భారీగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు.. కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

వాహనదారులకు ఊరట కలిగించేలా రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. నెల రోజులుగా చమురు ధరలు రూ.3 మేర తగ్గాయి. జనవరి 12 నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

  • Share this:
    వాహనదారులకు ఊరట కలిగించేలా రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. నెల రోజులుగా చమురు ధరలు రూ.3 మేర తగ్గాయి. జనవరి 12 నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలు మూడు నెలల కాలంలో కనిష్ఠానికి చేరుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.77.55, డీజిల్ ధర రూ.71.89గా ఉంది. అయితే, ఈ ధరలు తగ్గడానికి ప్రధాన కారణం కరోనా వైరస్ అని అంటున్నారు నిపుణులు. కరోనా వైరస్‌కు, చమురు ధరలకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? పెద్ద కారణమే ఉందండోయ్.. ఓ నివేదిక ప్రకారం.. కరోనా కేసులు నమోదైనప్పటి నుంచి చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయట.

    వివరాల్లోకెళితే.. చమురు వినియోగంలో చైనా రెండో అతి పెద్ద వినియోగదారు. అయితే.. కరోనా వైరస్ విజృంభించడంతో వినియోగం తగ్గిందట. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువైనప్పటి నుంచి చైనా చమురు వినియోగం 20 శాతం తగ్గిందట. దాంతో డిమాండ్ తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడి తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: