Mutual Funds: ఇన్వెస్ట్ మెంట్ గురించి ఆలోచిస్తున్నారా...లాభాల పంట పండించిన మ్యూచువల్ ఫండ్స్

ప్రతీకాత్మకచిత్రం

మ్యూచువల్ ఫండ్స్ అంటేనే మార్కెట్ రిస్కులుంటాయని అర్థం. మరి సంక్షోభ సమయంలో భయం ఎందుకు, పెట్టుబడులు ఉపసంహరించుకోవటం ఎందుకని తరచూ నిపుణులు హెచ్చరించటంలో ఉన్న లోతుపాతులు ఇలా ఉంటాయి.

  • Share this:
కరోనా సంక్షోభ సమయంలో (Corona pandemic) విపరీతమైన మార్కెట్ ఫ్లక్చుయేషన్ల కారణంగా మార్కెట్లో తాము పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకున్న ఇన్వెస్టర్లకు లెక్కేలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కనిపించిన ఈ ట్రెండ్ కు భిన్నంగా ఆలోచించిన కొందరు మాత్రం వారు మ్యూచువల్ ఫండ్స్ లో చేసిన ఇన్వెస్ట్ మెంట్స్ ను ఉపసంహరించుకోకపోవటం వారికి సిరుల పంట పండించింది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టిన సమయంలో ఇలాంటి సంక్షోభాలు వచ్చినా పట్టించుకోకపోతే కొంతకాలం తరువాత వచ్చే రిటర్న్స్ చాలా బాగుంటాయని తరచూ నిపుణులు ఇచ్చే సలహాలను విశ్వసించక తప్పదు. 2020లో గ్లోబల్ మార్కెట్లు పతనమైనప్పటికీ కొన్ని సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు విపరీతమైన లాభాలు ఆర్జించి పెట్టాయి. దీంతో ఇలాంటి పెట్టుబడులు పెట్టినవారంతా ఫుల్ ఖుష్ అయిపోయారు. మార్చ్ 2020లో ప్రపంచ మార్కెట్లు కుదేలైనప్పటికీ ఆతరువాతి కాలంలో మాత్రం బాగా పుంజుకుని, మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ లోని అస్సెట్స్ అండర్ మేనేజ్మెంట్ (AUM) ఆల్ టైం హైని నమోదు చేసుకుని 30 లక్షల కోట్ల రూపాయలకు ఎగువకి ఎగబాకాయి. మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలోని AUM 13శాతం పెరుగుదలను డిసెంబరుకల్లా నమోదు చేసుకుంది. ఇది 2019లో కేవలం 26.54 లక్షల కోట్లు మాత్రమే నమోదయ్యింది. ముఖ్యంగా ఫిక్స్డ్ ఇన్కం స్కీముల్లో ఎక్కువ ఇన్ఫ్లో రికార్డు అయింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ పండ్స్ ఆఫ్ ఇండియా (Amfi) డేటా ప్రకారం మ్యూచువల్ పండ్ ఇండస్ట్రీలోని ఓవరాల్ AUM 3.5 లక్షల కోట్లు దాటిందన్నమాట. ఫార్మా, ఐటీ రంగాల్లో మంచి వృద్ధి నమోదు చేసుకున్నాయి.

దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ వల్లే..

నిజానికి లాక్ డౌన్ కారణంగా ప్రపంచమంతా స్థంభించిపోగా ఈ కంపెనీల విషయంలో There-is-no-alternative (TINA) అనేది కీలక అస్త్రంగా పనిచేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటితోపాటు కొన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ తొలుత తీవ్రంగా నష్టపోయినా ఆతరువాత బాగా బౌన్స్ బ్యాక్ అయి కోలుకున్నాయి. 2020లో నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 15శాతం, 16శాతం గెయిన్ అయ్యాయి.

సంక్షోభ సమయంలో లాభాల పంట పండించిన ఆ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈ కింద ఉన్నాయి..

Fund name Return (2020) NAV (As of Jan 1, 2020) Net Assets (As of Jan 1, 2020)

DSP Healthcare 76% Rs 19.43 Rs. 956.35 Cr

Fund-Reg(G)

Mirae Asset - Healthcare

Fund-Reg(G) 73% Rs 19.118 Rs1097.45 Cr

--------------------

ICICI Prudential Pharma Healthcare and Diagnostics

(P.H.D) Fund -

Direct plan 71% Rs 18.34 Rs 2022.73 Cr

------------------------------------------

ICICI Predential Technology Fund-

Growth 71% Rs 98.89 Rs 938.05 Cr

-----------------------------------------

UTI Healthcare -Direct Plan-

Growth 66% Rs 154.10 Rs 609.63 Cr
Published by:Krishna Adithya
First published: