హోమ్ /వార్తలు /బిజినెస్ /

Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటి నుంచి తగ్గుతాయ్.. కేంద్రం ప్లాన్ ఇదే!

Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటి నుంచి తగ్గుతాయ్.. కేంద్రం ప్లాన్ ఇదే!

 Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటి నుంచి తగ్గుతాయ్.. కేంద్రం ప్లాన్ ఇదే!

Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటి నుంచి తగ్గుతాయ్.. కేంద్రం ప్లాన్ ఇదే!

Petrol Rate | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా పైస్థాయిల్లోనే కదలాడుతున్నాయి. మరి ఫ్యూయెల్ రేట్లు తగ్గుతాయా? లేదా? తగ్గితే ఎప్పటి నుంచి తగ్గుతాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Petrol Price | పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంలో గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొండెక్కిన ఫ్యూయెల్ ధరలు (Fuel Rates) మళ్లీ అక్కడి నుంచి కిందకు దిగిరావడం లేదు. దీంతో సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. పెట్రోల్ (Petrol Price), డీజిల్ ధరలను (Diesel Rate) అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటోంది. వీటిల్లో ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయెల్ కూడా ఒక భాగమనే చెప్పుకోవాలి.

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే ఉద్దేశంతో 2023 నాటికి 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ సమాచారాన్ని వెల్లడించారు. అంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అందుబాటులోకి వస్తే.. అప్పుడు మీరు పెట్రోల్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా దీని వల్ల ముడిచమురు దిగుమతులపై ఏటా దేశానికి 4 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయి.

రూ.6 వేలు పతనమైన బంగారం, వెండి ధరలు.. జస్ట్ 10 రోజుల్లోనే భారీ తగ్గుదల!

‘మేము నిరంతరం ఇథనాల్ ఉత్పత్తిని సమీక్షిస్తున్నాము. 20 శాతం బ్లెండింగ్ ఇంధనం 2023 ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే లక్ష్యాన్ని ముందే చేరుకోవచ్చు. డిసెంబర్ లేదా జనవరిలో మార్కెట్లోకి బ్లెండెడ్ పెట్రోల్ అందుబాటులోకి రావొచ్చు’ అని ఆయన వివరించారు.

ఎస్‌బీఐ కస్టమర్లకు దీపావళి గిఫ్ట్.. ఈరోజు నుంచి..

పెట్రోలియం మంత్రిత్వ శాఖ 2009లో నేషనల్ బయో ఫ్యూయెల్ పాలసీని అమలు చేసింది. తర్వాత 2018 జూన్ 4న దీని స్థానంలో బయోఫ్యూయల్ - 2018 జాతీయ విధానాన్ని నోటిఫై చేశారు. రాబోయే రెండేళ్లలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఖరీదైన చమురు దిగుమతుల విషయంలో ఇది చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది.

బ్రెజిల్‌ను ఉదహరిస్తూ.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు అక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. కొనుగోలుదారులు తమ ఇష్టానుసారం ఇథనాల్ లేదా పెట్రోల్ కొనుగోలు చేయవచ్చని ఆయన అన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ అంశంపై ఆటోమొబైల్ తయారీదారులతో పెద్ద ఎత్తున సమావేశం కాబోతున్నామని చెప్పారు. ‘మా వద్ద 20 శాతం బ్లెండింగ్ కోసం తగినంత కంటే ఎక్కువ ఇథనాల్ ఉంది. దేశంలో విక్రయించే అన్ని రకాల పెట్రోల్‌లో కూడా 2025 కల్లా 20 శాతం ఇథనాల్ కలిసి ఉంటుంది’ అని తెలిపారు. కాగా హర్యానాలోని పానిపట్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ సమీపంలో రూ.900 కోట్ల వ్యయంతో ఇథనాల్ ప్లాంట్‌ను నిర్మించారు.

First published:

Tags: Crude Oil, Diesel, Petrol, Petrol Price, Petrol rate

ఉత్తమ కథలు