Petrol Price: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...వినియోగదారులకు స్వల్ప ఊరట

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలలో లీటరు పెట్రోల్‌ ధర 18 పైసలు తగ్గింది. అలాగే చెన్నైలో సైతం పెట్రోల్ ధర 19 పైసలు తగ్గింది.

Krishna Adithya | news18-telugu
Updated: October 4, 2019, 4:27 PM IST
Petrol Price: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...వినియోగదారులకు స్వల్ప ఊరట
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండోరోజూ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలలో లీటరు పెట్రోల్‌ ధర 18 పైసలు తగ్గింది. అలాగే చెన్నైలో సైతం పెట్రోల్ ధర 19 పైసలు తగ్గింది. డీజిల్‌ ధరల విషయానికి వస్తే ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలలో లీటరుకు 8 పైసలు చల్లారగా, చెన్నైలో 9 పైసలు తగ్గింది. తగ్గిన పెట్రోల్ ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 74.33 తాకగా, కోల్‌కతాలో రూ.76.96, ముంబయిలో రూ.79.93, చెన్నైలో రూ.77.21లు పలికింది. ఇక డీజిల్‌ ధరలు చూసినట్లయితే ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 67.35, కోల్‌కతాలో రూ.69.71, ముంబయిలో రూ.70.61, చెన్నైలో రూ.71.15లు పలికింది. ఇదిలా ఉంటే పండగ సీజన్ ముందు పెట్రోల్ ,డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గడం కాస్త ఉపశమనమే. కాగా గత నెల సౌదీలోని చమురు క్షేత్రాలపై ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి.

First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు