 వేలు పలుకుతోంది. అయితే బంగారం ఫిజికల్ గానే కాదు డిజిటల్ రూపంలో కూడా కొనవచ్చని బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు కొనే బంగారానికి సరిపడా ఫిజికల్ బంగారాన్ని ఆయా సంస్థలు ఎంఎంటీసీ లాంటి సంస్థలతో కలిసి నిల్వ చేస్తుంటాయి. ఆన్‌లైన్ యాప్స్‌ పేటీఎం, ఫోన్‌పే, మోతీలాల్‌ ఓస్వాల్‌, ఆగ్మంట్‌ తదితర వేదికల ద్వారా డిజిటల్‌ గోల్డ్‌ను రూపాయి నుంచి నుంచే కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి.

సాధారణంగా షాపుల్లో బంగారం కొనాలంటే కనీసం ఒక గ్రాము కొనాల్సి ఉంటుంది. అలాగే బాండ్లలో సైతం సార్వభౌమ బంగారం బాండ్లు అయినా సరే కనీసం గ్రాము బంగారం కొనుగోలు చేయక తప్పదు. అయితే పేమెంట్ యాప్స్ ద్వారా డిజిటల్ బంగారాన్ని చిన్న మొత్తాల్లో కొనుగోలు చేస్తూ, మీకు కావల్సినంత సమకూరిన ఇంటి వద్దకే బంగారాన్ని డెలివరీ తీసుకునే సదుపాయం ఉంది. లేదంటే ఈ డిజిటల్‌ బంగారాన్ని ఆభరణాల సంస్థలకు బదిలీ చేసుకుని అందుకు తగిన నగలను కొనుగోలు చేసుకునే ఆప్షన్‌ కూడా ఉంది.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...