ప్రముఖ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే మరో మంచి సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ‘ఫోన్‌పే ఏటీఎం సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇది మెషిన్ ద్వారా అందించే ఏటీఎం సేవలు కావు. ఫోన్‌పే వినియోగదారులు ఎంపిక చేసిన దుకాణాల వద్ద, నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఒక వినియోగదారుడు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే తీసుకునే వీలుంది. Phonepe యూజర్ ఎవరైనా తమకు క్యాష్ కావాలనుకుంటే Phonepe యాప్ ఓపెన్ చేసి.. అందులో Stores tabపై క్లిక్ చేసి. Phonepe ATM ఐకాన్ పై Click చేయాలి. అప్పుడు మీ సమీపంలో ఏ మర్చంట్ సెంటర్లో డబ్బు ఉపసంహరించుకోవచ్చో చూపిస్తుంది. మర్చెంట్ షాపు దగ్గరకు వెళ్లి మీ ఫోన్ పే యాప్ లో Withdraw బటన్ పై క్లిక్ చేయండి. ఎంత అమౌంట్ అవసరమో Phonepe అకౌంట్లో ఎంటర్ చేసి మర్చంట్ కు ట్రాన్స్ ఫర్ చేయండి. మర్చంట్ తనకు అమౌంట్ రీసివ్ కాగానే.. అంతే మొత్తాన్ని క్యాష్ రూపంలో కస్టమర్ కు అందిస్తాడు.
మనీ విత్ డ్రా చేసుకునే క్రమంలో కస్టమర్ లేదా మర్చంట్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ప్రస్తుతం ఈ సేవలను ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business