హోమ్ /వార్తలు /బిజినెస్ /

EV Car Loans: దీపావళికి కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకే EV కార్ లోన్లు ఇస్తున్న బ్యాంకులపై ఓ లుక్కేయండి

EV Car Loans: దీపావళికి కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకే EV కార్ లోన్లు ఇస్తున్న బ్యాంకులపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ పండుగ సీజన్‌లో ఈవీలను కొనే వారికోసం వివిధ బ్యాంకులు తక్కువ వడ్డీతో లోన్‌ అందిస్తున్నాయి. ఈ లోన్ ఆఫర్లతో పాటు వీటి కోసం ప్రముఖ బ్యాంకులు రూపొందించిన ఫైనాన్సింగ్ రూల్స్‌ గురించి తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

EV Car Loans: పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రపంచ దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల(EV)కు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ పండుగ సీజన్‌లో ఈవీలను కొనే వారికోసం వివిధ బ్యాంకులు తక్కువ వడ్డీతో లోన్‌ అందిస్తున్నాయి. ఈ లోన్ ఆఫర్లతో పాటు వీటి కోసం ప్రముఖ బ్యాంకులు రూపొందించిన ఫైనాన్సింగ్ రూల్స్‌ గురించి తెలుసుకుందాం.

 వడ్డీ రాయితీపై లోన్లు

సాధారణ కార్ లోన్‌ల కోసం వడ్డీ రేట్లు 7.85 శాతం నుంచి 8.65 శాతం వరకు ఉంటాయి. రీపేమెంట్ టెన్యూర్‌ బ్యాంకును బట్టి మారుతుంది. అయితే ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు కోసం తీసుకొనే లోన్లుపై వడ్డీ రేట్లు సాధారణ కార్ల కంటే సగటున 10-30 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈవీ కొనుగోలుకు 0.25 శాతం పాయింట్ల వరకు రాయితీ రేటును అందిస్తోంది. ఎస్‌బీఐ 0.20 శాతం పాయింట్ల వరకు రాయితీని అందిస్తోంది. ఎస్‌బీఐ 21 నుంచి 67 సంవత్సరాల వయస్సు గల దరఖాస్తుదారులకు ఈవీలోన్లు అందిస్తోంది. ఈ బ్యాంకు ఈవీలకు 7.95 శాతం నుంచి 8.30 శాతం వడ్డీతో లోన్లు ఇస్తోంది. ఈ రాయితీ దరఖాస్తుదారుల క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. SBIలో కనీస రుణ చెల్లింపు వ్యవధి మూడు సంవత్సరాలు, గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు. యాక్సిస్ బ్యాంక్ ఏడేళ్ల టెన్యూర్‌తో లోన్లు అందిస్తోంది. చాలా బ్యాంకులు EV లోన్‌లపై ఎలాంటి ముందస్తు ఛార్జీలు వసూలు చేయవు.

 ట్యాక్స్‌ బెనిఫిట్స్‌

EVలను కొనుగోలు చేయడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ లోన్లపై ప్రత్యేక ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ప్రకటించింది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80EEB కింద ఆర్థిక సంవత్సరం 2020, ఆర్థిక సంవత్సరం 2023 మధ్య పొందే EV లోన్‌లపై చెల్లించే వడ్డీపై రూ.1.5 లక్షల వరకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిడక్షన్‌ పొందవచ్చు. EVలపై GST 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేస్తున్నారా? పాలసీ కవరేజీ పెంచే ఆప్షన్స్ తెలుసుకోండి

లోన్ మార్జిన్, డాక్యుమెంటేషన్

చాలా బ్యాంకులు సాధారణంగా వాహన ధరలో 75-100 శాతం రుణంగా అందిస్తాయి. లోన్‌ మార్జిన్‌ కారు మోడల్‌ను బట్టి మారుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కారు ఆన్-రోడ్ ధరలో (అంటే ఎక్స్-షోరూమ్ ధర + రిజిస్ట్రేషన్ ఫీజు + ఇన్సూరెన్స్‌ ధర) 10 శాతం కనీస మార్జిన్‌తో ఈవీ లోన్‌ ఇస్తుంది. యాక్సిస్ బ్యాంక్‌లో ఆన్-రోడ్ ధరలో 85 శాతం వరకు పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.5 కోట్ల వరకు EV లోన్ ఫైనాన్స్‌ను అందిస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ లోన్‌పై పై సీలింగ్ లేదు.

అర్హత ప్రమాణాలలో మార్పు లేదు

సాధారణ కారు, ఈవీ కొనేవారికి అర్హత ప్రమాణాలు ఒకే విధంగా ఉన్నాయని మనీ కంట్రోల్‌ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు బ్యాంక్ ఆఫ్ బరోడా మార్ట్‌గేజ్‌& ఇతర రిటైల్ ఆస్తుల విభాగం జనరల్ మేనేజర్ H.T. సోలంకి. టాటా మోటార్స్, మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి కొత్త మోడళ్లు తక్కువ ధరలకు లాంచ్‌ అవ్వడంతో ఈవీ లోన్ల బిజినెస్‌లో పరిస్థితులు మారాయని మనీ కంట్రోల్‌తో చెప్పారు యాక్సిస్ బ్యాంక్ రిటైల్ లెండింగ్ అండ్ పేమెంట్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ & హెడ్ సుమిత్ బాలి. భవిష్యత్తులోనూ ఈ లోన్లపై ఆఫర్లు కొనసాగే అవకాశం ఉందన్నారు.

First published:

Tags: CAR, Car loans, Electric cars

ఉత్తమ కథలు