హోమ్ /వార్తలు /బిజినెస్ /

PhonePe: గుడ్‌న్యూస్..విదేశాల్లోనూ ఫోన్‌పే..ఈ 5 దేశాల్లో ఇక యూపీఐ పేమెంట్స్‌ చేయవచ్చు

PhonePe: గుడ్‌న్యూస్..విదేశాల్లోనూ ఫోన్‌పే..ఈ 5 దేశాల్లో ఇక యూపీఐ పేమెంట్స్‌ చేయవచ్చు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PhonePe: డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే(PhonePe) కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ పేమెంట్స్‌ను విదేశాల్లోని వ్యాపారులకు సైతం చేయడానికి అవకాశం కల్పించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) సేవలు వేగంగా పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. బ్యాంకులతో పనిలేకుండానే ఆర్థిక లావాదేవీలను సులభంగా, త్వరగా చేయడానికి అవకాశం ఉండడంతో యూపీఐ సేవలు బాగా పాపులర్ అయ్యాయి. డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే(PhonePe) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ పేమెంట్స్‌ను విదేశాల్లోని వ్యాపారులకు సైతం చేయడానికి అవకాశం కల్పించింది.

 హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి షాక్!

* లోకల్ QR కోడ్‌ తప్పనిసరి

PhonePe ద్వారా UPI పేమెంట్స్ ఐదు దేశాల్లోని విదేశీ వ్యాపారులకు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ వ్యాపారులకు స్థానిక QR కోడ్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒక్క మాటాలో చెప్పాలంటే అంతర్జాతీయ డెబిట్ కార్డ్‌ల మాదిరిగానే, వినియోగదారులు తమ ఇండియన్ బ్యాంకు నుంచి విదేశీ కరెన్సీలో UPI పేమెంట్స్ చేయవచ్చు.

* క్రాస్-బొర్డర్ UPI పేమెంట్ మొదటి ఫిన్‌టెక్

ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ PhonePe ‘యూపీఐ ఇంటర్నేషనల్’ పేమెంట్ ఫీచర్‌ను తాజాగా ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూఏఈ, సింగపూర్, నేపాల్, భూటాన్, మారిషస్‌ వంటి విదేశాలకు వెళ్లే భారతీయులు ఇకపై UPI ద్వారా విదేశీ వ్యాపారులకు పేమెంట్స్ చేయవచ్చు. దీంతో భారత్‌లో క్రాస్-బొర్డర్ UPI పేమెంట్స్ ప్రారంభించిన మొట్టమొదటి ఫిన్‌టెక్‌ కంపెనీగా ఫోన్‌పే అవతరించింది.

లోన్ తీసుకున్న వారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త రూల్స్

* మర్చంట్ లోకేషన్‌ లేదా ట్రిప్‌కు ముందు

పైన పేర్కొన్న దేశాల్లోని విదేశీ వ్యాపారులకు లోకల్ క్యూఆర్ కోడ్ ఉంటే వారికి UPI పేమెంట్స్ చేయవచ్చు. అంతర్జాతీయ డెబిట్ కార్డ్స్ మాదిరిగానే, యూజర్స్ తమ ఇండియన్ బ్యాంకు నుంచి విదేశీ కరెన్సీలో UPI పేమెంట్స్ చేయడానికి ఫోన్‌పే అవకాశం కల్పించింది. ఫోన్‌పే యూజర్లు UPI ఇంటర్నేషనల్ ఫీచర్ కోసం వారి UPI-లింక్డ్ అకౌంట్‌ను మర్చంట్ లోకేషన్‌లో లేదా ఫారిన్ ట్రిప్‌కు ముందు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్వీస్‌ను యాక్టివేట్ చేయడానికి యూజర్లు తమ UPI పిన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడే త్వరపడాలి... భారం పెరిగే ఛాన్స్

* దేశాల్లో UPI ఎక్స్‌పీరియన్స్ కోసం

ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ చారి మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా భారత్ అనుసరించిన విధంగా, ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా UPIని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి UPI ఇంటర్నేషనల్ ఫీచర్ మొదటి అడుగు అని ఆయన అన్నారు. ఈ ప్రయోగం గేమ్‌ఛేంజర్‌గా మారుతుందని, విదేశాలకు వెళ్లే భారతీయులు అక్కడి బిజినెస్ అవుట్‌లెట్లలో పేమెంట్ చేసే విధానాన్ని పూర్తిగా మారుస్తుందని రాహుల్ చారి ధీమా వ్యక్తం చేశారు. కొత్త UPI ఫీచర్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చిన మొదటి TPAPగా PhonePe రికార్డ్ సృష్టించిందన్నారు.

ఫోన్‌పే ఈ మార్పుకు నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచం మొత్తం UPIని ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన అవసరం ఉందని, అందుకు ఫోన్‌పే ఎంతో కృషి చేస్తోందని రాహుల్ చారి పేర్కొన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI).. NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ సహకారంతో మరిన్ని దేశాల్లో UPI ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.

First published:

Tags: Business, Digital payments, PhonePe

ఉత్తమ కథలు