దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు నుంచే తగ్గిన రేట్లు అమలులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) భారీగా తగ్గాయి. ప్రజలకు మరింత లాభం చేకూర్చేందుకు వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) కూడా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో చాలావరకు పన్నులే ఉంటాయన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది.
ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం సామాన్యులకు కాస్త ఊరటే. మరి ఎక్సైజ్ డ్యూటీ తగ్గడంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.62. ఇక వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి నగరాల్లోనే కాదు... మీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే కేవలం ఒక్క ఎస్ఎంఎస్ చాలు.
Business Idea: నష్టాలు ఉండని ఎవర్గ్రీన్ బిజినెస్ ఐడియా... మీరూ స్టార్ట్ చేయండి ఇలా
ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజిల్ ధరల్ని తెలిపేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కంపెనీలు ఎస్ఎంఎస్ సర్వీస్ అందిస్తున్నాయి. ఈ కంపెనీలకు చెందిన నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి.
అయితే ఈ కంపెనీలు సూచించిన కోడ్స్ ప్రకారమే ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఒకే మెసేజ్‌తో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుస్తాయి. ఇందుకోసం మీరు మీ ఫోన్ నుంచి 9224992249 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీరు హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
Aadhaar Violation: ఆధార్ వివరాలు దుర్వినియోగం చేస్తే కోటి రూపాయల జరిమానా
విజయవాడలో రేట్ల కోసం RSP 127611, విశాఖపట్నంలో రేట్ల కోసం RSP 127290 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ ఫార్మాట్లో ఎస్ఎంఎస్ పంపిస్తేనే మీకు సరైన వివరాలు తెలుస్తాయి. 9224992249 నెంబర్ ఐఓసీఎల్‌కు చెందినది. భారత్ పెట్రోలియంకు చెందిన పెట్రోల్ బంకుల్లో రేట్ల కోసం 9223112222 నెంబర్‌కు, హిందుస్తాన్ పెట్రోలియంకు చెందిన పెట్రోల్ బంకుల్లో రేట్ల కోసం 9222201122 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు అప్డేట్ అవుతాయి. మీ ఏరియాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయో, ఎంత తగ్గాయో తెలుసుకోవడానికి ఈ ఎస్ఎంఎస్ సర్వీస్ ఉపయోగపడుతుంది. ఇదే కాదు లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కంపెనీలకు చెందిన మొబైల్ యాప్స్ కూడా ఉపయోగించొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Petroleum Corporation Limited, Diesel price, Indian Oil Corporation, Petrol, Petrol Price, Petrol prices, Petrol rate