హోమ్ /వార్తలు /బిజినెస్ /

వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... టైమ్ చూసి బాదేస్తున్నారుగా...

వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... టైమ్ చూసి బాదేస్తున్నారుగా...

వరుసగా 9వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...

వరుసగా 9వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...

దేశంలో కరోనా లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్న వేళ ఎలాగూ ప్రజలు రోడ్లపై ఎక్కువగా తిరుగుతారని గ్రహించి... చమురు కంపెనీలు... ధరలను వడ్డిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మైనస్‌కి పడిపోయినప్పుడు... పెట్రోల్ కంపెనీలు... పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ను ఫ్రీగా ఇవ్వలేదు. అలాంటిది... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయంటూ... పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా పెంచుతారన్నది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఆదివారం రేట్లను పెంచిన చమురు కంపెనీలు... సోమవారం మళ్లీ లీటర్‌కి రూ.60 పైసలు చొప్పున పెంచేశాయి. 82 రోజులుగా పెట్రోల్ ధరల్లో మార్పులు చేయని కంపెనీలు... ఇప్పుడు లాక్‌డౌన్ నుంచి మరిన్ని మినహాయింపులు కేంద్రం ఇస్తుంటే... పెట్రోల్, డీజిల్ వాడకం పెరుగుతుందని గ్రహించి... రోజువారీగా పెట్రోల్ ధరలను పెంచేస్తున్నాయి.

తాజా పెంపుదతో... పెట్రోల్ ధర లీటర్ రూ.71.86 నుంచి రూ.72.46 అవ్వగా.. డీజిల్ ధర లీటర్ రూ.69.99 నుంచి 70.59 అయ్యింది. ఆదివారం కూడా ఇంతే ధరను పెంచాయి. చివరిసారిగా మార్చి 16న పెట్రోల్, డీజిల్ ధరలను డైనమిక్ ప్రైస్ పాలసీ ప్రకారం మార్పులు చేశారు. ఐతే... ఢిల్లీ లాంటి ప్రభుత్వాలు ఖజానాలో ఆదాయం తగ్గిపోవడంతో... పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్ వేశాయి. ఐతే... లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాక... పెంచిన వ్యాట్ తగ్గించారు.

మే 6న కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెటోలుపై రూ.10 పెంచింది. డీజిల్‌పై రూ.13 పెంచింది. ఐతే... ఆ పెంపు... ప్రజలపై పడకుండా ధరలు మార్చకుండా చేసింది. ఇకపై రోజువారీ ధరలను సమీక్షిస్తూ... మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు

హైదరాబాద్‌ : పెట్రోల్‌ రూ.75.22, డీజిల్‌ రూ.69.00

అమరావతి : పెట్రోల్‌ రూ.75.82, డీజిల్‌ రూ.69.65

చెన్నై : పెట్రోల్‌ రూ.76.60, డీజిల్‌ రూ.69.25

ఢిల్లీ : పెట్రోల్‌ రూ.72.46 డీజిల్‌ రూ.70.59

ముంబై : పెట్రోల్‌ రూ.79.49, డీజిల్‌ రూ.69.37

First published:

Tags: Coronavirus, Covid-19, Diesel price, Petrol prices

ఉత్తమ కథలు