హోమ్ /వార్తలు /బిజినెస్ /

నీతి అయోగ్, ఫోన్‌పే ఆధ్వర్యంలో ఫిన్‌టెక్ హాకథాన్.. రూ. 5 లక్షల క్యాష్ ప్రైజ్.. వివరాలివే

నీతి అయోగ్, ఫోన్‌పే ఆధ్వర్యంలో ఫిన్‌టెక్ హాకథాన్.. రూ. 5 లక్షల క్యాష్ ప్రైజ్.. వివరాలివే

నీతి ఆయోగ్ (File)

నీతి ఆయోగ్ (File)

ఫిన్‌టెక్ రంగంలో సరికొత్తగా పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా ఈ హాకథాన్ ను నిర్వహించనున్నట్లు ఫోన్ పే, నీతి అయోగ్ వెల్లడించాయి. ఈ ఈవెంట్‌లో దరఖాస్తులు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల 23ని ఆఖరి తేదీగా నిర్ణయించాయి.

నీతి అయోగ్ (Niti Aayog), ఫోన్‌పే (Phone pe) కీలక నిర్ణయం తీసుకున్నాయి. సంయుక్తంగా హాకథాన్‌ (Hackathon)ను నిర్వహించాలని నిర్ణయించాయి. ఫిన్‌టెక్ పరిశ్రమ ప్రాధాన్యతను వివరించడానికి ఈ హాకథాన్‌ను ప్రకటించాయి. ఫిన్‌టెక్ రంగంలో సరికొత్తగా పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా ఈ హాకథాన్ ను నిర్వహించనున్నట్లు ఫోన్ పే, నీతి అయోగ్ వెల్లడించాయి. ఈ ఈవెంట్‌లో దరఖాస్తులు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల 23ని ఆఖరి తేదీగా నిర్ణయించాయి. ఫైనల్ ఎంట్రీలకు ఫిబ్రవరి 25వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఈ హాకథాన్ కు సంబంధించిన విజేతలను ఈ నెల 28వ తేదీన ప్రకటించనున్నారు. ఈ హాకథాన్ గురించిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు లైవ్ ఏఎంఏ నిర్వహించనున్నారు. ఇంకా ఈ హాకథాన్‌లో విజేతలకు అద్భుతమైన బహుమతులను ప్రకటించారు. విజేతగా నిలిచిన బృందానికి రూ. 5 లక్షలు అందించనున్నారు.

ఇంకా.. టాప్ 5 విన్నర్‌లకూ క్యాష్ ప్రైజ్‌ ను సైతం ఇవ్వనున్నారు. టాప్‌ 5లో ఫష్ట్ ప్లేస్ టీమ్‌కు రూ. 1.50 లక్షల క్యాష్ మనీ ఇవ్వనున్నారు. సెకండ్ ప్లేస్‌లో నిలిచిన రెండు బృందాలకు రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నారు. థర్డ్ ప్లేస్‌లో నిలిచిన రెండు టీమ్‌లకు క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు. థర్డ్ ప్లేస్ లో నిలిచిన వారికి రూ. 75 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ హాకథాన్ గురించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి లేదా అప్లై చేసుకోవడానికి https://cic.niti.gov.in/fintech-open-month-hackathon.html వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

Income Tax Notice: ఇన్‌కమ్ టాక్స్ నోటీసు వచ్చిందా ?.. ఇది కూడా కారణం కావొచ్చు..

హాకథాన్‌లో పాల్గొనేవారు ఫోన్‌పే పల్స్ వంటి ఏవైనా ఓపెన్ డేటా ఏపీఐలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ అగ్రిగేటర్ వంటి ఫ్రేమ్‌వర్క్‌లను సైతం వాడుకోవచ్చు. సెటు ఏఏ శాండ్‌బాక్స్, లేదా సెటు పేమెంట్స్ శాండ్‌బాక్స్ లేదా ఇతర ఏ ఓపెన్ డేటా ప్లాట్‌ఫామ్స్ అయినా అభ్యర్థులు వినియోగించుకోవచ్చు.

First published:

Tags: Niti Aayog, PhonePe

ఉత్తమ కథలు