చమురు ధరల పతనం, పెట్రోల్ మరో రూ.3 తగ్గే ఛాన్స్

నెల కిందటి వరకూ మనమంతా భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను భరించాం. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటంతో... దేశీయంగా పెట్రోల్ ధరలు కూడా దిగివస్తున్నాయి.

news18-telugu
Updated: December 2, 2018, 11:20 AM IST
చమురు ధరల పతనం, పెట్రోల్ మరో రూ.3 తగ్గే ఛాన్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చమురు ధరలు తగ్గుతుండటం మనకు కలిసొచ్చే అంశం. చమురును ఉత్పత్తి చేసే కంపెనీలకు మాత్రం ఇష్టం ఉండని అంశం. ప్రస్తుతం ఈ పరిణామం... ఇండియా, దక్షిణాఫ్రికా లాంటి చమురును దిగుమతి దేశాలకు భారీగా ప్రయోజనం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో మనది రెండోది. ఇందుకోసం మనం డాలర్ల రూపంలో లక్షల కోట్లు చెల్లిస్తున్నాం. ఇప్పుడు చమురు ధరలు తగ్గడం వల్ల చెల్లింపులు కూడా తగ్గుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల వల్ల నవంబర్ నుంచీ చమురు దిగుమతుల్లో జోరు తగ్గింది. ఫలితంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతున్నాయి. బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్ ధర 100 డాలర్లకు చేరుకుంటుందని రెండు నెలల కిందట... ప్రపంచ చమురు కంపె నీలు లెక్కలేసుకున్నాయి. వారికి షాక్ ఇస్తూ ప్రస్తుతం బ్యారెల్‌ 50 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఇది మనకు లాభదాయకం. ఇప్పటికే మన దేశం రెవెన్యూ లోటుతో సతమతమవుతోంది. ఈ పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం తగ్గి, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం కలుగుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందే వీలుంటుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం


చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన ఇండియా... ఇప్పుడు విదేశీ సంస్థలకు తక్కువ మొత్తమే చెల్లిస్తోంది. అందువల్ల క్రూడ్ ఆయిల్‌పై పెట్టుబడులు తగ్గాయి. మిగిలిన మొత్తాన్ని ఇతరత్రా దేశీయ అవసరాలకు ఉపయోగించే వీలు కలుగుతోంది. జీడీపీ పెరిగేందుకు కూడా వీలవుతోంది.

చమురు ధరలు ఇంకా తగ్గుతాయా :


ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరింత తగ్గి ప్రస్తుతం బ్యారెల్‌‌ 59.46 డాలర్ల దగ్గర ఉండగా... డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 50.93 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. పరిస్థితి చూస్తే, చమురు ధరలు మరింత తగ్గేలాగే ఉన్నాయి. ఇది అంతర్జాతీయ చమురు కంపెనీలను ఆందోళనలో పడేస్తోంది. చమురు ఉత్పత్తి చేసే దేశాలకు ఆర్థికంగా ఇది ప్రమాదకర సంకేతమే. రష్యా, సౌదీ అరేబియా లాంటి 20 దేశాలకు ఇబ్బందికరమే. ఆ దేశాల్లో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం


పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే ఛాన్స్ :ఆరు వారాల కిందట రూ. 90 నుంచి రూ.83 మధ్య ఉన్న పెట్రోలు ధర ఇప్పుడు రూ.80 నుంచి రూ.73కి తగ్గింది. మున్ముందు ఇంకా తగ్గే అవకాశాలున్నాయి. పెట్రోల్ ధర మరో మూడు రూపాయలు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 2, ఆదివారం కూడా ధరలు తగ్గాయి. ఢిల్లీలో 30 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధర రూ.72.23కి చేరింది. డీజిల్ ధర 33 పైసలు తగ్గి రూ.67.02కి చేరింది. ముంబైలో పెట్రోల్ రూ.77.80కి ఉండా... డీజిల్ రూ.70.15కి చేరింది. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ.76.57 ఉండగా.. డీజిల్ ధర 36 పైసలు తగ్గి రూ.72.81గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.76.01 ఉండగా.. డీజిల్‌ రూ.71.84గా ఫిక్సైంది. ధరలు తగ్గాయి కదా అని మనం ఆనందపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్రంలో మోడీ సారధ్యంలో ఎన్టీయే ప్రభుత్వం వచ్చిన కొత్తలో అంటే 2014లో లీటర్ పెట్రోల్ రూ.65 రూపాయలే ఉండేది. ఇప్పుడు కూడా ఆ రేంజ్‌కి తగ్గితే అది అందరికీ మేలే.
First published: December 2, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు