హోమ్ /వార్తలు /బిజినెస్ /

National Pension Scheme: NPS సబ్‌స్క్రైబర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పిన PFRDA.. ఏంటంటే..

National Pension Scheme: NPS సబ్‌స్క్రైబర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పిన PFRDA.. ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

National Pension Scheme: NPS సబ్‌స్క్రైబర్లకు PFRDA ఒక గుడ్‌న్యూస్ చెప్పనుంది. సబ్‌స్క్రైబర్లకు లంప్ సంప్ అమౌంట్ చెల్లించేలా ఒక విధానం తీసుకురావాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ ఓ ప్రతిపాదన చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పదవీ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా చాలామంది నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో చేరుతుంటారు. అయితే ఈ స్కీమ్ సబ్‌స్క్రైబర్లకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఒక గుడ్‌న్యూస్ చెప్పనుంది. 75 ఏళ్ల వరకు మంత్లీ, క్వాటర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ కాల వ్యవధిలో NPS సబ్‌స్క్రైబర్లకు లంప్ సంప్ అమౌంట్ చెల్లించేలా ఒక విధానం తీసుకురావాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ ఓ ప్రతిపాదన చేసింది. PFRDA తన ప్రతిపాదనపై అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ అభిప్రాయ సేకరణ అక్టోబర్ 19, 2022 వరకు ఓపెన్ అయి ఉంటుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఎన్‌పీఎస్ పథకంలో చేరినవారు గరిష్ఠంగా 60% మొత్తాన్ని లంప్-సమ్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన వాటిలో కనిష్ఠంగా 40 శాతాన్ని వారు సూపర్‌యాన్యుయేషన్ వయస్సు వచ్చినప్పుడు లేదా 60 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు యాన్యుటీగా ఉపయోగించుకోవచ్చు.

ఇక ప్రీమెచ్యూర్ విషయంలో చందాదారులు లంప్-సమ్‌గా 20% మాత్రమే విత్‌డ్రా చేసుకోవడం కుదురుతుంది. యాన్యుటీని కొనుగోలు చేయడానికి మిగిలిన 80% ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చందాదారుడు కోరుకుంటే, 75 సంవత్సరాల వరకు నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షికంగా ఏకమొత్తాన్ని (లంప్ సమ్ అమౌంట్‌ను) క్రమపద్ధతిలో స్వీకరించే ఆప్షన్‌ను పీఎఫ్‌ఆర్డీఏ అందించాలని భావిస్తోంది. ఆ ప్రతిపాదనలపై ఇప్పుడో లుక్కేద్దాం.

* కొత్త ఆప్షన్ వివరాలు..

PFRDA తాజా ప్రతిపాదనల ప్రకారం, సబ్‌స్క్రైబర్లు సిస్టమాటిక్ లంప్ సమ్ విత్‌డ్రా (SLW)లో ఎంచుకున్న యూనిట్/అమౌంట్‌ను బట్టి NPS డబ్బు అందిస్తుంది. NPS తన టైర్ I & టైర్ II అకౌంట్స్‌కి ఈ సదుపాయాన్ని అందించవచ్చు. అయితే టైర్-II NPS అకౌంట్ హోల్డర్లు సిస్టమాటిక్ లంప్ సమ్ విత్‌డ్రాను ఏ సమయంలోనైనా పొందవచ్చు. దీనర్థం 60 ఏళ్ల వయస్సుకు ముందు కూడా టైర్-II నుంచి ఎప్పుడైనా విత్‌డ్రాలు చేయవచ్చు. ఈ సదుపాయంతో చందాదారునికి లేదా అతని కుటుంబ సభ్యులకు నెలవారీ ఆదాయం వలె డబ్బు అందించాలనేదే PFRDA ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం.

ఇది కూడా చదవండి : మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. వాట్సాప్ లోనే టికెట్ బుకింగ్.. ప్రాసెస్ ఇదే!

కాగా సిస్టమాటిక్ లంప్ సమ్ అభ్యర్థన తర్వాత టైర్ Iలో తదుపరి కాంట్రిబూషన్ లభించదు. విత్‌డ్రా నిబంధనల ప్రకారం యాన్యుటీ, లంప్ సమ్ కోసం టైర్ Iలో అమౌంట్‌ను పక్కన పెడతారు. సిస్టమాటిక్ లంప్ సమ్ విత్‌డ్రాను సెటప్ చేసిన తర్వాత పాక్షిక విత్‌డ్రా చేయడానికి వీలుండదు. సిస్టమాటిక్ లంప్ సమ్ విత్‌డ్రా సమయంలో NPS సబ్‌స్క్రైబర్ స్కీమ్ ప్రాధాన్యత/లేదా పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను ఎంచుకోవచ్చు. అయితే, ఇది అమౌంట్ భాగానికి మాత్రమే వర్తిస్తుంది. విత్‌డ్రా చేసుకోని యాన్యుటీ భాగం అనేది ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఆప్షన్ ప్రకారమే ఉంటుంది. అందులోని కార్పస్‌లో ఎలాంటి మార్పులు వర్తించవు.

PFRDA ప్రతిపాదన ప్రకారం స్టార్ట్, ఎండ్ డేట్‌తో మంత్లీ, క్వాటర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ప్రాతిపదికన ఒక చందాదారుడు సిస్టమాటిక్ అమౌంట్ మొత్తాన్ని విత్‌డ్రా చేయడాన్ని తప్పనిసరి చేయవచ్చు. ముగింపు తేదీ ఖాళీగా ఉంటే, కార్పస్ అందుబాటులోకి వచ్చే వరకు సిస్టమాటిక్ లంప్ సమ్ విత్‌డ్రా ముందే నిర్వచించిన ఫ్రీక్వెన్సీలో ట్రిగ్గర్ అవుతుంది. SLW టైమ్‌ నాటికి చందాదారుడు మరణిస్తే, నామినీ అనుబంధిత నోడల్ ఆఫీస్/POP/ NPST డెత్ విత్‌డ్రా రిక్వెస్ట్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఆపై మొత్తం కార్పస్ నామినీకి దక్కుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: NPS Scheme, Personal Finance, Savings

ఉత్తమ కథలు