Home /News /business /

PFRDA DECIDES TO REDUCE THE TIMELINES OF VARIOUS TRANSACTIONS UNDER THE NPS TO PROVIDE A BETTER SUBSCRIBER EXPERIENCE GH SRD

NPS Transactions: ఎన్‌పీఎస్‌ ట్రాన్సాక్షన్ల ప్రాసెసింగ్‌ టైమ్ తగ్గింపు.. PFRDA కొత్త రూల్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NPS Transactions: NPS సేవలను మెరుగుపరిచేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా సబ్‌స్క్రైబర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ ట్రాన్సాక్షన్లు పూర్తి చేయడానికి అవసరమైన సమయాన్ని తగ్గించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada
వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మలి వయసులో ఈ స్కీమ్ ద్వారా సబ్‌స్క్రైబర్లు (Subscribers) మంచి బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే NPS సేవలను మెరుగుపరిచేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇంతకు ముందుఆన్‌లైన్ ఆధార్ e-KYCని ఉపయోగించి NPS అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం కల్పించింది. తాజాగా సబ్‌స్క్రైబర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ ట్రాన్సాక్షన్లు పూర్తి చేయడానికి అవసరమైన సమయాన్ని తగ్గించింది. * తగ్గిన సెటిల్‌మెంట్‌ రోజులు ఇంతకుముందు NPS అకౌంట్‌ విత్‌డ్రా రిక్వెస్ట్‌ను ప్రాసెస్‌ చేయడానికి T+4 రోజులు తీసుకునేవారు. ఇప్పుడు ఆ సమయాన్ని T+2 వరకు తగ్గించింది PFRDA. నోడల్ ఆఫీస్/PoP/సబ్‌స్క్రైబర్‌ ద్వారా విత్‌డ్రా రిక్వెస్ట్ వచ్చిన రోజును 'T'గా పేర్కొంటారు. '2'ను సెటిల్‌మెంట్ రోజులుగా లెక్కిస్తారు. 'T' అనేది సెటిల్‌మెంట్ కోసం కట్-ఆఫ్ సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఉదయం 10.30 నుంచి 11.00 గంటల మధ్య మారుతూ ఉంటుంది. సెటిల్‌మెంట్‌ రోజులను తగ్గించడంతో NPS అకౌంట్‌ లావాదేవీలు వేగంగా పూర్తవుతాయి. * విత్‌డ్రా రూల్స్ వన్-వే స్విచ్ కింద, సబ్‌స్క్రైబర్‌కు టైర్ II నుంచి టైర్ I ఖాతాకు నిధులను బదిలీ చేసే అవకాశం ఉంది. అలాగే రీబ్యాలెన్సింగ్ కింద, 'ఆటో ఛాయిస్' ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. దీంతో 'లైఫ్ సైకిల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాట్రిక్స్'లో అందించిన సబ్‌స్క్రైబర్ వయస్సు ప్రకారం అసెట్ క్లాస్ E/C/Gలో పెట్టుబడి శాతం మారుతుంది. ఈ ప్రక్రియలో ప్రస్తుత ఆస్తులు, మార్పుల మేరకు, కొత్త కేటాయింపు నిష్పత్తి ప్రకారం రీడీమ్ అవుతాయి. తిరిగి పెట్టుబడుల కింద మారుతాయి. పార్షియల్‌ విత్‌డ్రాలో కనీసం 3 సంవత్సరాలు NPSలో ఉన్న సబ్‌స్క్రైబర్, సబ్‌స్క్రైబర్ చేసిన కంట్రిబ్యూషన్‌లలో గరిష్టంగా 25% విత్‌డ్రా చేసుకోవచ్చు. రెండు పార్షియల్‌ విత్‌డ్రా ట్రాన్సాక్షన్ల మధ్య సబ్‌స్క్రైబర్‌ కంట్రిబ్యూషన్లలో గరిష్టంగా 25% పొందగలరు. * ఎలాంటి సేవలు ఉంటాయి? Protean eGov Technologies Ltd CRA, KFin టెక్నాలజీస్ లిమిటెడ్ & CAMS CRAల అనుసంధానంతో సబ్‌స్క్రైబర్లు ఈ సేవలు పొందుతారు. Protean eGov టెక్నాలజీస్‌తో అనుసంధానమై ఉన్న ఒక సబ్‌స్క్రైబర్, రిక్వెస్ట్‌ను ఉదయం 10.30 గంటలకు అంగీకరిస్తే T+2 ప్రాతిపదికన సెటిల్‌ అవుతుంది. KFin టెక్నాలజీస్ లిమిటెడ్, CAMSకు సంబంధించిన సబ్‌స్క్రైబర్‌ రిక్వెస్ట్‌ ఉదయం 11 గంటలలోపు అంగీకారం పొందితే T+2 ప్రాతిపదికన సెటిల్ అవుతుంది. వర్కింట్‌, సెటిల్‌మెంట్‌ రోజుల పరంగా రిక్వెస్ట్‌ ప్రాసెస్‌ అవుతుంది. ఇది కూడా చదవండి : ఆధార్ కార్డుదారులకు కొత్త సేవలు.. ఇక మరింత భద్రంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు! KFinతో అనుసంధానమైన సబ్‌స్క్రైబర్లు విరమణ, అకాల నిష్క్రమణ, మరణం కారణంగా నిష్క్రమించడం, యాన్యుటీ విత్‌డ్రా, టైర్ II విత్‌డ్రా, పార్షియల్‌ విత్‌డ్రా, పథకం ప్రాధాన్యత మార్పు, రీ-బ్యాలెన్సింగ్, PFM ఛేంజ్‌ రిక్వెస్ట్‌, వన్-వే స్విచ్, ఇంటర్-సెక్టార్, ఛేంజ్‌, ERM వంటి కార్యకలాపాల కోసం రిక్వెస్ట్‌ చేయవచ్చు. Protean eGov టెక్నాలజీస్‌తో సబ్‌స్క్రైబర్లు సూపర్‌యాన్యుయేషన్, అకాల నిష్క్రమణ, మరణం కారణంగా నిష్క్రమించడం, కుటుంబం/వైకల్యం పెన్షన్ , యాన్యుటీ విత్‌డ్రా, టైర్ II విత్‌డ్రా, వన్-వే స్విచ్, రీ-బ్యాలెన్స్ వంటి లావాదేవీల కోసం రిక్వెస్ట్‌ చేసే అవకాశం ఉంటుంది. CAMSతో అనుసంధానమైన సబ్‌స్క్రైబర్లు విరమణ, అకాల నిష్క్రమణ, మరణం కారణంగా నిష్క్రమించడం, యాన్యుటీ విత్‌డ్రా, టైర్ II విత్‌డ్రా వంటి కార్యకలాపాలను రిక్వెస్ట్‌ చేయవచ్చు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Nps, NPS Scheme, Personal Finance, Transaction

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు