Petrol Price : చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ పెంచేస్తున్నాయి. 82 రోజులుగా పెరగకుండా స్థిరంగా ఉన్న ధరలు... ఇప్పుడు మూడ్రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఒకేసారి లీటర్‌కి ఏ ఐదు రూపాయలో పెంచితే... ప్రజలు ఆందోళనలు చేస్తారు. అదే రోజుకో రూపాయి చొప్పున పెంచుకుంటూ పోతే... ఎవరూ పట్టించుకోరనే ఫార్ములాను కంపెనీలు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పెట్రోల లీటర్‌కి 54 పైసలు, డీజిల్ లీటర్‌కి 58 పైసలు పెంచేశాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కి 72.46 నుంచి... రూ.73కి పెరిగింది. అలాగే డీజిల్ ధర... 70.59 నుంచి రూ.71.17కి పెరిగింది.
మార్చి 14న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచింది. ఐతే... ఆ భారం ప్రజలపై వేయవద్దని కండీషన్ పెట్టింది. అదే సమయంలో దేశంలో లాక్డౌన్ వల్ల పెట్రోల్, డీజిల్ వాడకం బాగా పడిపోయింది. డిమాండ్ తగ్గడంతో... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గాయి. ఐతే... ఇండియా తన చమురు వాడకంలో... 85 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల విదేశాల్లో ధరలు పెరిగితే... ఇండియాలోనూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతున్నారు. రోజువారీ ధరలు పెంటే విధానం... 2017 జూన్ 16న మొదలైంది. అప్పటి నుంచి రోజూ ధరల్లో మార్పులొస్తున్నాయి.
ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్ వాడకం బాగా పడిపోయింది. అదే సమయంలో మే 6న కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 పెంచింది. ఆ భారం కూడా ప్రజలపై పడకూడదని కండీషన్ పెట్టింది. ఇప్పుడు మినహాయింపులు ఇచ్చిన తర్వాత... పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. మున్ముందు ఇంకా ఎంత పెంచేస్తారో ఏమో.
దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు
హైదరాబాద్ : పెట్రోల్ రూ.75.78, డీజిల్ రూ.69.56
అమరావతి : పెట్రోల్ రూ.76.36, డీజిల్ రూ.70.20
విజయవాడ : పెట్రోల్ రూ.75.96, డీజిల్ రూ.69.83
ఢిల్లీ : పెట్రోల్ రూ.73.00 డీజిల్ రూ.71.17
ముంబై : పెట్రోల్ రూ.80.01, డీజిల్ రూ.69.92
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diesel price, Petrol price