PhonePe: కస్టమర్లకు షాకిచ్చిన ఫోన్‌పే.. ఇక భారీగా ఛార్జీల వసూలు.. ఎంతంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే తమ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. యూపీఐతో సహా కొన్ని ట్రాన్సాక్షన్లపై ట్రాన్సాక్షన్ ఫీజు విధించడం ప్రారంభించామని ఫోన్‌పే ప్రకటించింది.

  • Share this:
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే (PhonePe) తమ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. యూపీఐతో సహా కొన్ని ట్రాన్సాక్షన్లపై ట్రాన్సాక్షన్ ఫీజు (Transaction Fees) విధించడం ప్రారంభించామని ఫోన్‌పే ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రయోగాత్మకంగా రూ.50కి మించిన రీఛార్జీలపై (Recharge) ప్రతీ ట్రాన్సాక్షన్‌కు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1 వసూలు చేస్తోంది. రూ.100కి మించిన రీఛార్జీలపై ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 2 తీసుకుంటోంది. ఫోన్‌పే ప్రత్యర్థి కంపెనీలన్నీ ఈ సేవలను ఉచితంగానే అందిస్తున్నాయి. దాంతో యూపీఐ (UPI) ఆధారిత లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించిన తొలి కంపెనీగా ఫోన్‌పే నిలిచింది.

“రీఛార్జ్‌లపై, మేము చాలా చిన్న స్థాయి ప్రయోగాన్ని అమలు చేస్తున్నాం. ఈ ప్రయోగంలో కొందరు యూజర్లు మొబైల్ రీఛార్జ్‌ల కోసం ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తున్నారు. రూ.50కి మించని రీఛార్జ్‌లపై ఫీజు వసూలు చేయట్లేదు. అయితే రూ.50-100 రీఛార్జీలపై రూ.1.. రూ.100 కన్నా ఎక్కువ రీఛార్జీలపై రూ.2ను వసూలు చేస్తున్నాం. ఈ ప్రయోగంలో భాగంగా మెజారిటీ వినియోగదారులు ఏమీ చెల్లించరు. లేదా రూ.1 మాత్రమే చెల్లిస్తారు." అని ఫోన్ పే కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Best Data Plans: మీకు డైలీ డేటా సరిపోవడం లేదా? అయితే.. Airtel, Jio, Vi అందించే ఈ బెస్ట్ ప్లాన్లను ఎంచుకోండి

ఇతర పేమెంట్ యాప్స్‌లాగే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే చెల్లింపులకు ఫోన్ పే ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం ప్రారంభిస్తుంది. కాగా ఫీజులు వసూలు చేసే ఏకైక చెల్లింపు ప్లాట్‌ఫామ్ ఫోన్ పే ఒక్కటే కాదని కంపెనీ ప్రతినిధి చెప్పుకొచ్చారు. బిల్లర్ వెబ్‌సైట్‌లు, చెల్లింపు ప్లాట్‌ఫామ్‌లు బిల్ చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి నామమాత్రంగా ఫీజును వసూలు చేస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై మాత్రమే ప్రాసెసింగ్ రుసుమును (ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కన్వీనియన్స్ ఫీజుగా వర్ణిస్తారు) వసూలు చేస్తామని ప్రతినిధి స్పష్టం చేశారు.
PM Kisan: రైతులకు అలర్ట్.. ఇలా చేస్తే ఖాతాలోకి రూ. 4 వేలు.. రిజిస్ట్రేషన్ కు మరి కొన్ని రోజులే ఛాన్స్

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల యూపీఐకి సంబంధించి మార్కెట్ వాటాపై ఒక పరిమితిని విధించింది. 30 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉన్న డిజిటల్ చెల్లింపుల పేమెంట్స్ సంస్థలు ఉండకూడదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. అయితే సెప్టెంబర్‌లో ఫోన్ పే కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌లో 165 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలను నమోదు చేసింది. అంటే యాప్ సెగ్మెంట్‌లో 40 శాతానికి పైగా వాటాను నమోదు చేసింది.
Diwali Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

బెర్న్‌స్టెయిన్ నివేదిక ప్రకారం ఫోన్ పే, గూగుల్ పే రెండూ తమ కస్టమర్ ప్రోత్సాహకాలను తగ్గించి వాటాను 30 శాతానికి పరిమితం చేయాలని చూస్తున్నాయి. ఫోన్ పే సంస్థ తన ట్రేడ్‌మార్క్‌లను దుర్వినియోగం చేయకుండా భారత్ పే నిర్వహిస్తున్న రెసిలెంట్ ఇన్నోవేషన్స్‌ను నిరోధించాలని గతంలో బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. తరువాత తన పిటిషన్‌ని వెనక్కు తీసుకున్న ఫోన్‌పే ఈ వ్యవహారంపై మళ్ళీ కేసు దాఖలు చేయనున్నట్లు తెలిపింది.
Published by:Nikhil Kumar S
First published: