హోమ్ /వార్తలు /బిజినెస్ /

Credit Cards: ఇండిపెండెన్స్ సెలవులకు ట్రిప్ ప్లాన్ చేస్తునారా ? ఈ క్రెడిట్ కార్డులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ కూడా !

Credit Cards: ఇండిపెండెన్స్ సెలవులకు ట్రిప్ ప్లాన్ చేస్తునారా ? ఈ క్రెడిట్ కార్డులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ కూడా !

 ఇండిపెండెన్స్ సెలవులకు ట్రిప్ ప్లాన్ చేస్తునారా ? ఈ క్రెడిట్ కార్డులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు కూడా !

ఇండిపెండెన్స్ సెలవులకు ట్రిప్ ప్లాన్ చేస్తునారా ? ఈ క్రెడిట్ కార్డులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు కూడా !

పండగల సీజన్‌, వరుసల సెలవులు రాబోతున్నాయి. ఈ సమయంలో ఎక్కువ మంది ట్రిప్‌లు ప్లాన్‌ చేస్తుంటారు. Yatra.com, Cleartrip, MakeMyTrip వంటి పోర్టల్‌లలో బుకింగ్స్‌పై ఆఫర్స్‌(Offers), డిస్కౌంట్‌లు పొందేందుకు ప్రత్యేక క్రెడిట్‌ కార్డ్‌లను ఆయా బ్యాంకులు అందిస్తున్నాయి. ఆ వివరాలు..

ఇంకా చదవండి ...

పండగల సీజన్‌, వరుసల సెలవులు రాబోతున్నాయి. ఈ సమయంలో ఎక్కువ మంది ట్రిప్‌లు ప్లాన్‌ చేస్తుంటారు. Yatra.com, Cleartrip, MakeMyTrip వంటి పోర్టల్‌లలో బుకింగ్స్‌పై ఆఫర్స్‌, డిస్కౌంట్‌లు పొందేందుకు ప్రత్యేక క్రెడిట్‌ కార్డ్‌( Credit Cards)లను ఆయా బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ కార్డ్‌లు గిఫ్ట్ వోచర్‌లు, విమాన టిక్కెట్‌లపై డిస్కౌంట్‌(Discount)లు, హోటల్ బుకింగ్‌లు వంటి బెనిఫిట్స్‌ అందిస్తాయి. ఈ క్రెడిట్ కార్డ్‌లలో లాంజ్ యాక్సెస్, ఎయిర్ మైల్స్, అదనపు రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయాణ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉండవచ్చు. బెస్ట్‌ ట్రావెల్ పోర్టల్ బెనిఫిట్స్‌ అందిస్తున్న ఐదు క్రెడిట్ కార్డ్‌లు ఇవే..

SBI Card

యాత్ర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ Yatra.com నుంచి వెల్‌కమ్‌ బెనిఫిట్‌గా రూ.8,250 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ను అందిస్తుంది. రూ.40,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన అంతర్జాతీయ విమాన బుకింగ్‌లపై వినియోగదారులు రూ.4,000 డిస్కౌంట్‌, రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్‌పై దేశీయ విమాన బుకింగ్‌లపై రూ.1,000 డిస్కౌంట్‌ పొందుతారు. ఇది మినిమమ్‌ ట్రాన్సాక్షన్‌ వ్యాల్యూ రూ.3,000పై దేశీయ హోటల్ బుకింగ్‌లపై 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లు, కిరాణా, డైనింగ్, సినిమా(Cinema)లు మొదలైన వాటిపై వెచ్చించే ప్రతి రూ.100పై వినియోగదారుడు ఆరు రివార్డ్ పాయింట్‌లు, అన్ని ఇతర కేటగిరీలపై వెచ్చించే ప్రతి రూ.100పై ఒక రివార్డ్ పాయింట్‌ను సంపాదిస్తారు(ఒక రివార్డ్ పాయింట్ = రూ.0.25). ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.499 చెల్లించాలి.

Axis Bank

ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మొదటి ట్రాన్సాక్షన్‌ను 30 రోజుల్లోపు చేస్తే రూ.500 విలువైన వెల్‌కమ్‌ వోచర్‌ను అందిస్తుంది. క్లియర్‌ట్రిప్, ఉబర్, స్విగ్గి, పీవీఆర్, క్యూర్‌ఫిట్, టాటా స్కై, టాటా 1ఎంజి మొదలైనవాటి ప్రిఫర్డ్‌ మర్చంట్స్‌పై ఖర్చు చేసినందుకు 4 శాతం క్యాష్‌బ్యాక్, ఇతర మర్చంట్స్‌పై ఖర్చు చేస్తే 1.5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది నాలుగు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్‌ను అందిస్తుంది(క్యాలెండర్ క్వార్టర్‌కు ఒకటి). ఈ కార్డ్‌కు వార్షిక రుసుము రూ.500 చెల్లించాలి. ప్రీవియస్‌ ఇయర్‌ రూ.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

Standard Chartered Bank

స్టాండర్డ్ చార్టర్డ్ డిజిస్మార్ట్ క్రెడిట్ కార్డ్ Yatra.comలో దేశీయ విమానాల్లో 20 శాతం(రూ.750 వరకు ) డిస్కౌంట్‌, అంతర్జాతీయ విమానాలపై 10 శాతం(రూ.10,000 వరకు ) డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఇది దేశీయ హోటల్ బుకింగ్‌లపై 25 శాతం తగ్గింపు (రూ.4,000 వరకు) అందిస్తుంది. నెలకు గరిష్టంగా రూ.600 క్యాష్‌బ్యాక్‌తో ఓలా క్యాబ్ బుకింగ్‌లపై వినియోగదారుకు 15 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జొమాటో, మింత్ర, బ్లింకిట్‌పై డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డ్‌పై నెలవారీ రుసుము రూ.49 (సంవత్సరానికి రూ.588) చెల్లించాలి. క్యాలెండర్ నెలలో రూ.5,000 ఖర్చు చేస్తే నెలవారీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇదీ చదవండి: Glowing Skin: ఈ నాలుగు రకాల జ్యూస్‌లతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా తయారు చేసుకోండి !SBI Card

ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ(SBI) కార్డ్ ప్రీమియర్.. ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ (ఆండ్రాయిడ్ కోసం మాత్రమే) ఎయిర్ కండిషన్డ్, చైర్ కార్ కోచ్‌లలో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై 10 శాతం వ్యాల్యూ బ్యాక్‌ అందిస్తుంది. ఐఆర్‌సీటీసీలో ఇ-కేటరింగ్ సేవలపై, విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నప్పుడు వినియోగదారులు 5 శాతం వ్యాల్యూ బ్యాక్‌ పొందుతారు. www.air.irctc.co.in ద్వారా ఎయిర్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌లపై ట్రాన్సాక్షన్‌ ఛార్జీలలో 1.8 శాతం ఆదా అవుతుంది. ఇది ఒక సంవత్సరంలో ఎనిమిది కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్‌ను అందిస్తుంది. వినియోగదారులు కాంప్లిమెంటరీ రైలు బీమా కవరేజ్, రూ.10 లక్షల విమాన ప్రమాద కవరేజీని కూడా పొందుతారు. ఈ కార్డుపై వార్షిక రుసుము రూ.1,499 ఉంది.

ICICI Bank

మేక్‌ మై ట్రిప్‌ ఐసీఐసీఐ(ICICI) బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ కాంప్లిమెంటరీ MMTBLACK మెంబర్‌షిప్‌ను, రూ.1,500 మై క్యాష్‌ ప్లస్‌ను వెలకమ్‌ బెనిఫిట్‌ కింద అందిస్తుంది. మేక్‌ మై ట్రిప్‌లో ఫ్లైట్ బుకింగ్‌పై వినియోగదారులు రూ.200కి 2 మై క్యాష్, హోటల్/హాలిడే బుకింగ్‌కి రూ.200కి 4 మై క్యాష్ పొందుతారు. ఇతర అంతర్జాతీయ ట్రాన్సాక్షన్‌లపై వెచ్చించే రూ.200కి 1.50 మై క్యాష్‌, దేశీయ ట్రాన్సాక్షన్‌లపై వెచ్చించే రూ.200కి 1.25 మై క్యాష్‌ పొందుతారు. ఈ కార్డ్‌ మైల్‌స్టోన్ రివార్డ్స్ ప్రోగ్రామ్ కింద, వినియోగదారులు సంవత్సరానికి రూ.5 లక్షలు ఖర్చు చేసినందుకు ప్రతి వార్షికోత్సవ సంవత్సరానికి రూ.4,000 మై క్యాష్, ప్రతి వార్షికోత్సవ సంవత్సరానికి రూ.2.5 లక్షలు ఖర్చు చేసినందుకు రూ.1,100 మై క్యాష్ పొందుతారు. ఈ కార్డ్‌కి వన్-టైమ్ జాయిన్ ఫీజు రూ.2,500 ఉంది. తర్వాత సంవత్సరం నుంచి రెన్యువల్‌ ఛార్జీలు వంటివి లేవు.

Published by:Mahesh
First published:

Tags: Axis bank, Credit cards, Icici bank, Sbi card

ఉత్తమ కథలు