Petrol Price today: వరుసగా 5వ రోజు మండిన పెట్రోల్ ధర...లీటర్ రూ.80 పై మాటే...

క్రూడాయిల్‌ ధరల్లో పెరుగుదల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్‌ ధరలు ఒక ఏడాది గరిష్టానికి చేరుకున్నాయి. దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌ ధర ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

news18-telugu
Updated: November 27, 2019, 6:01 PM IST
Petrol Price today: వరుసగా 5వ రోజు మండిన పెట్రోల్ ధర...లీటర్ రూ.80 పై మాటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో వరుసగా ఐదో రోజూ కూడా పెట్రోలు ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 56 పైసలు పెరిగగా, ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80 మార్కును దాటింది. ఈ లెక్కన లీటర్‌ పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.74.76గా, కోల్‌కతాలో రూ.77.44గా, ముంబయిలో రూ.80.42గా, చెన్నైలో రూ.77.72గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 11 పైసలు పెరిగి రూ.79.56గా నమోదు అయ్యింది. మరోపక్క క్రూడాయిల్‌ ధరల్లో పెరుగుదల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్‌ ధరలు ఒక ఏడాది గరిష్టానికి చేరుకున్నాయి. దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌ ధర ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీని కారణంగా రవాణా చార్జీలు పెరిగి దాని ప్రభావం పరోక్షంగా పేద మధ్య తరగతి ప్రజలపై పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు