Piaggio: పియాజియో వన్ ఇ-స్కూటర్ మూడు వేరియంట్లలో లభ్యం

Piaggio: పియాజియో వన్ ఇ-స్కూటర్ మూడు వేరియంట్లలో లభ్యం (ప్రతీకాత్మక చిత్రం)

Piaggio One e-Scooter | పియాజియో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది కంపెనీ. మూడు వేరియంట్లలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది.

  • Share this:
ప్రముఖ ఇటాలియన్ ద్విచక్ర వాహన సంస్థ పియాజియో మే నెలలో సరికొత్త వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విద్యుత్ స్కూటర్‌కు సంబంధించిన వివరాలను టిక్ టాక్ ద్వారా తెలియజేసింది. చైనా మార్కెట్లో పాగా వేయాలనే లక్ష్యంతో, ముఖ్యంగా యువతపై దృష్టి కేంద్రీకరించి ఈ స్కూటర్ ను సంస్థ అభివృద్ధి చేసింది. తాజాగా ఈ వాహనం వేరియంట్లకు సంబంధించిన వివరాలను పియాజియో తెలియజేసింది. పియాజియో సరికొత్త విద్యుత్ స్కూటర్ మూడు వేరియంట్లలో రానుంది. వన్, వన్ ప్లస్, వన్ యాక్టివ్ వేరియంట్లలో లభించే మోడళ్లను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు.

ఈ మూడు వేరియంట్ల డిజైన్, ప్రత్యేకతలు ఒకేలా ఉన్నాయి. బ్యాటరీ మాత్రం విభిన్నంగా ఉంటుంది. బేస్ వేరియంట్ అయిన వన్ మోడల్లో‌ 48 వోల్టులు 1.8 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని పొందుపరిచారు. దీంతో పాటు ఇందులో 1.2 కిలోవాట్ మోటార్ ను అమర్చారు. ఫలితంగా ఈ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అంతేకాకుండా 85 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛార్జింగ్ తో 55 కిలోమీటర్ల వరకు వెళ్లే సౌలభ్యాన్ని ఇందులో ఉంచారు.

Insurance: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదా? అయితే ఇన్స్యూరెన్స్ కష్టం

SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? ఈ బెనిఫిట్స్ మీకోసమే

టార్ స్పెక్ అయిన వన్ ప్లస్ వేరియంట్లో 2.3 కిలోవాట్ అవర్స్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతోని పొందుపరిచారు. ఇది గరిష్ఠంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. చివరగా వన్ యాక్టివ్ వేరియంట్లో 2.3 కిలోవాట్ అవర్ బ్యాటరీతో పాటు 3 కిలోవాట్ మోటర్ ను పొందుపరిచారు. ఫలితంగా ఇది 95 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ మోడల్ సింగిల్ ఛార్జింగ్ తో 85 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అన్ని వేరియంట్లకు ఛార్జింగ్ పెట్టడానికి 6 గంటల సమయం పడుతుంది.

EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాలో రెండోసారి కోవిడ్ అడ్వాన్స్ తీసుకోండి ఇలా

IRCTC: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి ఐఆర్‌సీటీసీ నేచురోపతి ప్యాకేజీ

ప్రత్యేకతలు


ఈ సరికొత్త పియాజియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల దగ్గరకొస్తే.. ఇందులో డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్ ను పొందుపరిచారు. ఇందులో ఉండే సెన్సార్ వల్ల బ్రైట్ నెస్ ఆటోమేటిక్ గా డిస్ ప్లే అవుతుంది. వెలుతురు ప్రకారం ఇది పనిచేస్తుంది. ఇది కాకుండా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, రిమోట్ ట్రాకింగ్, యాంటీ థెఫ్ట్ మెజర్స్ ఎల్ఈడీ లైటింగ్ సదుపాయం లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

ఈ సరికొత్త పియాజియో వన్ విద్యుత్ స్కూటర్ ఈ నెలలోనే ఐరోపా మార్కెట్లో విడుదలయ్యే అవకాశముంది. గ్లోబల్ ఈ-కామర్స్ మొబిలిటి స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. ప్రస్తుతం భారత్ లో ఈ స్కూటర్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మనదేశంలో ఈ సంస్థ మూడు చక్రాల వాహనాల తయారీపై దృష్టి పెట్టింది. భారత్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల గురించి కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.
Published by:Santhosh Kumar S
First published: