హోమ్ /వార్తలు /బిజినెస్ /

Multibaggers: రూ.లక్ష పెట్టినోళ్లకు రూ.2 కోట్లు.. వారెవ్వా ఏమీ లాభం సామి!

Multibaggers: రూ.లక్ష పెట్టినోళ్లకు రూ.2 కోట్లు.. వారెవ్వా ఏమీ లాభం సామి!

Multibaggers: రూ.లక్ష పెట్టినోళ్లకు రూ.2 కోట్లు.. వారెవ్వా ఏమీ లాభం సామి!

Multibaggers: రూ.లక్ష పెట్టినోళ్లకు రూ.2 కోట్లు.. వారెవ్వా ఏమీ లాభం సామి!

Multibagger Stock | స్టాక్ మార్కెట్‌లో ఒక షేరు దుమ్మురేపింది. దీర్ఘకాలంలో చూస్తే భారీ లాభాలు అందించి పెట్టింది. ఎంతలా అంటే రూ.లక్షను కాస్తా రూ.2 కోట్లుగా మార్చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Multibagger Share | భారీ లాభాలు పొందాలని భావించే వారు చాలా మంది స్టాక్ మార్కెట్‌లోకి (Stock Market) ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడే అదిరిపోయే లాభాలు (Money) ఉంటాయి. అయితే లాభాలతో పాటుగా నష్టాలు కూడా ఉంటాయి. భారీ రిస్క్ ఉంటుంది. అందుకే ఈక్విటీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెట్టిన డబ్బులు కూడా పొందలేకపోవచ్చు.

మార్కెట్‌లోకి చాలా షేర్లలో కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ ఉంటాయి. వీటిల్లో మనం ఇప్పుడు పిడిలైట్ ఇండస్ట్రీస్ స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ షేరు ఇన్వెస్టర్లకు ఏకంగా 22 వేల శాతానికి పైగా రాబడిని అందించింది. 20 ఏళ్లలో ఈ మేరకు లాభాలు పంచిపెట్టింది. అంటే ఈ స్టాక్‌లో డబ్బులు పెట్టిన దీర్ఘకాల ఇన్వెస్టర్ల పంట పండిందని చెప్పుకోవచ్చు.

రూ.45 వేలకే అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఒక్కసారి చార్జింగ్ పెడితే 100 కి.మి. వెళ్లొచ్చు!

20 ఏళ్ల కాలంలో పిడిలైట్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ. 11.39 నుంచి రూ. 2,530కు చేరింది. అంటే 20 ఏళ్ల కిందట ఈ స్టాక్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు రూ.2.2 కోట్లు లభించేవి. అంటే కంపెనీ ఏ స్థాయిలో లాభాలు అందించిందో అర్థం చేసుకోవచ్చు. ఫెవికల్, డాక్టర్ ఫిక్స్ఇట్, ఫెవి క్విక్, ఎం సీల్, రోఫ్, కెమిఫిక్స్ వంటి బ్రాండ్ల కింద ప్రొడక్టులను విక్రయిస్తోంది. మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్లలో పిడిలైట్ ఇండస్ట్రీస్ ఫెవికల్ కూడా ఒకటి.

ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు.. రూ.లక్ష లోన్ ఇస్తున్న ఎస్‌బీఐ!

కంపెనీలో ప్రమోటర్లు ఏకంగా 69.94 శాతం వాటాను కలిగి ఉన్నారు. 11.34 శాతం వాటాను ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. ఇక 11.25 శాతం వాటా రిటైల్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కలిగి ఉన్నారు. 3.34 శాతం వాటా దేశీ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. 4.04 శాతం వాటాను మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.28 లక్షల కోట్లుగా ఉంది.

ఇకపోతే స్టాక్ మార్కెట్‌లో భారీ రిస్క్ ఉంటుంది. అందువల్ల మీరు డబ్బులు పెట్టడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవాలి. లేదంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల ఈక్విటీ మార్కెట్లో డబ్బలు పెట్టడానికి ముందు అని విషయాలు తెలుసుకోండి. ఇన్వెస్టర్లను నిండా ముంచిన షేర్లు కూడా ఇంకా మార్కెట్‌లో ఉన్నాయి. అందుకు జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ గురించి తెలియకపోతే దూరంగా ఉండటం బెస్ట్. డబ్బులు వస్తాయని ఆశపడి ఇన్వెస్ట్ చేస్తే.. పెట్టిన డబ్బులను పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

First published:

Tags: Money, Multibagger stock, Share Market Update, Stock Market, Stocks