PF Rules: పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

PF Withdraw: కరోనా కారణంగా ఖర్చులు పెరిగిపోవడంతో చాలా మంది ప్రైవేటు ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ నిధులను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పీఎఫ్ కార్పస్ నుంచి కొంత మొత్తం తీసుకునేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) ఉద్యోగులకు అవకాశం కల్పించింది.

  • Share this:
సంఘటితరంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగి, కార్మికులు వారి నెలవారీ జీతం నుంచి ప్రావిడెంట్ ఫండ్‌ (Provident Fund)కు కొంత మొత్తం చెల్లిస్తూ ఉంటారు. దానికి అదనంగా యాజమాన్యాలు మరికొంత జమ చేస్తాయి. అయితే కరోనా కారణంగా ఖర్చులు పెరిగిపోవడంతో చాలా మంది ప్రైవేటు ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ నిధులను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పీఎఫ్ కార్పస్ నుంచి కొంత మొత్తం తీసుకునేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) ఉద్యోగులకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో పీఎఫ్‌ ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చు, ఇందుకు ఎలాంటి ప్రాసెస్‌ ఫాలో అవ్వాలి, నిబంధనలు ఎలా ఉన్నాయి.. వంటి విషయాలు తెలుసుకుందాం.

* ఇవి తప్పనిసరి
పీఎఫ్ చందాదారులు.. అంటే ఉద్యోగులు తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)కు మీ మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలి. ఆధార్ (Aadhaar Card), పాన్ (PAN), బ్యాంకు (Bank Account) వివరాలతో కేవైసీ అప్ డేట్ చేయాలి.

Construction కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేసి...గో మూత్రంతో లక్షలు

* ఈపీఎఫ్ పై టాక్స్ వర్తిస్తుందా?
ఐదేళ్లలోపు పీఎఫ్ తీసుకుంటే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల తరువాత పీఎఫ్‌ ఫండ్స్ తీసుకుంటే మాత్రం ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగం నుంచి తొలగిస్తే లేదా అత్యవసర వైద్య సేవల అవసరాలకు విత్ డ్రా చేస్తుంటే మాత్రం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వరుసగా ఐదేళ్లు పీఎఫ్ చెల్లించకుండా ఆ తరువాత పీఎఫ్ తీసుకుంటే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

SBI Mega e-auction: ఇ-వేలం నిర్వహిస్తున్న ఎస్‌బీఐ... ఆ ఆస్తులను ఎలా కొనాలంటే

* ఈపీఎఫ్ క్లెయిమ్ తిరస్కరించే సందర్భాలు
పీఎఫ్ ఖాతాకు బ్యాంకు అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ జత చేయకపోతే క్లెయిమ్ తిరస్కరిస్తారు. కేవైసీ వివరాలు అందించకపోవడం, చెక్‌లో స్పష్టత లేకపోయినా క్లెయిమ్ అప్లికేషన్‌ను తిరస్కరిస్తారు.

* ఆన్‌లైన్‌లో పీఎఫ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి
epfindia.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యాక ముందుగా కేవైసీ వివరాలన్నీ అప్ డేట్ చేయాలి. ఆ తరువాత క్లెయిమ్ విత్ డ్రా వివరాలు పూర్తి చేయాలి. ఈ వివరాలను ఉద్యోగం కల్పించిన యాజమాన్యానికి ఈపీఎఫ్‌ఓ పంపుతుంది. యాజమాన్యం అనుతిచ్చిన పది రోజుల్లో యూఏఎన్‌కు అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలో నగదు జమవుతుంది.

తుక్కు నుంచి లాభాలు పొందండి.. పాత వాహ‌నాన్నితుక్కుగా ఎలా మార్చాలో మార్చాలంటే..

* ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి
ముందుగా epfindia.gov.in వెబ్ సైట్ లాగిన్ అవ్వాలి. ఆన్ లైన్ సేవలపై క్లిక్ చేసి క్లెయిమ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో యూఏఎన్ నెంబర్‌ను నిర్ధారించుకోవాలి. స్కాన్ చేసిన చెక్ లేదా బ్యాంకు పాస్ బుక్ అప్ లోడ్ చేయాలి. విత్ డ్రా చేసుకోవడానికి కారణం తెలపాలి. వెంటనే ఆధార్ అనుసంధానమైన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే చాలు... ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం పది రోజుల్లో బ్యాంకు ఖాతాలో నగదు జమవుతుంది.
Published by:Shiva Kumar Addula
First published: