హోమ్ /వార్తలు /బిజినెస్ /

Fake Message: ఎస్‌బీఐ ఖాతాదారులకు ఫేక్ మెసేజ్... నమ్మితే అంతే సంగతులు

Fake Message: ఎస్‌బీఐ ఖాతాదారులకు ఫేక్ మెసేజ్... నమ్మితే అంతే సంగతులు

Fake Message: ఎస్‌బీఐ ఖాతాదారులకు ఫేక్ మెసేజ్... నమ్మితే అంతే సంగతులు
(ప్రతీకాత్మక చిత్రం)

Fake Message: ఎస్‌బీఐ ఖాతాదారులకు ఫేక్ మెసేజ్... నమ్మితే అంతే సంగతులు (ప్రతీకాత్మక చిత్రం)

Fake Message | ఎస్‌బీఐ ఖాతాదారులకు ఫేక్ మెసేజెస్ వస్తున్నాయి. ఆ మెసేజెస్ నమ్మితే అంతే సంగతులు. బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవల ఫేక్ మెసేజెస్ ఎక్కువగా వస్తున్నాయి. మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని, మీ యోనో అకౌంట్ పనిచేయదని, మీ అకౌంట్ యాక్టీవ్‌గా ఉండాలంటే వివరాలు అప్‌డేట్ చేయాలన్నది ఆ మెసేజెస్ సారాంశం. వీటిలో ఎక్కువగా పాన్ కార్డ్ అప్‌డేట్ (PAN Card Update) చేయాలని మెసేజెస్ వస్తున్నాయి. ఇలాంటి మెసేజెస్ ఫేక్ అని ఎస్‌బీఐ ఇప్పటికే అనేక సార్లు వెల్లడించింది. అయితే ఇలాంటి మెసేజెస్ పదేపదే ఎస్‌బీఐ ఖాతాదారులకు వస్తున్నాయి. దీంతో భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం అయిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Factcheck) నిజ నిర్ధారణ చేసి ఎస్‌బీఐ ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది.

ఎస్‌బీఐ పేరుతో ఫేక్ మెసేజెస్ వస్తున్నాయని, పాన్ కార్డ్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే యోనో అకౌంట్ బ్లాక్ చేస్తామని మెసేజ్‌లో సైబర్ నేరగాళ్లు భయపెడుతున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఇలాంటి ఎస్ఎంఎస్‌లు, ఇమెయిల్స్‌కు స్పందించకూడదని, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాన్ కార్డ్ వివరాలు తెలపకూడదని, పదేపదే ఇలాంటి మెసేజెస్ వస్తే report.phishing@sbi.co.in మెయిల్ ఐడీకి ఫిర్యాదు చేయాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కోరుతోంది.

Aadhaar Update: మీ దగ్గర ప్రూఫ్ లేదా? అయినా ఆధార్ అప్‌డేట్ చేయండి ఇలా

మెసేజ్‌లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే ఏమవుతుంది?

ఎస్ఎంఎస్‌లో వచ్చని లింక్ క్లిక్ చేస్తే మీ పాన్ నెంబర్‌తో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేయాలని కోరతారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాన్ నెంబర్ , డెబిట్ కార్డ్ నెంబర్, సీవీవీ లాంటి డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఆ తర్వాత మీ ఖాతాలో ఉన్న డబ్బులు కొల్లగొట్టేస్తారు. అందుకే ఈ లింక్స్ క్లిక్ చేయకూడదు. మీ వివరాలు అప్‌డేట్ చేయాలంటే నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి. లేదా ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అప్‌డేట్ చేయాలి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేయాలంటే ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.

Term Insurance: రెండు టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకుంటే లాభమా? నష్టమా?

Step 1- ముందుగా https://www.onlinesbi.sbi/ పోర్టల్ ఓపెన్ చేయాలి.

Step 2- మీ వివరాలతో లాగిన్ కావాలి.

Step 3- ఆ తర్వాత మై అకౌంట్స్ సెక్షన్‌లో ప్రొఫైల్ ఓపెన్ చేయాలి.

Step 4- ఆ తర్వాత PAN Registration పైన క్లిక్ చేయాలి.

Step 5- అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి.

Step 6- పాన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

ఈ ప్రాసెస్‌తో ఏడు రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ చేయొచ్చు. ఎస్‌బీఐ ఏటీఎంలో కూడా ఇవే స్టెప్స్‌తో మీ పాన్ నెంబర్ లింక్ చేయొచ్చు. ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి, ఫామ్ పూర్తి చేసి, మీ పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ జత చేసి సబ్మిట్ చేయొచ్చు.

First published:

Tags: Fact Check, PAN card, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు