డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫాం ఫోన్‌పే కొత్త సేవల్లోకి అడుగుపెట్టింది. ఆ సంస్థకు తాజాగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI).. ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లైసెన్స్ జారీ చేసింది. వాస్తవానికి ఫోన్‌పే గత సంవత్సరంలోనే ఇన్సూర్‌టెక్ రంగంలోకి (insurtech sector) అడుగుపెట్టింది. అప్పట్లో ఈ సంస్థకు లిమిటెడ్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్ మాత్రమే లభించింది. దీనికి పరిమితులు ఉన్నాయి. దీని ద్వారా కంపెనీ ప్రతి కేటగిరీలో మూడు ఇన్సూరెన్స్ కంపెనీలతోనే ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్త 'డైరెక్ట్ బ్రోకింగ్' లైసెన్స్‌తో ఫోన్‌పే భారతదేశంలోని అన్ని బీమా కంపెనీల ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌ను పంపిణీ చేయవచ్చు. కొత్త బ్రోకింగ్ లైసెన్స్ ద్వారా ఫోన్‌పే తమ వినియోగదారులకు పర్సనలైడ్జ్ ప్రొడక్ట్స్ సిఫార్సు చేయవచ్చు. భారత వినియోగదారుల కోసం మరిన్ని విభిన్నమైన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పోర్ట్‌ఫోలియోను అందించవచ్చు.
దీనిపై ఫోన్‌పే వైస్ ప్రెసిడెంట్, ఇన్సూరెన్స్ హెడ్ గుంజన్ ఘాయ్ మాట్లాడారు. సంస్థ ఇన్సూరెన్స్ ప్రయాణంలో ఈ లైసెన్స్ ఒక పెద్ద మైలురాయి అని చెప్పారు. ఈ రంగంలో అభివృద్ధికి తాజా బ్రోకింగ్ లైనెస్స్ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమర్లకు మెరుగైన సేవలందిస్తూ ఈ రంగంలో తమ ప్రత్యేకత చాటుకుంటామని చెప్పారు.
మీ పేటీఎం, ఫోన్ పేలో డబ్బులు సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి
కొత్త లైసెన్స్‌తో ప్రయోజనం
ఫోన్‌పే సంస్థ గత ఏడాది జనవరిలో 'కార్పొరేట్ ఏజెంట్'గా ఇన్సూరెన్స్ విభాగంలోకి ప్రవేశించింది. అయితే లైసెన్స్ పరిమితుల కారణంగా సాధారణ బీమా, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్లను ప్రారంభించింది. ఫోన్‌పేకు భారత్‌లో 30 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. భారీ యూజర్ బేస్ ఉన్న ఈ సంస్థకు.. తాజా లైసెన్స్ మరిన్ని లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
యాప్ ద్వారా వినూత్న సేవలు
భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫాంలలో ఫోన్‌పే ఒకటి. సంస్థ మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు కొన్ని క్షణాల్లోనే డబ్బు పంపవచ్చు, స్వీకరించవచ్చు. మొబైల్, DTH రీఛార్జ్ చేసుకోవచ్చు. విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. స్టోర్లలో పేమెంట్లు చేయడంతో పాటు బంగారం కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌పే సాయంతో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.