PF Calculator: ఈపీఎఫ్​లో ప్రతినెలా రూ. 25 వేలు జమ చేస్తే కోటిన్నరకు పైగా రాబడి.. ఎలాగో చూడండి

(ప్రతీకాత్మక చిత్రం)

PF Calculator: ఈపీఎఫ్ సంస్థ 8.5 శాతం వడ్డీ కూడా చెల్లిస్తుంది. బ్యాంకులు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ కన్నా ఇది ఎక్కువే. కనీసం నెలకు రూ.25000 జీతం సంపాదిస్తున్న వ్యక్తి 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే రిటైర్ అయ్యే నాటికి రూ.1.65 కోట్ల భారీ మొత్తం పొందవచ్చు.

  • Share this:
EPF: ఉద్యోగస్తులకు ఈపీఎఫ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా జీతంలో ఈపీఎఫ్ EPF కట్ చేసుకున్న తరవాతే వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మొదట్లో కొంత బాధగా అనిపించినా రిటైర్ అయిన తరవాత ఒకేసారి పెద్ద మొత్తం అందుకునేప్పుడు పొందే ఆనందం చెప్పలేనిది. ఉద్యోగి జీతం నుంచి కొంత, యజమాని కొంత కలిపి ఈపీఎఫ్ EPF లో జమ చేస్తారు. ఈ మొత్తంపై ఈపీఎఫ్ సంస్థ 8.5 శాతం వడ్డీ కూడా చెల్లిస్తుంది. బ్యాంకులు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ కన్నా ఇది ఎక్కువే. కనీసం నెలకు రూ.25000 జీతం సంపాదిస్తున్న వ్యక్తి 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే రిటైర్ అయ్యే నాటికి రూ.1.65 కోట్ల భారీ మొత్తం పొందవచ్చు. అదెలాగో చూద్దాం.

ఇలా చేయండి
ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ పొందే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈపీఎఫ్ వాడుకోవద్దు. ఐదేళ్లలోపే ఈపీఎఫ్ తీసేసుకుంటే దానిపై పన్నులు కూడా చెల్లించాల్సి వస్తుంది. ఒక వేళ ఉద్యోగం మారినా ఈపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ బదిలీ చేసుకోవాలి. మన దేశంలో సగటు ద్రవ్యోల్భణం 6 శాతంగా ఉంది. అంటే ఈపీఎఫ్ అందించే వడ్డీ రేటు కన్నా తక్కువే. ఈపీఎఫ్ సంస్థ ఏటా 8.5 శాతం వడ్డీ అందిస్తోంది. అంటే ద్రవ్యోల్భణంతో పోల్చుకుంటే ఈఫీఎఫ్ వడ్డీరేటు అధికం అన్నమాట.
జీతంపై ఆధారపడి జీవించే వారికి ఈపీఎఫ్ ఒక పెట్టుబడి మార్గంగా చెప్పవచ్చు. ఎందుకంటే పదవీ విరమణ తరవాత జీవితం సాఫీగా సాగేలా పెద్ద మొత్తం ఓకేసారి ఈపీఎఫ్ ద్వారా వస్తుందని ఫినాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ప్రాంజల్ కమ్రా తెలిపారు.

Apple ID: యాపిల్ యూజర్లకు బంపరాఫర్​... రూ.3,000 వరకు బోనస్


ఉద్యోగుల జీతం నుంచి చాలా చిన్న మొత్తం తీసి ఈపీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈపీఎఫ్ చెల్లించడం ద్వారా ఉద్యోగి ఆదాయంపై పెద్దగా ప్రభావం చూపదు, కానీ దీని ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. కేవలం ద్రవ్యోల్భణాన్ని తట్టుకునేందుకే కాదు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని బూటా షా అండ్ కో ఎల్ ఎల్ పి భాగస్వామి జాయ్ జవేరి సూచిస్తున్నారు.

Flipkart Big Diwali Sale 2021: దివాళి సేల్​లో బంపరాఫర్లు.. తెలిస్తే పండగ చేసుకోవచ్చు..


ఈపీఎఫ్ మొత్తం నుంచి తక్కువ వడ్డీకే రుణాలు పొందడంతోపాటు, ఇళ్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి సదుపాయం మరే బీమా పాలసీల్లోనూ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీమా పాలసీ ప్రయోజనాలతో కూడిన అత్యంత ఉపయోగకర పొదుపు పధకాల్లో ఈపీఎఫ్ ఒకటని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ విధమైన స్థిరత్వం, భద్రత ఇవ్వడంలో మరే పథకం కూడా ఈపీఎఫ్ తో పోటీ పడలేవని నిపుణులు అభిప్రాయడుతున్నారు.
Published by:Krishna Adithya
First published: