హోమ్ /వార్తలు /బిజినెస్ /

Petrol Price : వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... సామాన్యులకు కష్టాలే...

Petrol Price : వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... సామాన్యులకు కష్టాలే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Petrol Price : డౌట్ లేదు. చమురు కంపెనీలు వరుస పెట్టి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని డిసైడైనట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్ వల్ల ప్రజల చేతిలో డబ్బు లేని సమయంలో బాదేస్తున్నారుగా...

Petrol Price : చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ పెంచేస్తున్నాయి. 82 రోజులుగా పెరగకుండా స్థిరంగా ఉన్న ధరలు... ఇప్పుడు వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. కొద్దికొద్దిగా ధరలు పెంచితే... ప్రజలు పట్టించుకోరని భావిస్తున్న చమురు కంపెనీలు... సైలెంట్‌గా బాదేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా పెట్రోల్ లీటర్‍‌కి 40 పైసలు, డీజిల్ లీటర్‌కి 45 పైసలు పెంచేశాయి. ఫలితంగా నాలుగు రోజుల్లో పెట్రోల్, డీజిల్ చెరో రూ.2 పెరిగినటలైంది. చూస్తుంటే మున్ముందు కూడా ఇలాగే పెంచుతూ... ప్రజల జేబులకు చిల్లులు పెట్టేలా కనిపిస్తున్నాయి చమురు కంపెనీలు అంటున్నారు సామాన్యులు.

జూన్ 8న షాపింగ్ మాళ్లు, ఆలయాలు, రెస్టారెంట్లూ తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో... దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకం ఒక్కసారిగా పెరిగింది. డిమాండ్ పెరగడంతో... ధరలను పెంచేస్తున్నాయి చమురు కంపెనీలు... నిజానికి అంతర్జాతీయంగా బుధవారం చమురు ధరలు తగ్గాయి. అమెరికాలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి పెరగడంతో... సప్లై ఎక్కువవుతోందనే ఉద్దేశంతో... ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఫీచర్స్... 57 సెంట్లు తగ్గి 40.61 డాలర్లకు చేరింది. ఇక WTI క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.9 శాతం తగ్గి 38.21 డాలర్లకు చేరింది. అందువల్ల మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి. కానీ చమురు కంపెనీలు అందుకు రివర్సులో నిర్ణయం తీసుకున్నాయి.

ప్రస్తుతం దేశంలోని 90 శాతం పెట్రోల్, డీజిల్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) అమ్ముతున్నాయి. వీటికే దేశంలో ఎక్కువ పెట్రోల్ బంకులు ఉన్నాయి.

దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు

హైదరాబాద్‌ : పెట్రోల్‌ రూ.76.20, డీజిల్‌ రూ.70.00

అమరావతి : పెట్రోల్‌ రూ.76.76, డీజిల్‌ రూ.70.65

విజయవాడ : పెట్రోల్‌ రూ.76.36, డీజిల్‌ రూ.70.27

ఢిల్లీ : పెట్రోల్‌ రూ.73.40 డీజిల్‌ రూ.71.62

ముంబై : పెట్రోల్‌ రూ.80.41, డీజిల్‌ రూ.70.35

First published:

Tags: Diesel price, Petrol price

ఉత్తమ కథలు