చుక్కలు తాకనున్న పెట్రోల్, డీజిల్ ధరలు...ఇవే కారణాలు

అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ సూచీ‌లో బ్యారల్ ధర 1.68 డాలర్లు(2.6 శాతం) పెరిగి 66.25 డాలర్లకు చేరుకుంది. గత ఏడాది నవంబరు తర్వాత బ్యారల్ క్రూడాయిల్ అత్యధిక ధరను శుక్రవారం నమోదు చేసుకుంది

news18-telugu
Updated: February 16, 2019, 1:40 PM IST
చుక్కలు తాకనున్న పెట్రోల్, డీజిల్ ధరలు...ఇవే కారణాలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 16, 2019, 1:40 PM IST
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశంలో పెట్రల్, డీజిల్ ధరలు ముందు ముందు చుక్కలు తాకే అవకాశముంది. శుక్రవారం(15 ఫిబ్రవరి) ఒక్క రోజే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఏకంగా 2 శాతానికి పైగా పెరిగాయి. తమ దేశం నుంచి క్రూడాయిల్ ఎగుమతులను సౌదీ అరేబియా కట్టడి చేయడం,అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి ఏర్పడడం వంటి అంశాలు దీనికి కారణంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా-చైనాల మధ్య ట్రేడ్ వార్ కొనసాగే అవకాశం లేదన్న అంచనాలతో క్రూడాయిల్‌కు డిమాండ్ పెరిగింది.

అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ సూచీ‌లో బ్యారల్ ధర 1.68 డాలర్లు(2.6 శాతం) పెరిగి 66.25 డాలర్లకు చేరుకుంది. గత ఏడాది నవంబరు తర్వాత బ్యారల్ క్రూడాయిల్ అత్యధిక ధరను శుక్రవారం నమోదు చేసుకుంది.


petrol price, petrol prices today, diesel price today, petrol diesel, fuel prices today, పెట్రోల్, డీజిల్, పెట్రో ధరలు
ప్రతీకాత్మక చిత్రం


క్రూడాయిల్ ఉత్పత్తిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సౌదీ అరేబియాలోని సఫానియా ఆయిల్‌ఫీల్డ్‌ను పాక్షికంగా మూసేశారు. రెండు వారాల క్రితమే సఫానియా ఆయిల్ ఫీల్డ్‌ను పాక్షికంగా మూసేసినట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ 1 మిల్లియన్ బ్యారల్స్‌ కంటే ఎక్కువ క్రూడాయిల్ ఉత్పత్తి సామర్థ్యం సఫానియా ఆయిల్ ఫీల్డ్‌ సొంతం. ఇక్కడ ఎప్పటి నుంచి పూర్తి స్థాయి క్రూడాయిల్ ఉత్పత్తిని ప్రారంభిస్తారో తెలియరావడం లేదు.



సౌదీ అరేబియాకు ముందే పలు ఒపెక్‌ భాగస్వామ్య దేశాలు ఆయిల్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. మార్చి మాసంలో ఆయిల్ ఉత్పత్తిని మరింత తగ్గించనున్నట్లు సౌదీ అరేబియా మూడ్రోజుల క్రితం ప్రకటించింది. దీంతో ఆయిల్‌ సరఫరా మరింత తగ్గి పలు దేశాల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ముందు ముందు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. తన అవసరాలకు భారత్ కూడా ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉండడంతో ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.


petrol price in india, petrol price hike, OPEC, petrol diesel price, petrol price today, petrol price today india, price rise, diesel price today, diesel prices going up, fuel price hike in india, ఒపెక్ సభ్య దేశాల మధ్య చమురు ఉత్పత్తిని తగ్గించే అంశంపై ఓ డీల్ కుదిరింది. రోజుకు 12 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించబోతున్నాయి. ఏ దేశాలు ఎంత కోత విధించుకోవాలనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. తాజా ఒప్పందంతో చమురు ధరలు 5 శాతం పెరిగాయి. OPEC and Fuel Producing countries agree to cut oil production by 1.2 million barrels per day
చమురు ఉత్పత్తి (ప్రతీకాత్మక చిత్రం)


అమెరికా ఆంక్షల కారణంగా వెనిజులా, ఇరాన్, లిబియాల్లోనూ క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో ఆ దేశాల నుంచి భారత్‌కు క్రూడాయిల్ దిగుమతులు జనవరి మాసంలో గణనీయంగా పడిపోయాయి. జనవరి మానంలో ఇరాన్ నుంచి ఇంధన దిగుమతులు ఏకంగా 45 శాతం తగ్గాయి. ఈ అంశాలు కూడా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు కారణమయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోడీ సర్కారుకు ఇది ఇబ్బందికర పరిణామంగా మారనుంది.
First published: February 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...