Home /News /business /

PLANNING TO BUY A NEW CAR 5 TIPS TO AVAIL BEST LOAN OFFERS MK GH

Planning to buy a car: ఆన్ లైన్ అప్రూవల్ తో ఊరించే Car loan ఆఫర్స్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్ లైన్ లో ఓ క్లిక్ కొట్టండి, కార్ లోన్ నిమిషాల్లో అప్రూవ్ అవుతుంది, ఆతరువాత మీ ఫేవరెట్ కార్ కొనండి అంతే. ఇదంతా సరేగానీ బెస్ట్ కార్ లోన్ డీల్స్ ఏమిటనేగా మీ అనుమానం..

ఒకప్పుడు కారు కొనేందుకు లోన్ తీసుకోవాలంటే పెద్ద ప్రాసెస్, రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగటం వంటివి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా పడిగాపులు పడాల్సిన అవసరం లేకపోగా జస్ట్ ఓ క్లిక్ తో కార్ సొంతం చేసుకోవచ్చు. ఓవైపు ఊరించే ఆఫర్లు మరోవైపు ఆకట్టుకునే కార్ డిజైన్స్ మార్కెట్లో కార్ సేల్స్ కు కొత్త జోష్ తెచ్చాయి. దీంతో చిన్న, మధ్య తరగతివారు సైతం ఫోర్ వీలర్ పై మనసు పారేసుకుంటున్నారు.

క్విక్ ఆన్ లైన్ లోన్స్

క్విక్ ఆన్ లైన్ లోన్ల కారణంగా కారు కొనటం చాలా ఈజీ అయిపోయింది. కేవలం కొన్ని పర్సనల్ డీటైల్స్ ఇచ్చి, కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరి మీరు అప్పటికప్పుడు కారు కొనేయవచ్చు. మొదటి స్టెప్ లో భాగంగా.. మీకు ఎంత కారు లోన్ వస్తుందో, మీకున్న లోన్ అర్హత ఎంతన్న విషయం తెలుసుకుని..అన్ని బ్యాంకుల వెబ్ సైట్లు చూసి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన కారు బ్రాండ్, మోడల్ ఎంపిక చేసుకోండి. మీరు ఎంత డౌన్ పే చేయాలనుకుంటున్నారు, సులభ వాయిదాల్లో మీరు చెల్లించగల మొత్తం ఎంత వంటివి లెక్కలేసుకోండి. వీటిపై స్పష్టత ఉంటే.. తక్కువ EMI ఎంచుకుంటారా, ఎక్కువ EMI భారం మోయగలరా ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఎక్కువ డౌన్ పేమెంట్ కడతారా, ఇందుకు అవసరమైన మొత్తం మీతో ఎంత ఉంది వంటివి సరిచూసుకోండి. ఆతరువాత మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా లేదా మీ బ్యాంకు బ్రాంచుకు స్వయంగా వెళ్లటం ద్వారా కారు లోన్ కోసం అప్లై చేయండి. బేసిక్ డాక్యుమెంట్లు అయిన ఇన్కం, ఐడెంటిటీ ప్రూఫ్ వంటివి బ్యాంకుకు ఇవ్వాలి.

క్రెడిట్ స్కోర్ ఎంత ?

కారు లోన్ తీసుకునే ముందు కనీసం 6-8 నెలలపాటు మీ క్రెడిట్ స్కోరు (credit score)ఎంత ఉందన్న విషయాన్ని గమనించండి. ఇది ఆప్షనల్ ప్రాసెస్ అయినప్పటికీ మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే మీకు పెద్ద మొత్తంలో కారు లోను వస్తుంది. ప్రాసెసింగ్ ఈజీగా అవుతుంది. 750 పాయింట్ల కంటే ఎక్కువ ఉన్న క్రెడిట్ స్కోరును మంచి క్రెడిట్ స్కోరుగా భావిస్తారు కనుక మీకు ఇన్ని పాయింట్లు ఉంటే మాత్రం లోన్ అప్రూవ్ అయ్యేందుకు మార్గం సుగమం అన్న విషయాన్ని మరవద్దు. కార్ లోనే ఇచ్చేముందు మీ క్రెడిట్ రిపోర్టును బ్యాంకులు మానిటర్ చేస్తాయి. 700 పాయింట్ల కంటే తక్కువ ఉన్న క్రెడిట్ స్కోరును కనీసం 6 నెలల ముందే గుర్తిస్తే దీన్ని మెరుగుపరుచుకోవచ్చు.

ఇంట్రెస్ట్ రేట్స్ పోల్చుకోండి

బ్యాంకులు తామిచ్చే రుణాలపై ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ రేటు వసూలు చేస్తాయి. కాబట్టి ఏ బ్యాంకులు కారు లోన్లు చవకగా ఇస్తున్నారు, తక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారో పోల్చుకుని చూడండి. కరోనా మహమ్మారి కారణంగా కారు సేల్స్ పడిపోగా ఊరించే ఆఫర్లు ప్రకటిస్తున్న కార్ల కంపెనీలు, బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. కారు మోడల్ ను బట్టి, మీకున్న లోను తీర్చే సామర్థ్యం, జాబ్ ప్రొఫైల్, క్రెడిట్ స్కోర్ వంటివన్నీ పరిగణలోకి తీసుకునే లోన్ అప్రూవ్ చేస్తారు.

మీకు ఇప్పటికే అకౌంట్ ఉన్న బ్యాంకులో ఈ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీకే లోన్ వచ్చే సదుపాయం ఉంటుంది. కానీ ఇంతకంటే తక్కువ వడ్డీకే రుణం ఇచ్చే బ్యాంకులు ఉన్నాయేమో ఆన్ లైన్లో చెక్ చేయండి. ఒక్కోసారి ఫైనాన్స్ కంపెనీలు కూడా తక్కువ వడ్డీకే కారు లోన్లు ఇస్తాయి కనుక వాటిపై కూడా ఓ కన్నేయండి.

ప్రాసెసింగ్ ఫీ (processing fee)

చాలామంది పెద్దగా పట్టించుకోని విషయాల్లో ప్రాసెసింగ్ ఫీ ఒకటి. ప్రాసెసింగ్ ఫీలో భాగంగా మీరు తీసుకునే కారు లోన్లో కనీసం 2శాతాన్ని వసూలు చేస్తారు. అందుకే ఆటోమొబైల్ ఎక్స్ పర్ట్స్.. ఫెస్టివ్ సీజన్లో కార్లు కొనమని చెబుతారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ప్రాసెసిగ్ ఫీ మాఫీ చేస్తుంటారు. కానీ ఇలా ప్రాసెసింగ్ ఫీ మాఫీ చేసినప్పుడు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారేమో చూడండి.

వాయిదాలు-ఖర్చులు

పైన చెప్పిన విషయాలన్నీ మీరు చక్కగా పరిగణలోకి తీసుకున్న తరువాత అసలు మీరు చెల్లించగల మంత్లీ ఈఎంఐ ఎంతనో పక్కగా లెక్కలేసుకోండి. ఈఎంఐలు ఎక్కువకాలం పాటు ఉంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. మరి ఈఎంఐ కడుతూనే నెలకు సరిపడా ఇతరత్రా ఖర్చులు మీరు వెచ్చించగలరా లేక ఇదంతా ఎక్కువ భారంగా మారుతుందా అన్న విషయాలపై బ్యాలెన్స్ షీట్ వేసుకోండి. అందుకే మీరు సులభంగా చెల్లించే మొత్తాన్ని మాత్రమే ఈఎంఐగా చెల్లించేలా లోన్ తీసుకుని, రీజనబుల్ వడ్డీ పడేలా ప్లాన్ చేసుకోండి.

ఫోర్ క్లోజర్ చార్జీలు

ముందస్తుగానే కారు లోన్ తీర్చే అవకాశం ఉంటే దానిపై పూర్తి వివరాలు లోన్ తీసుకునే సమయంలోనే స్పష్టంగా తెలుసుకోవాలి. ఫోర్ క్లోజర్ చార్జీలు (foreclosure charges) అంటే నిర్దేశించిన గడువు కంటే ముందే లోన్ తీర్చేందుకు మనం డబ్బు కట్టినప్పటికీ దానిపై అదనంగా చార్జీలు వసూలు చేస్తారు. దీన్నే ప్రీపేమెంట్ చార్జీలు అని కూడా అంటారు. అందుకే ఫోర్ క్లోజర్ చార్జీలపై బ్యాంకు నియమ నిబంధనలు తెలుసుకోండి. ఫోర్ క్లోజర్ చార్జీలు అత్యల్పంగా ఉండే రుణ విధానాన్ని మాత్రమే ఎంపిక చేసుకోండి.
Published by:Krishna Adithya
First published:

Tags: Business, Car loans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు