Home /News /business /

PETROL LPG MONEY TRANSFER AND SOME OTHER NEW RULES IMPLEMENTED ON JUNE 1 SS

New Rules: జూన్‌లో కొత్త రూల్స్... మీరు తెలుసుకోవాల్సిన 6 నిబంధనలివే

New Rules: జూన్‌లో కొత్త రూల్స్... మీరు తెలుసుకోవాల్సిన 6 నిబంధనలివే
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: జూన్‌లో కొత్త రూల్స్... మీరు తెలుసుకోవాల్సిన 6 నిబంధనలివే (ప్రతీకాత్మక చిత్రం)

New Rules | గతంలో ఆర్‌టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ ఇనీషియల్ కటాఫ్ సమయం సాయంత్రం 4.30 గంటలు ఉండేది. ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటలకు పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

    జూన్ 1 వచ్చేసింది. కొత్త నెల మొదలైంది. కొత్త నెలతో పాటు కొత్త రూల్స్ కూడా మొదలయ్యాయి. నేటితో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చేశాయి. మనీ ట్రాన్స్‌ఫర్ విషయంలో ఆర్‌బీఐ కొత్త రూల్స్ అమలు చేసింది. దాంతో పాటు ఎల్‌పీజీ ధరలు కూడా మారాయి. వడ్డీ రేట్లల్లో కూడా మార్పులు వచ్చాయి. బ్యాంక్, పెట్రోల్, ఎల్‌పీజీ... ఇలా మీకు రోజువారీ జీవితానికి ముడిపడి ఉన్న కొత్త నిబంధనలు ఇవి. మరి ముఖ్యమైన ఆ రూల్స్ ఏంటీ? వాటి గురించి మీరు ఏం తెలుసుకోవాలి? అవి మీపై ఎలా ప్రభావం చూపిస్తాయి? మీపై ఆర్థికంగా భారం మోపుతాయా? లేక డబ్బును, సమయాన్ని ఆదా చేస్తాయా? తెలుసుకోండి.

    1. ఆర్‌టీజీఎస్ వేళలు: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారు తెలుసుకోవాల్సిన కొత్త నిబంధన ఇది. జూన్ 1 నుంచి ఆర్‌టీజీఎస్ లావాదేవీల వేళలు మారాయి. గతంలో ఆర్‌టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ ఇనీషియల్ కటాఫ్ సమయం సాయంత్రం 4.30 గంటలు ఉండేది. ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటలకు పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్‌టీజీఎస్ ద్వారా మీరు ఒకేసారి రూ.2 లక్షల కన్నా ఎక్కువ మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

    2. ఎల్‌పీజీ సిలిండర్: సామాన్యులకు చేదువార్త ఇది. జూన్ 1 నుంచి ఎల్‌పీజీ ధరలు పెరిగాయి. కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. నాన్-సబ్సిడైజ్డ్ డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్లకు రూ.25, సబ్సిడీ సిలిండర్లకు రూ.23 అదనంగా చెల్లించాలి.

    3. పెట్రోల్: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేకపోతే ఇక పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ దొరకదు. జూన్ 1 నుంచి నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఈ నిబంధన అమలులోకి వచ్చింది. అయితే త్వరలో ఈ రూల్ దేశమంతా అమలులోకి రావొచ్చు.

    4. ఆర్మీ క్యాంటీన్: జూన్ 1 నుంచి ఆర్మీలో పనిచేసే ఉద్యోగులు రూ.12 లక్షల కన్నా ఎక్కువ విలువైన కార్లను ఆర్మీ క్యాంటీన్‌లో సబ్సిడీపై కొనలేరు. కొత్త నిబంధనలు జూన్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఎనిమిదేళ్లకు ఒకసారి మాత్రమే సబ్సిడీపై కారు కొనాలి.

    5. ఫ్లడ్ సెస్: భారీ వరదలతో అతాలకుతలమైన కేరళలో పునర్నిర్మాణ పనులకు నిధుల కోసం 1% ఫ్లడ్ సెస్ విధించనుంది కేరళ ప్రభుత్వం. 5% జీఎస్టీ శ్లాబ్‌లో ఉన్న వస్తువులకు ఇది వర్తిస్తుంది. జూన్ 1 నుంచి కొత్త పన్ను అమలులోకి వచ్చింది.

    6. వడ్డీ రేట్లు: జూన్ 6న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త వడ్డీ రేట్లు ప్రకటించే అవకాశముంది. వడ్డీ రేట్లు తగ్గితే ప్రజలకు ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. కొత్తగా లోన్లు తీసుకునేవారికి తక్కువ వడ్డీ ఆఫర్ చేస్తాయి బ్యాంకులు.

    Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


    ఇవి కూడా చదవండి:

    PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

    Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

    ఆన్‌లైన్‌లో చెప్పులు కొంటున్నారా? ఈ 11 జాగ్రత్తలు తప్పనిసరి
    First published:

    Tags: LPG Cylinder, Personal Finance, Petrol, Rbi, Save Money

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు