• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • PIAGGIO GROUP LAUNCHED ONE ELECTRIC SCOOTER KNOW PRICE AND FEATURES SS GH

Piaggio: పియాజియో నుంచి వన్ ఎలక్ట్రిక్ స్కూటర్... వచ్చే నెల నుంచి అమ్మకాలు

Piaggio: పియాజియో నుంచి వన్ ఎలక్ట్రిక్ స్కూటర్... వచ్చే నెల నుంచి అమ్మకాలు

Piaggio ONE electric scooter | పియాజియో నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. పియాజియో వన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

  • Share this:
భారత మార్కెట్​లో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్​ వాహనాలకు మంచి డిమాండ్​ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక వాహన తయారీ సంస్థలు, స్టార్టప్​ కంపెనీలు ఎలక్ట్రిక్​ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటాలియన్​ వాహన తయారీ సంస్థ పియాజియో గ్రూప్‌ తాజాగా ఎలక్ట్రిక్​ వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే వెస్పా ఎలెట్రికా, ఎప్రిలియా అనే ఎలక్ట్రిక్ స్కూటర్​ను విడుదల చేసిన పియాజియో ఇప్పుడు కొత్త వన్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను కూడా ఆవిష్కరించింది. యువతను దృష్టిలో పెట్టుకొని దీన్ని స్టైలిష్​ లుక్​లో రూపొందించింది. చూడటానికి ఎంతో అట్రాక్టివ్​గా కన్పించే ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. నగర ప్రయాణాలకు అనువుగా ఉండే ఇ-స్కూటర్‌ ఎంతో తేలిగ్గా ఉంటుంది. దీనిలో డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, సరౌండ్​ ఎల్ఈడీ లాంప్స్​, కీలెస్​ ఎంట్రీ, విశాలమైన అండర్​ సీట్ స్టోరేజ్​ వంటి అనేక ఫీచర్లు, అప్​డేటెడ్​ టెక్నాలజీని అందించింది.

అంతేకాకుండా, ఇందులో రూబస్ట్​ పుల్ అవుట్​ ఫుట్​పాగ్​లు, విశాలంగా ఉండే ఫుట్​బోర్డ్​లను కూడా చేర్చింది. ఈ కొత్త స్కూటర్​ను అధికారికంగా ఆవిష్కరించినప్పటికీ దీనిలో ఉన్న టెక్నికల్​ ఫీచర్లను మాత్రం వెల్లడించలేదు. అయితే, మే 28న జీజింగ్​లో జరిగే మోటార్​ ఫోలో టెక్నికల్​ ఫీచర్స్​ వెల్లడయ్యే అవకాశం ఉంది. కావున త్వరలో ఈ టెక్నికల్​ ఫీచర్స్​ గురించి పూర్తి సమాచారం అందుబాటులోకి రానుంది.

ATM Transaction Failed: ఏటీఎంలో డబ్బులు రాలేదా? అకౌంట్‌లో బ్యాలెన్స్ కట్ అయితే ఇలా కంప్లైంట్ చేయండి

SBI Insurance: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉందా? రూ.20,00,000 వరకు ఇన్స్యూరెన్స్ పొందండి ఇలా

కొత్తగా 100 డీలర్​షిప్​ సెంటర్లు


పియాజియో వన్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ అనేక వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిలో రిమూవబుల్ లిథియం అయాన్​ బ్యాటరీ ప్యాక్​ను చేర్చింది. దీనిని సులభంగా ఛార్జ్​ చేసుకోవచ్చు. దేశీయ మార్కెట్​లో పియాజియో కంపెనీ తన అమ్మకాలు, సేవలను పెంచుకోవడానికి మరిన్ని డీలర్​షిప్​లకు విస్తరిస్తోంది. ఇటాలియన్​ మార్కెట్​కు చెందిన ఈ వాహన తయారీ సంస్థ భారతదేశాన్ని ప్రధాన మార్కెట్​గా భావిస్తోంది. ఎందుకంటే పియాజియో తయారు చేసిన వాహనాల్లో 45 శాతం వాహనాలు ఒక్క భారతదేశంలోనే అమ్ముడవుతున్నాయి. ఈ కారణంగానే కంపెనీ ఇప్పుడు తన డీలర్​షిప్​లను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది.

SBI Charges: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు

Bank Account: కస్టమర్లకు అలర్ట్... ఈ బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ పనిచేయవు

వచ్చే ఏడాది భారత్​లో 100 కొత్త డీలర్​షిప్​లను తెరవాలని సంస్థ యోచిస్తోంది. కొత్త వన్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను వచ్చే నెల నుంచి యూరోపియన్​ మార్కెట్​లో విక్రయించనున్నట్లు పియాజియో పేర్కొంది, తర్వాత దశలో దీన్ని గ్లోబల్​ మార్కెట్​లోకి విడుదల చేయనుంది, కానీ, భారత మార్కెట్​లోకి ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.
Published by:Santhosh Kumar S
First published: