దేశంలోని ప్రతి పీఎఫ్ ఖాతాదారునికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తుంది. దీన్నే యూఏఎన్ నెంబర్ అంటారు. ఈ నంబర్ ద్వారానే ఖాతాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్, ఇతర ఈపీఎఫ్ వివరాలను తనిఖీ చేయవచ్చు. యజమాని ప్రమేయం లేకుండానే మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ యూఏఎన్ నంబర్‌తో మీ పాత ఖాతాలను కూడా రద్దు చేసుకోవచ్చు. అయితే ఈ ఆన్లైన్ సేవలన్నీ పొందాలంటే మీ యూఏఎన్ తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉండాలి. కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ మీరు యూఏఎన్ నంబర్‌ను మర్చిపోతే, దాన్ని తిరిగి పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. యూఏఎన్ నంబర్ తెలుసుకోవడానికి.. EPFO అధికారిక పోర్టల్‌ను సందర్శించండి. నో యువర్ యూఏఎన్‌పై క్లిక్ చేయండి.
2. మీ ఈపీఎఫ్ ఖాతాతో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆపై ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
3. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ అందుకుంటారు. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి.
4. ఆ తర్వాత మీ పేరు, పుట్టిన తేదీ మొదలైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.
5. లాస్ట్ స్టెప్ వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ నంబర్, పాన్ నంబర్, మెంబర్ ఐడీ వివరాలను నమోదు చేయండి.
6. షో మై యూఏఎన్‌పై క్లిక్ చేయండి.
7. స్క్రీన్‌పై మీ యూఏఎన్ నంబర్ ప్రత్యక్షమవుతుంది.
* యూఏఎన్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
1. ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
2. యూఏఎన్, మెంబర్ ఐడి, ఆధార్ లేదా పాన్ కార్డ్ వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోండి.
3. మీ పేరు, పుట్టిన తేదీ మొదలైన మీ వ్యక్తిగత వివరాలను జోడించండి.
4. క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి.
5. వివరాల ధ్రువీకరణ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి.
6. అనంతరం వ్యాలిడేట్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ యూఏఎన్ అకౌంట్ వెంటనే యాక్టివేట్ అవుతుంది.
7. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పాస్వర్డ్ అందుకుంటారు.
8. మీ పాస్వర్డ్, యూఏఎన్ నంబర్లతో మీ ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO