హోమ్ /వార్తలు /బిజినెస్ /

Jio-bpతో కలిసి ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్న పిరమల్ రియాలిటీ.. ఎక్కడంటే?

Jio-bpతో కలిసి ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్న పిరమల్ రియాలిటీ.. ఎక్కడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పిరమల్ గ్రూప్ కు చెందిన పిరమల్ రియాలిటీ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు బీపీ గ్రూప్ నకు చెందిన జియో-బీపీ సంయుక్తంగా జయింట్ వెంచర్ ను ప్రకటించాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

పిరమల్ గ్రూప్ కు చెందిన పిరమల్ రియాలిటీ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), బీపీ గ్రూప్ నకు చెందిన జియో-బీపీ సంయుక్తంగా జయింట్ వెంచర్ ను ప్రకటించాయి. ఈ జాయింట్ వెంచర్ ద్వారా వరల్డ్-క్లాస్ ఈవీ (EV) ఛార్జింగ్ సొల్యుషన్స్ ను ముంబాయి మెట్రోపాలిటన్ రీజియన్లలోని (MMR) పిరమల్స్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ ను వరల్డ్ క్లాస్ సదుపాయాలతో ఏర్పాటు చేస్తారు. పిరమల్ రియాల్టీ ఆరోగ్యవంతమైన వాతావారణాన్ని సృష్టించేందుకు నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. కస్టమర్ల అభివృద్ధి అంచనాలకు అనుగుణంగా స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. నివాస ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా ఆ వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారుల్లో ఉత్సాహం పెంచుతుంది. ఈ పార్ట్నర్ షిప్ ద్వారా మొదటగా జియో-బీపీ థానేలోని పిరమిల్ వైకుంత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. చాలా రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్ల ద్వారా జియో-బీపీ భారత దేశంలో అనేక అదిపెద్ద ఛార్జింగ్ హబ్ లను నిర్మించింది. వందలాది ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది.

చాలా సిటీలు, మేజర్ హైవేల పక్కన వీటిని ఏర్పాటు చేసింది. కేవలం ఛార్జింగ్ మాత్రమే కాకుండా బ్యాటరీని మార్చుకునే అవకాశాలను సైతం ఈ ఛార్జింగ్ పాయింట్ల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. Jio-bp’s యాప్ కలిగిన కస్టమర్లు ఈ సేవలను అత్యంత సులువుగా పొందొచ్చు. భారత దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు అత్యంత సులువుగా, నాణ్యమైన ఛార్జింగ్ సేవలను అందించడమే లక్ష్యంగా జియో-బీపీ పని చేస్తోంది.

పిరమల్ రియాలిటీ:

పిరమల్ గ్రూప్ కు చెందిన ఈ సంస్థను 2012లో స్థాపించారు. ఇది ఇండియాలో లీడింగ్ డవలపర్స్ గా ఈ సంస్థ అనతి కాలంలోనే నిలవడం విశేషం. కస్టమర్ల కోసం బెస్ట్ డిజైన్, క్వాలిటీ, సేఫ్టీ ఇవ్వడమే లక్ష్యంగా రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ను సంస్థ అభివృద్ధి చేస్తోంది.

జియో బీపీ గురించి:

జియో-బీపీ.. రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (RBML) సంస్థను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మరియు బీపీ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్ దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోంది. జియో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులు. bp దాని విస్తృతమైన ప్రపంచ అనుభవాన్ని అందిస్తుంది. అధిక-నాణ్యత విభిన్న ఫ్యూయల్స్, కందెనలు, రిటైల్ మరియు అధునాతన తక్కువ కార్బన్ మొబిలిటీ పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. సాంప్రదాయ ఇంధనాలను మార్కెటింగ్ చేయడంతో పాటు, RBML అధునాతన మొబిలిటీని అందిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) వినియోగదారులకు ఛార్జింగ్ పాయింట్లు, బ్యాటరీ మార్పిడి స్టేషన్లు (BSS) ఏర్పాటు చేస్తుంది.

First published:

Tags: Electric Vehicles, Jio bp, Reliance Industries

ఉత్తమ కథలు