హోమ్ /వార్తలు /బిజినెస్ /

Petrol Price: బీ రెడీ... అదే జరిగితే పెట్రోల్ ధరలు మళ్లీ తగ్గడం ఖాయం

Petrol Price: బీ రెడీ... అదే జరిగితే పెట్రోల్ ధరలు మళ్లీ తగ్గడం ఖాయం

Petrol Price: బీ రెడీ... అదే జరిగితే పెట్రోల్ ధరలు మళ్లీ తగ్గడం ఖాయం
(ప్రతీకాత్మక చిత్రం)

Petrol Price: బీ రెడీ... అదే జరిగితే పెట్రోల్ ధరలు మళ్లీ తగ్గడం ఖాయం (ప్రతీకాత్మక చిత్రం)

Petrol Diesel Prices | కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) తగ్గించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గడం ఖాయం.

పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయని ఆందోళన చెందుతున్నవారికి గుడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) మళ్లీ తగ్గే అవకాశం ఉంది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బిజినెస్ టుడే కథనం ప్రకారం ఈ చర్చలు ఫలిస్తే పెట్రోల్, డీజిల్‌పై మరోసారి ఎక్సైజ్ డ్యూటీ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.27.90, లీటర్ డీజిల్‌పై రూ.21.80 ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభకు గతేడాది రాతపూర్వకంగా తెలిపింది.

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు ప్రతీ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం. గత 20 రోజుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 వరకు ధర పెరిగింది. అయితే గత ఆరు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోవడం విశేషం.

Business Idea: ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్... రూ.70,000 పెట్టుబడి చాలు

మంగళవారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూస్తే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.105.49. న్యూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.96.67. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.104.77. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.09 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.79.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలు దిగొస్తాయి. ఐదు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సుంకం తగ్గించుకుంది. దీంతో అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఆమేరకు తగ్గాయి. కానీ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆ ప్రభావం పెట్రోల్ డీజిల్‌పై పడింది.

EPF PAN Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ నష్టం తప్పదు

పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాదు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలు రూ.50 పెరగగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.250 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,002 కాగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,460.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Diesel price, Petrol Price, Petrol prices

ఉత్తమ కథలు