హోమ్ /వార్తలు /బిజినెస్ /

PhonePe: ఫోన్‌పే యాప్ ఉందా? డబ్బులు సంపాదించండి ఇలా

PhonePe: ఫోన్‌పే యాప్ ఉందా? డబ్బులు సంపాదించండి ఇలా

PhonePe: ఫోన్‌పే యాప్ ఉందా? డబ్బులు సంపాదించండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

PhonePe: ఫోన్‌పే యాప్ ఉందా? డబ్బులు సంపాదించండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

PhonePe | ప్రస్తుతం ఫోన్‌పేలో 20 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లున్నారు. వారంతా గోల్డ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్, లిక్విడ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివన్నీ ఒకే చోట పొందొచ్చు.

  మీరు ఫోన్‌పే యాప్ వాడుతున్నారా? మీకు శుభవార్త. సరికొత్త పెట్టుబడి మార్గాలకు వేదికగా నిలిచేందుకు ఆదిత్య బిర్యా సన్‌లైఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఫోన్‌పే సూపర్ ఫండ్ పేరుతో ఓ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. 20 కోట్ల మంది యూజర్లు ఈక్విటీ, డెట్, గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. యూజర్లు రూ.500 నుంచి తమ ఇన్వెస్టింగ్ మొదలుపెట్టొచ్చు. మీరు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి మార్గాలను వెతుక్కోవచ్చు. ఇప్పటికే పేటీఎం మనీ ఇలాంటి సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పేటీఎం మనీకి పోటీగా ఫోన్‌పై ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. అన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ మీకు ఒకే దగ్గర లభిస్తాయి.

  ప్రస్తుతం ఫోన్‌పేలో 20 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లున్నారు. వారంతా సూపర్ ఫండ్ ప్లాట్‌ఫామ్‌లో గోల్డ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్, లిక్విడ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివన్నీ ఒకే చోట పొందొచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకునేవారికి ఈక్విటీ ఫండ్స్, తక్కువ రిస్క్ తీసుకునేవారికి డెట్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కోవిడ్ 19 మహమ్మారిని కవర్ చేసే ఇన్స్యూరెన్స్ పాలసీ కూడా ఉంది. ఈ ఫండ్స్ అన్నింటినీ ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫండ్ మేనేజర్లు పర్యవేక్షిస్తుంటారు. కనీసం రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.

  భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. అమెరికా జీడీపీ కన్నా అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ ఎక్కువ. కానీ భారతదేశంలో జీడీపీలో 11 శాతమే అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ ఉన్నాయి. ఇటీవల భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2014 మార్చి నుంచి 2019 మార్చి మధ్య ఏయూఎం వృద్ధి రేటు 24 శాతం సీఏజీఆర్ ఉండటం విశేషం.

  ఇవి కూడా చదవండి:

  SBI Loan: 45 నిమిషాల్లో రూ.5,00,000 వరకు లోన్... అప్లై చేయండిలా

  Jio Prepaid Plan: ఈ జియో ప్లాన్ రీఛార్జ్ చేస్తే 102 జీబీ డేటా వాడుకోవచ్చు

  SBI: వృద్ధులకు కొత్త స్కీమ్ ప్రకటించిన ఎస్‌బీఐ... ఎంత లాభమంటే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, Investment Plans, Mutual Funds, Personal Finance, PhonePe, TAX SAVING

  ఉత్తమ కథలు