Piaggio New Vespa: కొత్త వెస్పా వచ్చేసింది... 75వ వార్షికోత్సవం సందర్భంగా వెస్పా స్పెషల్ ఎడిషన్ రిలీజ్

Piaggio New Vespa: కొత్త వెస్పా వచ్చేసింది... 75వ వార్షికోత్సవం సందర్భంగా వెస్పా స్పెషల్ ఎడిషన్ రిలీజ్ (image: Vespa)

Piaggio New Vespa | కొత్త వెస్పా కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. పియాజియో 75వ వార్షికోత్సవం సందర్భంగా వెస్పా స్పెషల్ ఎడిషన్ లాంఛ్ చేసింది.

  • Share this:
ఇటాలియన్​ వాహన సంస్థ పియాజియో 75వ వార్షికోత్సవం సందర్భంగా భారత మార్కెట్​లోకి స్పెషల్ ఎడిషన్​ వెస్పా స్కూటర్​ను లాంచ్​ చేసింది. ఈ కొత్త వెస్పా స్కూటర్ 125 సీసీ, 150 సీసీ రెండు ఇంజిన్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 125 సీసీ ఇంజిన్​ వేరియంట్​ రూ. 1.26 లక్షలు (ఎక్స్​షోరూమ్​, పూణే), 150 సీసీ ఇంజిన్​ వేరియంట్​ రూ. 1.39 లక్షలు (ఎక్స్​షోరూమ్, పూణే) ధర వద్ద విడుదలయ్యాయి. ఈ రెండు వేరియంట్ల బుకింగ్స్​ను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. కస్టమర్లు పియాజియో అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ సెంటర్లలో రూ. 5000 చెల్లించి ఈ స్కూటర్​ను బుక్​ చేసుకోవచ్చు. బుక్​ చేసుకున్న వారికి త్వరలోనే డెలివరీలు ప్రారంభమవుతాయని తెలిపింది.

PF Withdrawal Rule: ఈపీఎఫ్ కొత్త రూల్స్... ఒక్క రోజులో రూ.1,00,000 క్లెయిమ్ సెటిల్

BSNL Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... ఒకసారి రీఛార్జ్ చేస్తే 365 రోజులు డేటా


ఈ స్పెషల్​ ఎడిషన్​ స్కూటర్​ను హైలైట్​ చేసేందుకు పియాజియో దీనికి గ్లాసీ మెటాలిక్​ గియాలో కలర్​ను అందించింది. సంస్థ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ స్కూటర్​ ముందు వైపున ఉండే సైడ్​ ప్యానెల్స్​పై ‘75 డెకాల్స్​’ అని ప్రింట్​ చేసింది. దీంతో పాటు ఈ మోడల్​ టైల్​పై పెద్ద వృత్తాకార బ్యాగ్​ను కూడా అందించింది. ఈ బ్యాగ్​ చాలా వెడల్పుగా, సాఫ్ట్​గా ఉంటుంది. లెదర్​తో తయారైన ఈ బ్యాగ్​ బ్లాక్​ కలర్​ పెయింట్​తో వస్తుంది. ఈ బ్యాగ్​ లగేజ్​ ర్యాక్​లో షోల్డర్​ పట్టీ, క్లిప్​ వంటివి చేర్చింది. ఈ స్కూటర్​తో పాటే సంస్థ ఓ ప్రత్యేకమైన వెల్​కమ్​ కిట్​ను కూడా అందిస్తోంది.

LIC Policy: రోజూ రూ.29 పొదుపు చేస్తే రూ.4,00,000 మీవే... మహిళల కోసం ఎల్ఐసీ స్పెషల్ పాలసీ

IRCTC: తిరుమల వెళ్తున్నారా? పంచదేవాలయం టూర్ ప్యాకేజీ అందిస్తున్న ఐఆర్‌సీటీసీ

రూ. 5000లతో అడ్వాన్స్​ బుకింగ్​..


ఈ తాజా మోడల్స్‌లో కాంటూర్డ్​ బాడీ ప్యానెల్స్, డిఆర్​ఎల్​ ఎల్​ఈడీ హెడ్​లైట్​, రౌండ్​ షేప్ హెడ్ ల్యాంప్​లు, రౌండ్​ షేప్​ రియర్​ వ్యూ మిర్రర్స్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, సింగిల్​ పీస్​ సీట్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ వంటి ఫీచర్లను పియాజియో చేర్చింది. ఇంజిన్​ విషయానికి వస్తే.. దీనిలో 125 సిసి ఫ్యూయల్​ ఇంజెక్టెడ్​ సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ను అందించింది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 9.93 హెచ్‌పి పవర్, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.6 ఎన్ఎమ్ పవర్​ను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా, 150 సిసి ఇంజిన్​ మోడల్​ 7,600 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 హెచ్‌పి పవర్, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. దీని ముందు భాగంలో 200mm డిస్క్, వెనుక భాగంలో 140mm డ్రమ్‌ బ్రేక్​ వంటివి అందించింది.
Published by:Santhosh Kumar S
First published: