హోమ్ /వార్తలు /బిజినెస్ /

Vespa scooter: ఇకపై లీజుకు Piaggio India స్కూటర్లు...

Vespa scooter: ఇకపై లీజుకు Piaggio India స్కూటర్లు...

Vespa VXL, SXL

Vespa VXL, SXL

అప్రిలియా వెస్పా స్కూటర్లపై లీజింగ్ పథకాన్ని ప్రారంభించింది పియాగియో ఇండియా సంస్థ. ఇందుకోసం వాహన లోన్ ఫైనాన్సింగ్ సంస్థ ఓటీఓ క్యాపిటల్ తో జట్టు కట్టింది.

అప్రిలియా వెస్పా స్కూటర్లపై లీజింగ్ పథకాన్ని ప్రారంభించింది పియాగియో ఇండియా సంస్థ. ఇందుకోసం వాహన లోన్ ఫైనాన్సింగ్ సంస్థ ఓటీఓ క్యాపిటల్ తో జట్టు కట్టింది.  అధిక మొత్తంలో డబ్బు చెల్లించకుండా, ఎక్కువ మొత్తంలో ఈఎమ్ఐలు చెల్లించకుండా వాహనాలు కొనాలనుకునే వినియోగదారులకు ఇప్పుడు లబ్ధి చేకూరనుందని పియాగియో సంస్థ తెలిపింది. ప్రస్తుతం వెస్పా, అప్రిలియా స్కూటర్లకే ఈ లీజింగ్ వర్తింస్తుందని తెలిపింది. దీంట్లో భాగంగా పుణె, బెంగళూరులోని వినియోగదారులు కొంత మొత్తాన్ని నెలవారీగా చెల్లించి స్కూటర్లను తీసుకెళ్లి వాడుకోవచ్చు.

ఓటీఓ క్యాపిటల్ మొబైల్ యాప్ నుంచి కూడా బైక్లను లీజుకు తీసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం వినియోగదారులు కొంత డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. పథకం ద్వారా నెలవారీ ఈఎమ్ఐలో 30 శాతం వరకు తగ్గింపును పొందొచ్చు. దీంతో పాటు మొదటి నెల సబ్ స్క్రిప్షన్ ఛార్జీకి రూ. 2,500 మినహాయింపు ఇస్తున్నట్టు ఈ రెండు సంస్థలు వెల్లడించాయి.


కొత్త పథకం గురించి పియాగియో ఇండియా చైర్మన్, ఎండీ డియెగో గ్రాఫి మాట్లాడుతూ.. “ఈ కొత్త రకం బిజినెస్ కోసం ఓటీఓ క్యాపిటల్తో భాగస్వామ్యం నెలకొల్పాం. ఇప్పుడు మా కస్టమర్లు వెస్పా, అప్రిలియా ప్రీమియం ఓనర్షిప్ను వినూత్నంగా సొంతం చేసుకోవచ్చు. ఈ లీజింగ్ పథకం యువతను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. వెస్పా, అప్రిలియా మోడళ్లను మరింత మందికి చేరువ చేసేందుకు ఇది ఉపయోపడుతుందని మేము నమ్ముతున్నాం" అని వివరించారు.నిర్ణీత వ్యవధి పూర్తయిన తరువాత కస్టమర్లు స్కూటర్ కొనాలనుకుంటే కొంత ధర చెల్లించాలి. ప్రస్తుతం చెల్లించే ఈఎంఐ వద్ద వేరే స్కూటర్ ను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. అప్రిలియా, వెస్పా శ్రేణి స్కూటర్లు ఖరీదైనవి అని భావించే వినియోగదారులు, ఈ పథకం ద్వారా వాటికి చేరువ కావచ్చు.


First published:

Tags: Automobiles, Business, Cars

ఉత్తమ కథలు