ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్ పే(Phonepe) 2020 అక్టోబర్‌లో సేవలను ప్రారంభించినప్పటి నుంచి 10 లక్షల టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించింది. ఫోన్ పే ద్విచక్ర వాహనాలకు ఇన్స్టంట్ ఇన్సూరెన్స్ (Instant Insurance) అందిస్తుంది. ఎటువంటి తనిఖీ లేకుండా గడువు ముగిసిన పాలసీలకు కూడా ఉచితంగా రెన్యువల్ చేసుకునే సదుపాయం అందిస్తోంది. కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీ విక్రయాలలో నాలుగింట మూడు వంతుల కంటే ఎక్కువ టైర్ II, టైర్ III నగరాల నుంచి వచ్చాయి. విస్తారమైన పాలసీ రకాలు, సరసమైన ధరలు, పేపర్‌లెస్ 2 నిమిషాల ప్రక్రియతో రహదారిపై ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్యను తగ్గించేలా చేయడమే లక్ష్యమని కంపెనీ పేర్కొంది.
ఈ సందర్భంగా ఫోన్‌పే జనరల్ ఇన్సూరెన్స్ హెడ్ ప్రన్నయ్ బాత్రా మాట్లాడుతూ.. 75 శాతం కంటే ఎక్కువ కొనుగోళ్లు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి రావడం సంతోషంగా ఉందని, ఇది భారతదేశంలో ఫోన్ పేకి లభిస్తున్న ఆదరణకు నిదర్శనమని చెప్పారు. 2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్ చేయాలనే IRDAI లక్ష్యానికి అనుగుణంగా దేశంలో ఇన్సూరెన్స్ పాలసీలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇన్సూరెన్స్ పాలసీల సంఖ్యను పెంచడంపై ఫోన్ పే దృష్టి పెట్టిందన్నారు.
ప్లాట్‌ఫారమ్‌లో విక్రయించే మొత్తం ఇన్సూరెన్స్ టూ-వీలర్ పాలసీలలో, 80 శాతానికి పైగా వినియోగదారులు గడువు ముగిసిన కవర్లతో కొనుగోలు చేశారు. ఇది ఫోన్ పే ప్లాట్‌ఫారమ్ మునుపు తక్కువ సేవలందిస్తున్న సెగ్మెంట్లను సూచిస్తోంది. వారికి తగినంత అవగాహన, ఇన్సూరెన్స్ పునరుద్ధరించడానికి అనుకూలమైన మార్గం లేదు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో థర్డ్-పార్టీ వాహన నష్టాలు, సొంత వాహన నష్టాలు రెండింటినీ కవర్ చేసే సమగ్ర ప్లాన్లను కస్టమర్లు ఇష్టపడుతున్నారు. ఫోన్‌పే తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో కస్టమర్ అవగాహన, స్థోమత, ఇన్సూరెన్స్ సేవల లభ్యతను పెంపొందించడంలో కంపెనీ ప్రయత్నాల విజయానికి ఈ విక్రయాల సంఖ్య నిదర్శనమని ఫోన్ పే తెలిపింది.
ఫోన్ పే 2020 అక్టోబర్‌లో బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో టూ-వీలర్, కార్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇన్సూరెన్స్-> మైమనీ కింద ప్లాట్‌ఫారమ్ మోటార్ ఇన్సూరెన్స్ పేజీ నుంచి పాలసీలను నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఫోన్ పే కొనుగోలుదారులు 20 నిమిషాలలోపు ఇన్స్టంట్ క్లెయిమ్ సెటిల్మెంట్ పొందవచ్చని పేర్కొంది.
385 మిలియన్లకు పైగా వినియోగదారులతో, అతిపెద్ద డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లలో ఫోన్ పే ఒకటి. డిజిటల్ వాలెట్లు, UPI చెల్లింపులను అందించడంతో పాటు, ఫోన్ పే మ్యూచువల్ ఫండ్స్ టాక్స్ సేవింగ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్, అనేక హెల్త్ ప్లాన్లను కూడా అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.