Petrol Price: ఇలా చేస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.75 మాత్రమే

Petrol Price: ఇలా చేస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.75 మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)

Petrol Price | ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.100 కి చేరుకుంటోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క నిర్ణయం తీసుకుంటే పెట్రోల్ ధర రూ.75 కి దిగొస్తుంది.

  • Share this:
    పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ రేటు సెంచరీకి చేరిపోయింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.100 దాటింది. లీటర్ పెట్రోల్‌కు చెల్లించే మొత్తంలో ఎక్కువ భాగం పన్నులే. పెట్రోల్, డీజిల్ జీఎస్‌టీ పరిధిలో లేదు. ఒకవేళ పెట్రోల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా? రూ.75. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఆర్థికవేత్తలు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలన్నా డిమాండ్ చాలాకాలంగా ఉన్నదే. అదే జరిగితే పెట్రోల్ ధర భారీగా దిగొస్తుంది. పెట్రోల్‌ను జీఎస్‌టీ కిందకు తీసుకొస్తే లీటర్ ధర రూ.75 కి చేరుకుంటుందని, కానీ రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల ఇది జరగట్లేదని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు వెల్లడించారు.

    పెట్రోల్ మాత్రమే కాదు... డీజిల్ ధర కూడా భారీగా తగ్గుతుంది. ఒకవేళ డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే లీటర్ డీజిల్ రూ.68 ధరకు చేరుకుంటుంది. అంటే పెట్రోల్ ధర సుమారు 25 శాతం, డీజిల్ ధర సుమారు 30 శాతం వరకు తగ్గుతుంది. అదే జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష కోట్ల రూపాయలు నష్టపోతాయని, ఇది దేశ జీడీపీలో 4 శాతం అని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల్ని 60 డాలర్లు, డాలర్ ఎక్స్‌ఛేంజ్ రేట్ రూ.73 గా లెక్కించారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవని, వారికి పెట్రోలియం ఉత్పత్తులపై వసూలు చేసే పన్నులు ప్రధాన ఆదాయంగా మారాయని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది.

    Aarogya Setu App: ఆరోగ్య సేతు యాప్‌లో కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్... స్లాట్ బుక్ చేయండి ఇలా

    Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త... లాక్‌డౌన్ తర్వాత ఈ సర్వీస్ మళ్లీ ప్రారంభం

    ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై యాడ్ వాలోరెమ్ ట్యాక్స్, సెస్, వ్యాట్, సర్‌ఛార్జ్ లాంటి వాటిని వసూలు చేస్తున్నాయి రాష్ట్రాలు. క్రూడ్ ఆయిల్ ధర, రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్ లాంటివాటిపై ఈ పన్నులు ఉంటాయి. వీటితో పాటు కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ పన్నులు, ఛార్జీల లెక్క చూస్తే రవాణా ఛార్జీలు డీజిల్‌కు రూ.7.25, పెట్రోల్‌కు రూ.3.82, డీలర్ కమిషన్ డీజిల్‌కు 2.53, పెట్రోల్‌కు రూ.3.67, సెస్ పెట్రోల్‌పై రూ.30, డీజిల్‌పై రూ.20 చొప్పున ఉన్నాయి. ఏటా డీజిల్ వినయోగం 15 శాతం, పెట్రోల్ వినియోగం 10 శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఒకవేళ జీఎస్‌టీలోకి తీసుకొస్తే ఖజానాపై లక్ష కోట్ల రూపాయల పైనే ప్రభావం చూపిస్తుంది.

    Best 5G Smartphones: కొత్త మొబైల్ కొంటున్నారా? రూ.20,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    IRCTC Tour: పూరీ, కోణార్క్ వెళ్తారా? ఐదు రోజుల టూర్ ప్యాకేజీ రూ.5,250 మాత్రమే

    క్రూడ్ ఆయిల్ ధర ఒక డాలర్ పెరిగితే లీటర్ పెట్రోల్ 50 పైసలు, లీటర్ డీజిల్ రూ.1.50 పెరుగుతుంది. కానీ బ్యారల్ ధర 10 డాలర్లు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.18,000 కోట్లు ఆదా అవుతోంది. ఇక ఎల్‌పీజీ సిలిండర్ల విషయానికి వస్తే పేదలకు సబ్సిడీ కొనసాగించాలని, ఐదేళ్లలో తగ్గిస్తూ రావచ్చని ఎస్‌బీఐ ఆర్థిక నిపుణులు వెల్లడించారు.
    Published by:Santhosh Kumar S
    First published: