ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇన్వెస్ట్‌మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. చాలా మంది రిస్క్ లేని ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లలో పెట్టుబడి పెట్టాలని చూస్తుంటారు. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ అందుతుందని, స్టాక్ మార్కెట్‌లో నష్టాల భయం ఉంటుందని ఆలోచించే వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System) స్కీమ్‌లు బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఎన్‌పీఎస్ కింద గ్యారెంటీ పెన్షన్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చే యోచనలో ఉంది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA). గ్యారెంటీ పెన్షన్ ప్రోగ్రామ్‌ను సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్‌పర్సన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. ‘ద్రవ్యోల్బణం , రూపాయి క్షీణతను రెగ్యులేటరీ బాడీ నిరంతరం గమనిస్తుంది. పెట్టుబడిదారులకు ద్రవ్యోల్బణం-రక్షిత(Inflation-Protected) రాబడిని అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రతికూల సమయాల్లోనూ పెట్టుబడిదారులకు రాబడిని అందించింది’ అని చెప్పారు.
సుప్రతిమ్ బందోపాధ్యాయ ఇటీవల న్యూస్ రిపోర్టర్‌లతో మాట్లాడుతూ.. మినిమం సమ్ అస్యూర్డ్ రిటర్న్ స్కీమ్ అభివృద్ధి చేస్తున్నాం. పనులు తుది దశలో ఉన్నాయని చెప్పారు. సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభించే అవకాశం ఉందన్నారు. 13 సంవత్సరాల కాలంలో 10 శాతం కంటే ఎక్కువ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్‌ను సాధించామన్నారు. కచ్చితంగా చెప్పాలంటే 10.27 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్‌ను నమోదు చేసినట్లు వివరించారు. ఎల్లప్పుడూ పెట్టుబడిదారులకు ద్రవ్యోల్బణం-రక్షిత రాబడిని అందించామని బంధోపాధ్యాయ వివరించారు.
పెన్షన్ ఆస్తుల పరిమాణం రూ. 35 లక్షల కోట్లు అని, ఇందులో 22 శాతం మొత్తం రూ.7.72 లక్షల కోట్లు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) వద్ద ఉన్నాయని, 40 శాతం నిధులను ఈపీఎఫ్‌వో నిర్వహిస్తోందని పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ చెప్పారు. ఈ సంవత్సరం సబ్‌స్క్రైబర్‌ల రిజిస్ట్రేషన్ 3.41 లక్షల నుంచి 9.76 లక్షలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సబ్‌స్క్రైబర్స్ రిజిస్ట్రేషన్స్ 20 లక్షలకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. ఆధార్, డిజిలాకర్, KYC కోసం CKYC, OTP ఆధారిత అథెంటికేషన్‌లు, ఆన్‌బోర్డింగ్/సర్వీసింగ్ పేపర్‌లెస్ ప్రక్రియలు వంటి డిజిటల్ మార్గాలు, అనేక ఇతర కార్యక్రమాల ద్వారా ఆన్-బోర్డింగ్ సౌలభ్యం ఉందని ఆయన అన్నారు. స్కీమ్‌లో చేరేవారి గరిష్ఠ వయసు పరిమితిని సడలించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న 70 సంవత్సరాల లిమిట్‌ను 75 సంవత్సరాలకు పెంచినట్లు స్పష్టం చేశారు.
ఎన్‌పీఎస్ అకౌంట్ 60 ఏళ్ల వయస్సులో లేదా పదవీ విరమణ వయస్సులో ఆటోమేటిక్‌గా కొనసాగుతుంది. యాన్యుటీ కొనుగోలును 75 సంవత్సరాల వయస్సు వరకు వాయిదా వేయవచ్చు. సబ్‌స్క్రైబర్ ఐదేళ్ల తర్వాత ప్రీ మెచ్యూర్ ఎగ్జిట్‌ను ఎంచుకోవచ్చని రెగ్యులేటరీ బాడీ ఛైర్మన్ తెలిపారు. ఎన్‌పీఎస్‌లో చేరడం, పెట్టుబడి ఎంపికను ఆర్థిక సంవత్సరంలో నాలుగు సార్లు మార్చవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Epf, Investments, Nps, Stock Market