కరోనా తర్వాత ఆరోగ్య బీమా పాలసీలకు(Health Insurance) డిమాండ్ అమాంతం పెరిగింది. ప్రజల్లో ఇన్సూరెన్స్ (Insurance) పాలసీలపై అవగాహన పెరగడమే దీనికి కారణం. దీంతో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్తరకం ఆరోగ్య బీమా పాలసీలను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే (Phonepe) సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టింది. కేవలం రూ.999కే ఆరోగ్య బీమా పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నట్లు ఫోన్‌పే తెలిపింది. ఇన్ పేషెంట్, ఐసీయూ హాస్పిటలైజేషన్, డేకేర్ పాలసీ, అంబులెన్స్ ఛార్జీలు, ఆయూష్ చికిత్సతో పాటు ఆసుపత్రి ఖర్చులకు ఈ పాలసీ కవరేజీ అందిస్తుందని పేర్కొంది. దేశంలోని 7600 నెట్‌వర్స్ ఆసుపత్రుల్లో ఈ బీమా పాలసీ వర్తిస్తుందని ఫోన్ పే స్పష్టం చేసింది. ఈ పాలసీలో సులభంగా ఎన్రోల్ అవ్వొచ్చు. కేవలం మూడు సులభమైన స్టెప్స్‌లో పాలసీలో చేరవచ్చు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు పేరు, వయసు, లింగం, ఈమెయిల్ ఐడీ, వంటి వివరాలను మాత్రమే అందిస్తే సరిపోతుంది.
ఆరోగ్య బీమా పాలసీలో ఇలా చేరండి..
1. ముందుగా ఫోన్‌పే యాప్‌లోకి లాగిన్ అవ్వండి. యాప్‌లో ‘ఇన్సూరెన్స్’ ట్యాబ్‌ని సెలెక్ట్ చేసుకోండి.
2. అనంతరం Health @999 లోగోపై క్లిక్ చేయండి.
3. మీ వయసు, అవసరమైన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ మొత్తాన్ని ఎంటర్ చేయండి.
4. పేరు, లింగం, పుట్టిన తేదీ, ఈ–మెయిల్ ఐడి వంటి ప్రైమరీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి.
5: పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి చెల్లింపు పూర్తి చేస్తే.. అంతే మీ బీమా పాలసీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. వెంటనే ఇన్సూరెన్స్ పాలసీ అమల్లోకి వస్తుంది. అయితే సంబంధిత నియమ, నిబంధనలు వర్తిస్తాయి.
కాగా, కరోనా కారణంగా భారతీయులు ఆరోగ్య బీమా పాలసీ కొనుగోళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో ఆన్ లైన్ లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఫోన్ పే యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా కేవలం రూ. 999కే మొట్ట మొదటిసారి ఆరోగ్య బీమా పాలసీని తీసుకొచ్చింది.
Credit Score: క్రెడిట్ స్కోరు పడిపోతోందా...అయితే తీసుకోవాల్సిన చర్యలు ఇవే...ఈ తప్పులు చేయకండి..
తక్కువ ధరలోనే అధిక కవరేజీ ఇచ్చేలా ఈ పాలసీని డిజైన్ చేసింది. 335 మిలియన్ల ఫోన్ పే వినియోగదారులు ఈ ప్లాన్ తో గొప్ప ప్రయోజనం పొందుతారని ఫోన్‌పే వైస్ ప్రెసిడెంట్ హెడ్ గుంజన్ ఘై తెలిపారు. విద్య, ఆదాయాలతో సంబంధం లేకుండా అధిక నాణ్యత, సరసమైన ఆరోగ్య బీమాను అందించాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Insurance, Insurance, Life Insurance, PhonePe