Piaggio India: పియాజియో నుంచి మరో కొత్త స్కూటర్... ప్రీ-బుకింగ్ రూ.5,000 మాత్రమే

Piaggio India: పియాజియో నుంచి మరో కొత్త స్కూటర్... ప్రీ-బుకింగ్ రూ.5,000 మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)

Aprilia SXR 125 | పియాజియో ఇండియా ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 మోడల్ స్కూటర్‌ను లాంఛ్ చేసింది. కేవలం రూ.5,000 చెల్లించి ఈ స్కూటర్‌ను ప్రీ-బుకింగ్ చేయొచ్చు.

  • Share this:
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ పియాజియో ఇండియా... ఏప్రిలియా ఎస్​ఎక్స్​ఆర్​ 125 స్కూటర్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. వీటి ప్రీ-బుకింగ్స్​ను కూడా ప్రారంభించింది. 125 సిసి ఇంజన్​తో నడిచే ఈ ఎస్​ఎక్స్​ఆర్​ 125 స్కూటర్​ రూ.1.14 లక్షల (ఎక్స్-షోరూమ్ పుణె) ధర వద్ద అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త స్కూటర్​ గ్లోసీ రెడ్​, మాట్టే బ్లూ, గ్లోసీ వైట్​, మాట్లే బ్లాక్​.. వంటి నాలుగు కలర్​ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని డెలివరీలు త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. ఎస్​ఎక్స్​ఆర్​ 125 స్కూటర్​ లుక్స్​, డిజైన్​ పరంగా చూస్తే.. గత డిసెంబర్​లో ఇదే కంపెనీ నుంచి విడుదలైన ఎస్​ఎక్స్​ఆర్​ 160 డిజైన్​ను పోలి ఉంటుంది. అయితే ఈ రెండు స్కూటర్ల ధరల మధ్య తేడా కేవలం రూ.11 వేలు మాత్రమే. ఇది 125 సిసి సింగిల్​ సిలిండర్​ ఫ్యూయల్​ ఇంజెక్ట్​ ఇంజిన్​తో పనిచేస్తుంది. 7,600 ఆర్​పిఎమ్​ వద్ద గరిష్టంగా 9.3 బిహెచ్​పి శక్తిని, 6250 ఆర్​పిఎమ్​ వద్ద 9.2 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలు ఇవే

Airtel 2GB Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే

రూ.5 వేలతో ప్రీబుకింగ్​కు అవకాశం


ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్​ను భారతదేశంలోని అన్ని డీలర్‌షిప్‌ సెంటర్లలో ప్రీబుకింగ్​ చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 5000 టోకెన్​ మొత్తాన్ని డీలర్​షిప్ సెంటర్లలో చెల్లించి బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సరికొత్త ఉత్పత్తిపై పియాజియో ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డియెగో గ్రాఫి మాట్లాడుతూ "ఎస్​ఎక్స్​​ఆర్​ 125 స్కూటర్ మా కంపెనీ నుంచి విడుదలైన మరొక అద్భుతమైన మోడల్.​ దీనిలో125- సిసి ఇంజిన్​, 3- వాల్వ్​తో కూడిన క్లీన్ ఎమిషన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని అందించాం" అని చెప్పారు. అత్యుత్తమ రైడింగ్ అనుభవాన్ని అందించేందుకు ఈ స్కూటర్​లో సౌకర్యవంతమైన ఎర్గోనామిక్ సీట్లను అందించింది.

Aadhaar Charges: ఆధార్ సెంటర్‌లో ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నారా? ఇలా కంప్లైంట్ చేయండి

EPF Withdrawal: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డ్రా చేయొచ్చో తెలుసుకోండి

అంతేకాక, దీంట్లో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (సిబిఎస్)తో పాటు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్, ట్విన్ పాట్స్ కాలిపర్ వంటి వాటిని కూడా చేర్చింది. ఈ స్కూటర్​ చూడటానికి చాలా ఆకర్షనీయమైన డిజైన్​ కలిగి ఉంటుంది. అధునాతన టెక్నాలజీతో అభివృద్ది చేసిన ఈ సరికొత్త ప్రీమియం స్కూటర్, కస్టమర్లకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: