Petrol & diesel price today : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో మార్పులేవీ రాలేదు. అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినా... ఆ ప్రకారం... దేశీయంగా చమురు కంపెనీలు... ధరలను తగ్గించలేదు. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ రేటు రూ.73.97గా ఉంది. డీజిల్ రేటు రూ.67.82గా ఉంది. ఏపీ... అమరావతిలో పెట్రోల్ రేటు రూ.74.61గా, డీజిల్ రేటు రూ.68.52గా ఉంది. విజయవాడలో పెట్రోల్ లీటర్ రూ.74.21 ఉండగా డీజిల్ లీటర్ రూ.68.15గా ఉంది. ఎక్కడా ధరల్లో మార్పులు రాలేదు. ఢిల్లీలో పెట్రోల్ రూ.71.26గా ఉంది. డీజిల్ రూ.69.39గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.76.31గా ఉండగా... డీజిల్ రూ.66.21గా ఉంది.
ప్రపంచంలో ముడి చమురు (క్రూడాయిల్) రేట్లు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్కు 0.87 శాతం తగ్గి 37.41 డాలర్లకు చేరింది. ఇక WTI క్రూడాయిల్ రేటు బ్యారెల్కు 1.24 శాతం తగ్గి 35.05 డాలర్లకు చేరింది. రూల్ ప్రకారమైతే చమురు ధర తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధర కూడా తగ్గాలి. కానీ... ఇప్పుడు దేశంలో మళ్లీ వాహనాల రద్దీ పెరుగుతోంది కదా. డిజీల్, పెట్రోల్ వాడకం పెరుగుతుంది కాబట్టి... ధర తగ్గిస్తే... మరింత ఎక్కువగా వాడతారనే ఆలోచనతో కంపెనీలు ధరలు తగ్గించట్లేదు. ఇది సరైన పద్ధతి కాదని తెలిసి కూడా ఇలా చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diesel price, Petrol price